తరాల అంతరంగ రాగాలు - సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు

Taraalu antaranga raagaalu

"సంపద్రాయం కాక పోయినా పెళ్ళి పీటల కంటేముందే, రిసెప్షన్ పేరుతో కాబోయే ఆలుమగల్ని అందలం ఎక్కించి, అక్షింతలు వేయుస్తున్నారు. ఈ పద్ధతి సరియైనదికాదన్న పెద్దల మీద కారాలు మిరియాలు నూరివాళ్లకి 'అక్షింత' లేస్తారు. ఇటీవల ఒక పెళ్ళిలో జరిగిన ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు.

రిసెప్షన్ కోసం సూట్ ఆర్డర్ ఇచ్చాడట వరుడు ఆన్లైన్లో. కానీ ముహూర్త సమయానికది వస్తుందో లేదోనని ఒకటే ఆందోళన.

అదృష్టం బాగుండి, అర గంట ముందు, ఆఘమేఘాల మీద విచ్చేసిన ఆ సూట్ ని అపురూపంగా కళ్లకద్దుకొని, తీరా కట్టుకొంటే, కొలతల తేడా వలన, కొత్తఇబ్బందులు వచ్చి , కోటులోంచి తన్నుకొని వస్తున్న పొట్టని బిగించి, అసౌకర్యంగా కాబోయేపెళ్ళాo పక్ర్కన కుంపటి మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.

ఇంక చెప్పడానికేముంది!. పెళ్ళి కొడుకు తిప్పలు, వివాహానికి విచ్చేసిన కొందరికి కావలసినంత వినోదం పంచితే, పెళ్ళి కొడుకు వాలకం చూసి, వీడ్ని కట్టుకుని జీవితాంతం ఎలా వేగాలిరా బాబోయ్' అని పెళ్లి కూతురు డీలా పడింది. ఇప్పుడే ఎడ మొహం పెడ మొహంగా కూర్చున్నారు, ఇదెక్కడి చిత్రమైన జంటరా ! అంటూ కొందరు చెవులు కొరుక్కొన్నారు.

సూటన్నది పాశ్చాత్య సంపద్రాయం. ఖరీదైన ఆ సూట్ ని, జీవితంలో మళ్ళీ ఎప్పుడు ధరిస్తాడో కూడా తెలియదు ఆ వరుడికి. సూట్ సంపద్రాయ మయ్యింది. తరాల అంతరాలు సహజమే కానీ, వరుడుకి తెలుగువారి పట్టుపంచె పోయి, సూట్ వచ్చి నట్లు, వధువుకి పట్టుచీర పోయి మిడ్డీ లేదా చెడ్డీ వస్తాయేమో చూడాలి. అనుకరణ అన్ని విషయాలలోనూ మంచిదికాదు…మంచిని, మార్పుని ఆహ్వా నిస్తూనే, మనదైన భాషా సంస్కృతుల్ని రక్షించుకోవాలి." రాంబాబు మాటలకి పెద్దవయస్సు పౌర సంఘసభ్యు లందరూ కరతాళధ్వనులు చేసారు. నడక, వ్యాయామం ముగించుకొని, చిన్ననాటి సంఘటనని గుర్తు చేసుకొంటూ ఇంటిదారిపట్టాడు రాంబాబు.

💐💐💐

"ఒరేయ్ రాంబాబు! ఇలా రారా... ఇలారా !" షాపు లోంచి బయటకు వచ్చి , తననే పిలుస్తున్న మల్లయ్య లింగం మావ పిలుపుకిచటుక్కున తల పక్ర్కకి త్రిప్పి చూసాడు, సరదాగా కబుర్లు చెప్పు కొంటూ తోటి స్నేహితులతో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న రాంబాబు. "ఒక్క నిమిషం ఇక్కడే వుండండిరా, వచ్చేస్తా" అంటూ 'దర్జీ చక్రవర్తి' మల్లయ్య లింగం మావ కొట్టు లోపలికి వెళ్ళా డు. తెల్లటిలాల్చీ , గుబురు మీసాలు, దడసరికళ్ళద్దాలు, చెరగని చిరునవ్వు , పిల్లలంటే పిచ్చి ప్రేమ మల్లయ్యకి " ఏంటిమావ పిలిచారు? " హడావుడిగా అడిగాడు రాంబాబు. కుర్రాడి పరిస్థితి గ్రహించి, " ఇంకా పండుగకి మీ నాన్న బట్టలు కుట్టించ లేదేమిటిరా? ప్రతి పండుగకి, పుట్టినరోజుకి తప్పకుండా కుట్టిస్తాడు కదా !" సూటీగా అడిగాడు. ఒక్క నిమిషం బుర్ర గోక్కుంటూ,"మరి, వచ్చే నెలలో అక్క పెళ్ళి కదా ! అప్పుడే కుట్టిస్తానని చెప్పాడు నాన్న." ఠక్కున సమాధానం చెప్పి, బయటకు దూకబోతున్న రాంబాబుని చేత్తో పట్టుకుని ," కొత్తబట్టలు లేకుండా, పండగ ఏమిట్రా ! ఒక్క నిమిషం ఆగు నీతో చిన్న పనివుంది, మీ స్నేహితుల్ని నడుస్తుండమని చెప్పు " అన్నా డు.

" అయ్య బాబోయ్ ,అస్సలు కుదరదు మావా! క్రిక్రిెట్ మ్యా చ్, వికెట్ కీపింగ్ నేనే, రేపొస్తానులే," అంటూ, గోడకికొట్టిన బంతిలా, రివ్వు న షాపు లోంచి బయటకి దూకపోయాడు. " ఒరేయ్, పదినిమిషాల పనిరా, కాదనకు. ఆ తర్వా త వెళ్లి పోవచ్చు , క్రిక్రిెట్ మ్యా చ్ ఆడుకోవచ్చు . నా మాట కొంచెం వినరా " అన్నా డు ఎంతో ప్రేమగా. అంత పెద్దాయన అంత ఇదిగా బ్రతిమాలుతుంటే, కాదనలేక, ఏమిచేయాలో పాలుపోక, ఇదేమి తిరకాసురా బాబూ" అనుకొంటూ బయటకు వచ్చి , బాధగా, రోడ్డు మీద తన కోసం ఎదురు చూస్తున్న స్నేహితులని వెళ్ళి పొమ్మన్నట్లు సైగ చేసాడు. లోపలికి వచ్చి న రాంబాబు కేసిచూస్తూ ," ఈ సారిపండగకి, బట్టలు నేను కుట్టిస్తాను, కొత్తబట్టలు నువ్వు కట్టుకోవలసిందే," అంటూ ఎదురుగా వున్న సలీంకి సైగ చేశాడు. రాంబాబుకి ఏమి చెప్పాలో తెలియలేదు. " ఆదికాదు మావా! మరి..నాన్న…" అంటూ, నెమ్మదిగా గొణుకుతుంటే, కాజాలు కుడుతున్న చొక్కాని పక్ర్కకు పెట్టి,రాంబాబుని తీసుకుని 'తాడికొండ వారివస్త్ర నిలయం' వైపు నడిచాడు సలీం.

💐💐💐

"రోజులు మారిపోయాయి నాన్నా ! మీకు అర్ధం కావడం లేదు. ఇలా అంతర్జాలంలో ఫలానా వస్తువులు కావాలని కోరడమే… అలా గంటలో కోరినవన్ని ఇంచక్కా గడపలో వుంటాయి. ఎంత సుఖమో చూడండి. మీరు చెప్పినట్లు, బజారు కెళ్ళడం, మనకు నచ్చి నవి కొనుక్కో వడం, ఎంత కష్టం... ఈ రోజుల్లో. ఒక్కసారిఆలోచించండ.ి గాలి, ధ్వని కాలుష్యా లు, . వాహనాల గోల, రహదారి ప్రమాదాలు… ఇలా వర్ణనాతీత బాధలు భరిస్తూ … దుకాణాలకి పోయి, కొనుగోలు చేయడం అవసరమా? నచ్చలేదని, తాజాగా లేవవి, ఒక దుకాణం నుండి మరొక దుకాణానికి పరుగులు తీయడం, బేరసారాలు, సాగతీతలు, పదికో, పరకకో కక్కు ర్తిపడి...ఏదోపొదుపు చేసామనుకొని తెగ ఇదవడం…." కొడుకు మాటలు పూర్తికాకుండానే, పుతర్రత్నాన్ని వెనకేసుకొస్తూ తల్లి అందుకొంది," ఓరేయ్ శంకరం ! నీకు నోరు నొప్పి తప్పా . ఆయన వినేరకం కాదు...నా మాట విని ఆ ఇంటర్వ్యూ సంగతి చూసుకో...సమయం వృథా చేసుకోకురా." అంటూ హితవు చెప్పింది తల్లి.

కన్నతల్లి మనసు గ్రహించిన కూతురు, మరొకడుగు ముందు కేసి, " కాస్త మీ చాదస్తం కట్టిపెట్టి, మేము చెప్పేది అర్ధం చేసుకోండి నాన్న. ఇదిగో నేనిప్పుడు కట్టుకున్న ఈ పంజాబీ డ్రెస్ చూడండి. ఎంత భేషుగ్గా అందంగా, నాణ్యంగా వుందో. మన్నిక కూడా వుంటుంది. నచ్చక పోతే, డబ్బులు వాపస్ చేస్తారు. ఇది ఆన్ లైన్ లో కొన్నదే! ఎంత బాగుంది! నచ్చలేదంటే, వస్తువు వెనక్కి తీసుకుని, డబ్బులు వాపస్ చేస్తారు. మరి మన అంతస్తులకి, సిటీబస్సులు ఎక్కలేం. అలాగని క్యాబ్ లలో తిరగలేం. అవస్థలుపడి, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ కివెళ్ళలేము. ఆ ఖర్చుకి, ఆన్ లైన్ లో రెండు డ్రెస్రె్సులు వస్తాయి" అని గర్వంగా తల్లి కేసిచూసింది. కూతురు తెలివితేటలకి ముచ్చట పడిన తల్లి, మురిపెంగా కూతురు మీద చేయి వేసి " నీకెందుకే కంఠశోష తల్లీ ! ఆయన చాదస్తం ఆయనది.ఇక ఆ సంగతి వదిలేయ్" అంటూ కూతుర్ని గదిలోంచి హాల్లోకితీసుకుని నడిచింది. వాళ్లసంభాషణలు మౌనంగా వింటూనే, ఆన్ లైన్ షాపింగ్ , ఆధునిక పోకడలు, కొత్త సంపద్రాయాల క్రీనీడలో కనుమరుగవుతున్న ఆప్యాయతలను, అనుబంధాలను తలపోస్తూ , గత స్మృతులు లోకిజారిపోయాడు ఆ తండ్రి రాంబాబు.

💐💐💐

తాటాకుల పందిరిలో అందంగా కట్టిన పెళ్ళి మండపంలో, పెళ్ళి కూతురు తండ్రి మూర్తి, పైకి గంభీరంగా కనిపిస్తున్నా , లోలోపల భయాందోళనకు లోనవుతున్నాడు. బంధువులు, స్నేహితులు నూతన దంపతులకు, శుభాకాంక్షలు, ఆశీస్సు లు అందిస్తున్నా రు. మరికొద్దిసేపటిలో వివాహ కానుకగా వెండిచెంబు, గ్లాసు అల్లుడు చేతిలో పెట్టాలి. డబ్బులు సర్దుబాటు కాక, వెండిచెంబు కొనుగోలు చేయలేక పోయాడాయన.

ఇంతలో " అయ్యా మూర్తి గారు! కానుకలు, చదివింపులు కార్యక్రమం. మీతోనే ప్రారంభించాలి. ఆలస్యం చేయక, మీ అల్లుడు గారి…." పురోహితుడిమాట ఇంకా పూర్తికాకుండానే, వెండిచెంబు, గ్లాసు ఆయనకు అందించి, 'ఇక మీదే ఆలస్య' మన్నట్లు చిరునవ్వుతో చూసింది, మూర్తిగారిభార్య. ఆశ్చర్యానందాలతో మూర్తి తన కళ్ళని తానే నమ్మలేక పొయాడు.

విద్యు త్ సరఫరా నిలిచిపోయి, ఒక్కసారిగా పంకా ఆగిపోవడంతో, గతంలోంచి వాస్తవంలోకివచ్చి , మళ్ళీ , ఆనాటి స్నేహానుబంధాల గురించే ఆలోచనలో పడ్డాడు రాంబాబు.

💐💐💐

కృష్ణమూర్తిని కిరాణా కొట్టు పెట్టమని, ప్రోత్సా హించి, మూర్తి. తనకు తెలిసిన వాళ్ళని, కృష్ణమూర్తికి పరిచయం చేసాడు. కొద్దికాలంలోనే ఆ వ్యాపార కిటుకు ఒంటబట్టిందతనికి. నాలుగు చేతులతో సంపాదించాడు.

'వ్యాపారి- కొనుగోలుదారుడు' గా మొదలైన వారి పరిచయం, శ్రీఘ్రకాలంలోనే కుటుంబ స్నేహంగా మారింది. మూర్తి కూతురు పెళ్లికి కావలసిన పచారిసరకులు, కూరలు అన్నీ పంపించేఏర్పా ట్లు స్వయంగా పర్యవేక్షణ చేసాడు కృష్ణ మూర్తి. విషయం ఇంతే అయితే చెప్పడానికేముంది? డబ్బు లు సర్దుబాటుకాక, పెళ్లికి వెండిచెంబు కొనుగోలు చేయలేక పోయారని గ్రహించాడు కృష్ణమూర్తి.

పెళ్ళిరోజు, భార్యని తీసుకుని మూర్తిగారింటికి వెళ్ళాడు. మూర్తిగారి భార్యతో రహస్యంగా మంతనాలాడింది కృష్ణమూర్తి భార్య. తన ఇంట బీరువాలో పడివున్న వెండిచెంబు, పెళ్ళి నిర్విఘ్నంగా చేయించగలదనే ఆలోచన స్ఫురించిందతనికి. తడవుగా ఆ ఆలోచన రూపం దాల్చింది. మూడు నెలల తరువాత, మూర్తిగారు, పెళ్ళికి పెట్టిన ఆ చెంబు వాపసు తీసుకుని, అంతకంటే పెద్ద చెంబుని అల్లుడు చేతికివ్వడంతో, కృష్ణమూర్తి చెంబు కథ మళ్ళీ బీరువాకి చేరింది.

ఈ తరం వాళ్లు ఇలాంటి సంఘటనలు వింటే, నమ్మలేని నిజాలుగా భావిస్తుంటారు అనుకున్నాడు రాంబాబు.

💐💐💐

గణేశ్వర రావు గారు పుట్టినదికొమరాజులంక అనేచిన్న పల్లెటూరు. రాంబాబు స్వస్థలం కూడా అదే. రావు గారికొడుకు , హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి ప్రధానాధికారి కావడం, అదే కంపెనీలో నౌఖరీకి, శంకరం ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. శంకరం, వివరాలు తెలిసి, రావు గారి కొడుకు, తండ్రిక్రిి ఫోన్ చేసి, రాంబాబు కుటుంబం గురించి విచారణ చేసాడు. రావు గారికి , స్వగ్రామమన్నా , ఆ ఊరివాళ్ళన్నా ఏదోవెర్రి మమకారం. ఆ విషయం ఆయన కొడుకుకి కూడా తెల్సిందే., తండ్రిమాటని కాదనలేక పోవడం ఆ కొడుకు బలహీనత. ఒక రకంగా, గణేశ్వరరావు గారి ఆ బలహీనత, శంకరరం నెత్తి మీద పాలు పోసింది. శంకరం జీవిత అనూహ్యంగా మలుపు తిరిగింది. మమత, బలహీనతలు, తర్కానికి లొంగవు. సెంటిమెంట్ ఖచ్చితంగా సిమెంట్ కంటే బలమైనదే.

💐💐💐

ఆ రోజు ఆదివారం సెలవు కావడంతో, ప్రొద్దున్నే, శంకరం, ఆతని తల్లి కాఫీత్రాగుతూ ఏదోపిచ్చా పాటి మాట్లాడుకొంటున్నారు. "పాలవాడికి, పనిమనిషికి, ఇస్త్రీవాడికి, ఎంతివ్వాలో లెక్క కట్టి, ఆ డబ్బులు వేరే పెట్టుకోవాలి. ఆ కాలండర్ ఇక్కడ పెట్టు" తల్లి చెప్పింది.

" డబ్బు లెందుకమ్మా ! .. ఫోన్ పే చేస్తాలే. అదిచాలా తేలిక…"ఇంకా శంకరం చెప్పబోతుంటే. "కావచ్చు కానీ చేత్తో, కరెన్సీ నోట్లు లెక్క పెడుతున్నప్పు డు, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నామా! అనే భావన కలుగుతుంది నాకు. అనవసర ఖర్చులు చేయడానికి అందుకే కాబోలు చెయ్యి రాదు." అందితల్లి నవ్వుతూ.

శంకరానికి ఆమె ధోరణికి మొదట, నవ్వు వచ్చి నా, తరువాత, కించిత్ సందేహం మొలకెత్తింది. కార్డుతో 'చెల్లింపులు సులువు' అనే భావన, అనవసర ఖర్చు లుకి దారితీయవచ్చనడంలో కొంత నిజముందని పించింది. కార్డు చెల్లింపు కదాని, అనవసర ఖర్చులు చేసిన సందర్భా లు గుర్తుకు వచ్చి , జేబుకిచిల్లు పడుతుందనే భయంతో,డబ్బులు లెక్కలేసుకొంటూ, పాత తరం వాళ్ళు ఖర్చు ల విషయంలో ఆచి తూచి వ్యవహరించేవారేమో! అనుకున్నా డు.

ఎందుకో చిన్నతనంలో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. శనివారం నాడు జరిగే సంతలో, కూరల వెంకయ్యకి ఎగనామం పెట్టి, ఆ డబ్బులు పెట్టి, జీళ్లు కొనుక్కొని, ఇంటికి వచ్చి ఆ ఘనకార్యాన్ని , వర్ణించి చెప్పితే, తల్లి మందలించి, వెంకయ్యకి, డబ్బు లిచ్చేసిరమ్మంటే, మళ్ళీ కాళ్ళీడ్చికుంటూ సంతకి వెళ్లాడు.

సంతకి వెళ్లడం వలన పిల్లలకి తాజా కూరల ఎంపికతో బాటు, విషయ పరిజ్ఞానం, సంభాషణా నైపుణ్యాలు వంటివి కూడా అలవడతాయని తండ్రి చెప్పేమాట కూడా గుర్తుకు వచ్చింది.

💐💐💐

ఇంతలో, ఉదయం నడక ముగించుకొనిఇంటికిచేరి, రాంబాబు, సోఫాలో కూర్చుని టీవీలో" సైబర్ నేరాలు– చేతులెత్తేసిన పోలీసు"లన్న కార్యక్రమం చూస్తున్నా డు.

అంతలో స్నానాల గదిలోంచి హడావిడిగా వస్తూ , "అమ్మా ! నిన్న కట్టుకున్న పంజాబీ డ్రెస్ అలా తడిపానో లేదో ఇలా డస్ర్సు రంగుపోయి ఎలా తయారయ్యిందోచూడు" అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని తల్లికిచూపిస్తోంది. ముచ్చటగా కొనుకొన్న ఆ డస్ర్సు మూడు రోజులకేపాడయినందుకు, తల్లి అవాక్కయ్యింది.

ఇది చాలదన్నట్లు చరవాణి చేత్తోపట్టుకొని, ముఖం వ్రేల్రేాడేసుకొంటూ,"నా పొదుపు ఖాతా లోంచి ఎవడోపాతిక వేలు లాగేసాడు. ఎలా జరిగిందోతెలియడం లేదు. నాన్నా !" అన్నాడు శంకరం. అంతలో ఫోన్ మ్రోగింది.

"ఓరేయ్ శంకర్, వెంటనే బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరకి రారా. దయచేసి రా రా " దుఃఖం ఆ గొంతులో స్పష్టంగా తెలుస్తోంది.

"సరే, కంగారు పడకు. ఇంతకీ ఏమీ జరిగిందిరా చక్రం ?" అన్నాడు శంకరం.

"సిటీ బస్సు దిగుతుంటే, కాలు జారి పడ్డా. మొబైల్, వర్షం నీళ్ళ గుంటలో పడి పోయింది. పని చేయడం లేదని సరిగ్గా గమనించలేదు. బ్రేక్ ఫాస్ట్ తిని, ఫ్రూట్ జ్యూస్ తాగా. ఫోన్ పే లేదా గూగుల్ పే చేయడానికి కుదరటం లేదు. ఫోన్ ప్రాబ్లం. పర్సులో ఎక్కువ డబ్బులు కూడా లేవు. అదృష్టం బాగుండి… నీకు ఫోన్ కలిసింది…" ఆతనికి ఇక మాటలు దొర్లడం లేదు.

శంకరం కారు బద్దకంగా రోడెక్కింది.

💐💐💐

మరిన్ని కథలు

Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి