తూరుపు దిక్కున సూర్యుడు రాకముందే కొమ్మపైన పిల్లరామచిలుక ఏడుస్తూ కనిపించింది కోతికి. 'చిట్టిచిలకమ్మ అమ్మకొట్టిందా ?'అన్నది కోతి. అవును నాఅల్లరి ఎక్కువగాఉందట అందుకు' అందిపిల్ల రామచిలుక. ''ఇదిగో ఈ జామపండు తిను నీకుమంచి కథ చెపుతాను'అన్నకోతి..... బురదనేలపై మెల్లగా నడుచుకుంటూ జారుతూ , తడబడుతూ వెళుతున్నాడు తాబేలు తాత.
'తాతా ఎక్కడికి ఇంతఉదయాన్నే బయలుదేరావు 'అన్నాడు చెట్టుపైన ఈతపళ్ళు తింటున్నచిలుక . 'మనవడా రాత్రి ఉరుములతో వర్షంకురిసిందికదా,పుట్టగొడుగులు మోలిచి ఉంటాయి అవిచాలా బలవర్ధకమై ఆహారం అందుకే వెదుకుతూవెళుతున్నా 'అన్నాడు తాబేలు తాత. 'సరే ఇవిగో రెండు ఈతపళ్ళు తింటూవెళ్ళు 'అని తాబేలు నోటికి అందించి వెళ్ళాడు చిలుక.
కొంతదూరంలో ఎత్తుగాఉన్న గుట్టపైన పుట్టగొడులు కనిపించడంతో వాటికోసం గుట్టఎక్కుతూ పట్టతప్పి వెల్లికిలా పడ్డాడు తాబేలు. కొంతసేపటికి ఆహారం వెదుకుతూ వచ్చిన రెండుకుందేళ్ళు,తాబేలును చూస్తునే పరుగు పరుగునవచ్చి,తాబేలును యధాస్ధానానికిమార్చాయి.
'అమ్మయ్య మరికొద్దిసేపు అలానే ఉంటే మరణించేవాడిని మిత్రులారా ధన్యవాదాలు ,పుట్టగొడులకొరకు గుట్టఎక్కుతుంటే పట్టుతప్పి పడిపోయాను మీసహాయం మరచిపోనులే ఏదో ఒకరోజు మీరుణం తీర్చుకుంటా ' అన్నాడు తాబేలు.
' తాతా మేము రావడంకొద్దిగా అలస్యం అయిఉంటే నీప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది. ఐనా నిన్ను నువ్వు కాపాడుకోలేవు నువ్వు మాకు సహాయం చేస్తావా ? వెళ్ళిరా' అనికుందేళ్ళు వెళ్ళిపోయాయి.
నాలుగు పుట్టగొడుగులు తిన్న తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కుందేళ్ళ బొరియ దగ్గరకు వచ్చేసరికి,కుందేళ్ళపిల్లలు ఆడుకుంటూ కనిపించాయి. ఇంతలో చేరువలో నక్కలు ఊళవేయడం వినిపించడంతో
కుందేళ్ళపిల్లలను వాటి బొరియలోనికి పంపి బొరియ పైభాగాన తాబేలు వెల్లికలా పడుకుంది. మరి కొద్దిసేపటికి నక్కలగుంపు ఆపరిసరాలను వాసనచూస్తు తాబేలును ఏమిచేయలేక ,ఆహారం వెదుకుతూ దూరంగా వెళ్ళిపోయాయి.
రెండు చేతులనిండుగా ఎర్రదుంపలతో వచ్చిన కుందేళ్ళు తాబేలును యధాస్ధానానికి మార్చాయి. బొరియలోనుండి వచ్చిన కుందేళ్ళ పిల్లలు నక్కలకు తాము దొరకుండా తాబేలు తాత ఎలాకాపాడాడో వివరించాయి.
' తాతా వయసులో పెద్దవాడివి అనేగౌరవంలేకుండా నిన్ను అవమానకరంగా మాట్లాడినా మాపిల్లల ప్రాణాలను రక్షించావు మమ్ములను క్షమించు'అన్నాయి కుందేళ్ళు. పిల్లలు నాశరీరంపైన ఉన్న బలమైన డిప్ప కవచంలా ఉంటుందికనుక నక్కలు నన్ను ఏమిచేయలేక వెళ్ళిపోయాయి. చిట్టి చీమలన్నికలసి ఎంతపెద్ద పుట్టపెడతాయోకదా! గడ్డిపోచలన్ని ఏకమై గజరాజును బధించలేదా! కాకులు చూడండి ఏదైనా ఆహారం తమకంటపడితే మిగిలిన కాకులనుపిలుస్తాయి. ఐక్యతకు ఇవన్ని ఉదాహరణలే! ఎటువంటి పరిస్ధితులలోనైనా మనం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ స్నేహంతో మెలిగితే మనదే విజయం. ఐకమత్యమే మనబలం. తప్పుడు పనులకు ,చెప్పుడుమాటలకు దూరంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు విజేతలే 'అన్నాడు తాబేలు తాతా.
'భలే భలే బాగుందికథ, ఎదురుచూస్తుందేమో అక్కడ వెళుతున్నా అమ్మ నేను తికో 'అనితుర్రుమంది పిల్లరామచిలుక.దానిభాష అర్ధంకాని కోతి తెల్లమొఖంవేసాడు.