అపూర్వ కానుకలు - సరికొండ శ్రీనివాసరాజు

Apoorva kanukalu

రాజవరం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్ధుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి చాలామంది విద్యార్థులు, ఆనాటి ఉపాధ్యాయులు వచ్చినారు. పాఠశాల మైదానంలో నాటిన చాలా మొక్కలను చూసి, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఆనాటి కార్యక్రమంలో ఎందరో పూర్వ విద్యార్ధులు తమ పాఠశాల అనుభవాలను పంచుకుంటూ అద్భుతంగా ఉపన్యసించారు. ఆనాటి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు జనార్థనం గారు ఎంతో ఆశ్చర్యపోయారు. మధ్య మధ్యలో ఆ పూర్వ విద్యార్ధులు చక్కని పాటలు శ్రావ్యంగా పాడినారు. దేశభక్తి గీతాలు, సందేశాత్మక గీతాలు భక్తి గీతాలు పోటీ పడుతూ పాడారు. ఏనాడో విన్న చక్కని పాటలు మళ్ళీ ఈ పూర్వ విద్యార్ధుల నోట వినడంతో ఉపాధ్యాయులు ఆనందంతో పులకరించారు. కొంతమంది విద్యార్థుల పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా పాటలు పాడినారు. తెలుగు ఉపాధ్యాయులు నరసింహం గారు ఆశ్చర్యానందాలకు లోనైనారు. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉపన్యసిస్తూ "ఆ నాటి మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు రామకృష్ణ గారు చెట్ల పెంపకాన్ని చాలా ప్రోత్సహించారు. అందుకే వారిని ఆశ్చర్యపరిచేలా మైదానం నిండా కొత్త మొక్కలను నాటినాము. వాటిని శ్రద్ధగా పెంచుతాము. ఆనాటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు జనార్థనం గారు ఉపన్యాస పోటీలను తరచూ నిర్వహించి ఎంతోమంది చక్కని వక్తలను తయారు చేసినారు. వారిని సంతోషపరిచేలా ప్రతి ఒక్కరూ పోటీలు పడి ఉపన్యసిస్తున్నాము. మా తెలుగు ఉపాధ్యాయులు నరసింహం గారు నిరంతరం పాఠాలతో పాటు కథలు చెప్పేవారు. మంచి సందేశాత్మక పాటలను చాలా మంది విద్యార్థులకు నేర్పించారు. వారిని సంతోషపరిచేలా అందరం మంచి పాటలను పాడినాము. వారసత్వంగా మా పిల్లలకు నేర్పుతాము. మా హిందీ ఉపాధ్యాయులు శ్రీశైలం గారు నాటికలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు వంటి అనేక కళలను నేర్పేవారు. వారికి కృతజ్ఞతలతో మేము సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము." అన్నారు. సంతోషించిన గురువులందరూ ఇదంతా విద్యార్థులు తమకు ఇచ్చిన అపూర్వమైన కానుకగా భావించారు. విద్యార్థులను అభినందించి, సంతృప్తిగా ‌‌‌ఇళ్ళకు బయలుదేరినారు.

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి