దైవం మానుష రూపేనా..! - వినాయకం ప్రకాష్

Daivam manusha roopena

"తల్లీ నీకు వచ్చే ఏడాది వెండి గొడుగు,కోరలు చేయిస్త ఈసారైనా కొత్త బోరులో నీళ్లు పడే టట్లు చెయ్ తల్లి" అంటూ కొబ్బరికాయ కొట్టి బోరు మిషన్ కి పూజ చేసింది మహిళా రైతు శాంతమ్మ,బోరు మిషన్ మొదలైన ప్పటి నుంచి మొత్తం బండ రాయి వస్తోంది దాదాపు ఐదొందలు అడుగులు..తవ్వినా నీటి చుక్క లేదు, శాంతమ్మ మనస్సు వేదనతో నిండిపోయింది." ఏమక్కా ..! ఇంకా రెండు వందల అడుగులు వేద్దామా..? ఆపేద్దామా..?? అన్నాడు రంగడు. రంగడు శాంతమ్మ కి వరుసకు తమ్ముడు..భర్త లేని శాంతమ్మ కుటుంబానికి కొండంత అండ రంగడు. "రే రంగా..నీళ్లు పడి పంటలు పండితే ఈసారి పెద్ద పిల్ల పెళ్లికి బంగారం చేయించాలి రా..!" ఈ సారైనా నా కోరిక నెరవేరుతుందో లేదో అనింది దీనంగా రంగమ్మ,గ అక్కా.. మనది ముందే మెట్టచేను..మన రాయలసీమ లో నీళ్లు అంత త్వరగా ఎలా పడతాయి అక్కా...? ఇంకో సారి ఆలోచించుకో.. ఇప్పటికే యాభై వేలు అయ్యింది. మళ్ళీ లోతు తవ్వి అప్పుచేయడం ఎందుకు .??.అన్నాడు. సరే దేవుడు పెట్టినట్టు అవుతుంది కానీ రా...రంగా ...! అని బోర్ తవ్వమని చెప్పింది ..బోర్ మిషన్ 1000 అడుగులు తవ్వినా నీళ్లు రావడం లేదు రంగన్నా...మీకు బోర్ పాయింట్ పెట్టినోడు అనవసరంగా మీచెనులో నీళ్లు పడతాయి అని మీరు ఇచ్చే డబ్బుకి ఆశ పడి అబద్ధం చెప్పినట్టుగా ఉన్నాడు .ఇంక ఎంత వేసినా.ప్రయోజనం లేదని అన్నారు. బోర్ మిషన్ ఆపరేటర్. ఇంక నీళ్లు రావని తెల్సి శాంతమ్మ ఆశలన్నీ పేక మేడలా కూలిపోయాయి..చేసేది లేక తెల్లటి ముగ్గిపిండి లాగా ఉన్న ఒట్టి మట్టి లోనే కుమిలి కుమిలి ఏడుస్తూ కూలబడిపోయి సర్వస్వం కోల్పోయినట్టు విషాదంలో మునిగిపోయింది శాంతమ్మ. .బిడ్డల భవిష్యత్ తలచుకొని కన్నీరుమున్నీరుగా ఏడ్చింది..ఆమె బాధను చూసిన అందరూ బాధతో కంట తడి పెట్టినారు....పిల్లలు ఆమెని సముదాయిస్తూ ఇంటికి తీసుకొని వెళ్లారు, ఆరాత్రి అంతా నిద్ర లేదు శాంతమ్మకి కళ్లు ఆందోళనతో మూతలు పడటం లేదు..పిల్లలు కూడా తల్లిని తలచుకొని మౌనంగా రోదిస్తూన్నారు.. ఇంక బతకడం వృధా..అని రైతుగా..వ్యవసాయములో ఓడిపోయాను..! పిల్లల్ని పోషించలేక తల్లిగా ఒడిపోయాను..!! అనకుని తన నిస్సహాయతను పదే పదే తలచుకొని మనస్సులోనే ఏడ్చింది..తనను తన కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరని..అప్పులు తీరే మార్గం లేదని..ఉన్న భూమి అమ్మి అప్పులు తీర్చి తన పొలంలోనే పిల్లలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. * * * * బిడ్డలకి కనీసం ఈచివరి రోజన్నా కడుపునిండా అన్నం పెట్టి సంతోష పరచాలని అనుకోని .వేకువజామునే లేచి బెల్లం పాయసం, పప్పు అన్నం.పిండి వంటలు అన్ని చేసింది.. పిల్లలు నిద్ర లేవగానే ..తల్లి ని చూసి ఆశ్చర్యంగా చూసారు.. "ఏమ్మా..? ఈ రోజు పండగనా..?? ఇంత పొద్దునే లేచి వంటలు చేసావు అని అడిగింది పెద్ద కూతురు దీప, దీప చదువులో చురుకుగా ఉన్నా కాలేజీ కి పంపలేక పోయింది, పట్నంలో చదివించాలి అని ఉన్నా బీదరికం అడ్డువచ్చింది అంతకు మించి ఒంటరిగా ఆడబిడ్డని దూరం పంపడం ఇష్టం లేదు పోకిరీ ఎదవలు భయంతో ఊరుకుంది ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్ళి చేస్తే చాలని అనుకుంది. దీపను చూడగానే దుఃఖం తన్నుకుని వస్తున్నా బాధని మనసులో పెట్టుకొని. ఏమి లేదమ్మా ఈరోజు మన పొలం దగ్గర పండగ చేయాలి .అప్పుడే మనం కష్టాలను ఎదుర్కొని సుఖంగా ఉంటాము" అని చెప్పింది , అక్కడకు చేరిన మిగతా పిల్లలతో కూడా పండుగ అని చెప్పింది, ఈ రోజే తమ చివరి రోజు అని తెలీని ఆ పిల్లలు .. తల్లి మాటలు నమ్ముతూ సంతోషం వ్యక్తం చేశారు.. సరే పిల్లలూ మీరు త్వరగా రెడీ అవ్వండి మనం చేనుకాడికి వెళ్ళాలి, అక్కడ పండుగ చేయాలి మీరు త్వరగా రెడీ అవ్వండి..నేను మీ పెదనాన్న ఇంటికి వెళ్లి వస్తా అని , వాళ్ళకి తెలీకుండా బీరువా లోని పొలం పత్రాలు తీసుకొని బయలు దేరింది, చేసిన అప్పు తీర్చకుండా చనిపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు బాధ పడతారని, తనని నమ్మి డబ్బు ఇచ్చిన వారి నమ్మకాన్ని నిలబెట్టాలి వమ్ము చేయకూడదు అని పొలం అమ్మి అప్పులు తీర్చాలని భూమి పత్రాలు చీరకొంగులో దాచుకొని ఇంట్లో నుంచి బయటకు అడుగు వేసిందో లేదో...ఊరు ఊరంతా శాంతమ్మ ఇంటి ముందు చేరారు..ఇరుగుపొరుగు వాళ్ళు ..బందువులు ..ఊరిజనం శాంతమ్మ కి శుభాకాంక్షలు చెబుతూ..ఆనందంగా ఈలలు వేస్తు గోల చేస్తున్నారు, * * * ఆసలు ఏం జరుగుతోందో శాంతమ్మ కి అర్థము కాలేదు.. ఇంతలో ఊరి పెద్దాయన వచ్చి "అమ్మా..శాంతమ్మా..!! నీకష్టం తీరే రోజులు వచ్చేసాయి నువ్వు ఇప్పుడు లక్షాధికారి అంటూ నవ్వాడు .అసలు ఏమి జరుగుతోందో ఏమి అర్థం కావడమ్ లేదు ఆ అమాయకురాలికి, ఇంతలో తన ఇంటి పక్కనే ఉన్న తన మేనల్లుడు శ్రీరామ్ కలుగజేసుకొని...అత్తా..నిన్న నువ్వు బోరు లో నీళ్లు రాలేదని పంట పొలాల్లో కన్నీరు మున్నీరుగా విలపించిన సంఘటన మా హృదయాన్ని కరిగించింది.అందుకే మేము అప్పుడు నీ పరిస్థితి ని వీడియో తీసి..ఫేస్ బుక్ , యు ట్యూబ్ లో పెట్టాము అది కాస్తా వైరల్ అయ్యింది, దాన్ని టి.వి లో కూడా వేశారు అది కాస్తా సంచలనం నమోదు చేస్తూ అటుతిరిగి ఇటుతిరిగి చివరకు అమెరికా లోని పెద్ద సేవా సంస్థ దృష్టికి వెళ్ళింది.. గారు నీబాధలు చూసి చలించిపోయారు వెంటనే నీ అప్పులు తీర్చడానికి 5 లక్షల డబ్బు పంపారు, నీకు ఉచితంగా బోరు వేసేందుకు సహాయం , మీరు సుఖంగా బ్రతికేకి రెండు ఆవులు తీసిమ్మని చెప్పారు.ఈ అద్భుతమైన సంఘటనలన్నీ 24 గంటల్లో సామాజిక మాధ్యమాల పుణ్యమా అని జరిగిపోయాయి.. అని.చేతిలో అమెరికాలోని వారు ఇచ్చిన డబ్బు, పెట్టి రేపు ఉదయానికల్లా ఆవులు కూడా నీ ఇంటి ముందు ఉంటాయత్తా అన్నాడు శ్రీరామ్., ఆసలు జరుగుతున్నది కళా..? నిజమా..? అని తనను తానే నమ్మలేక పోతోంది శాంతమ్మ... ఊహించని సంఘటనకు ఉబ్బితబ్బిబ్బయింది. కుటుంబ సభ్యులు అంతా ఆనందంలోమునిగిపోయారు.తన కష్టాలు తీరే ఉపాయము ఆలోచన చేసిన శ్రీరామ్ పాదాలపై పడి కృతజ్ఞతలు చెప్పబోయింది అయితే వెంటనే వద్దని వారించి "మీరు మంచి వారు అత్తా..!.నేను ఏమి గొప్ప పని.చేయలేదు..మీ కష్టాలను పది మందికి తెలిసేలా సామాజిక మాధ్యమాలలో.ఉంచాను మంచి మనసున్న వాళ్ళు వెంటనే స్పందించారు మీకు సహాయం చేసారు..అందరూ సమాజం చెడ్డ గా మారిందని అంటారు కానీ సమాజం ఏమి చెడిపోలేదు..మన ఆలోచనలే చెడిపోయి కుళ్లు తో నిండి పోయాయి..మంచి మనసుతో చూస్తే సమాజంలో.ప్రతి ఒక్కరిలోను దేవుడు ఉన్నారు..ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ దేవుల్లే అని శ్రీరామ్ అనగానే చప్పట్లతో మారుమోగాయి ఆ పరిసరాలు. దైవం మానుష రూపేనా అంటే నిజమే అని నమ్ముతూ తన జీవితానికి మల్లీ ప్రాణము పోసిన నవ సమాజ మనసున్న మనుషులకి కృతజ్ఞతలు తెలిపి కొత్తజీవితం ప్రారంభించడానికి చిరునవ్వుతో సిద్ధమై పొలం వైపు అడుగువేయగానే..ప్రకృతి కూడా ఆశీర్వాదం ఇచ్చినట్లుగా కరువునేలపై కుండపోత వర్షం కురిపించి ఆశీర్వాదం ఇచ్చింది.

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి