జీవన సంధ్యలో... - కందర్ప మూర్తి

Jeevana sandhyalo
భీమశంకరం గారు రెవిన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దారుగా విధులు
నిర్ళహిస్తున్నారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన ఉదయాన్నే పూజా కార్యక్రమాలు గాయత్రి చేసిన తర్వాతే మిగతా
కార్యక్రమాలు చూస్తారు.
ఉధ్యోగ విధులలో నిజాయితీ , క్రమశిక్షణ, అంకిత భావం పై స్థాయి నుంచి కింది ఉధ్యోగుల పట్ల గౌరవం ఆదరణ ఆయనను ఎంతో ఉన్నత
స్థితిలో నిలబెట్టాయి.
భీమశంకరం గారి శ్రీమతి మహలక్మమ్మ గారు భర్తకు తగ్గ భార్య.
ఉదయాన్నే అబ్యంగన స్నానంతో మొహానికి పసుపు నుదుటున రూపాయంత కుంకుమ బొట్డు అడ్డ కచ్చ చీరతో మడీ ఆచారం విష్ణు సహస్రనామం
లక్ష్మీ స్తుతి వెంకటేశ్వర సుప్రభాతం దైవస్తుతితో ఇల్లు ఆధ్యాత్మిక వాతావరణంతో కనబడుతుంది.
భీమశంకరం దంపతులకు ఏకైక కొడుకు శ్రీనివాస్ మద్రాసులో సాఫ్టువేరు
ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫైనలియర్ పూర్తవగానే యం.యస్.చదవ
డానికి యు.యస్ కి వెల్తాననగానే ఆయన అడ్డు చెప్పలేదు. అనుకున్నట్టుగానే
శ్రీనివాస్ యం.యస్. చదవడానికి అమెరికా వెళ్లాడు. చదువు అవగానే
ఇండియాకు తిరిగి వచ్చి ఉన్నత పదవిలో ఉధ్యోగం చేస్తాడను కున్నారు.
కాని ఆయన అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగింది. కొడుకు రెండు
సంవత్సరాల తర్వాత చదువు పూర్తి చేసి అక్కడే ఉధ్యోగంలో స్థిర
పడ్డాడు. ఐదు సంవత్సరాలు పూర్తయినాక కొడుకు ప్రవర్తనలో మార్పు
వచ్చింది. ఇదివరకటిలా శ్రీనివాస్ క్షేమ సమాచారాలు తెలియడంలేదు.
అక్కడే ఫ్లాట్ కొన్నట్టు పిడుగులాంటి కబురుతో పాటు అనుకోని పరిస్థితుల్లో
అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వీలు చూసుకుని కోడలితో
ఇండియా వస్తానని తెలియచేసాడు. ఆ వార్తను తెలిసి భీమశంకరం దంపతులు తట్టుకోలేక పోయారు. తమ కళ్ల ముందు కట్టుబాట్లతో పెరిగిన
కొడుకులో ఒక్కసారిగా ఇంత మార్పును ఊహించలేక పోయారు.
విదేశీ వాతావరణం మనిషిలో ఇంత మార్పు తెస్తుందనుకో లేదు. విదేశంలో
పై చదువులు చదివి ఇండియా కొచ్చి తగిన ఉధ్యోగంలో స్థిర పడితే వారి
బంధువుల్లో తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. కొడుకు ఆర్థికంగా సహాయం
చేసినా భీమశంకరం గారు శ్వీకరించలేదు.వారి మద్య దూరం పెరిగింది.
శ్రీనివాస్ అమెరికా వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి.
భీమశంకరం దంపతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడుకు
కొట్టిన దెబ్బ నుంచి కోలుకోక ముందే కూతురు మాధవి ఫార్మా.డి పూర్తి
చేసి తన కొలీగ్ పంజాబీ సిఖ్ అబ్బాయితో ప్రేమలో పడి ఆస్ట్రేలియాకు
జంప్ చేసింది. ఉన్న కొడుకు , అల్లారుగా పెంచిన కూతురు తమకు
దూరమవడంతో తమ పెంపకంలో ఏం లోపం జరిగిందని బాధ పడసాగారు.
రెక్కలొచ్చిన పిల్లలు గూడు వదిలి వాటి దారిన అవి ఎగిరి పోవడమంటే
ఇదేనేమో?అనుకున్నారు.
మానసికంగా దెబ్బ తిన్న భీమశంకరం గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని
ఉధ్యోగ విరమణ సమయంలో వచ్చిన డబ్బుతో పాటు ఉన్న ఇంటిని అమ్మి
మొత్తం డబ్బులో కొంత బేంక్ ఎకౌంట్లో వేసి మిగతాది ఒక స్వచ్ఛంద సంస్థ
నడుపుతున్న ఓల్డేజి హోమ్ కి ఇచ్చి తమ దంపతుల జీవిత చరమాంకం
వరకూ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పుడు భీమశంకరం గారు రోజూ తెల్లవారుజామున ప్రార్థనా
మందిరంలో యోగ మెడిటేషన్ ప్రాణాయామం చేయిస్తు మిగిలిన
సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య సూత్రాలు ఆధ్యాత్మిక ప్రవచనాలతో కాలక్షేపం
చేస్తున్నారు.
మహలక్ష్మమ్మ గారు ధ్యాన మందిర హాల్లో పుట్టపర్తి సాయిబాబా
గారి బోధనలు భజనలు భగవత్ స్తోత్రాలతో మిగతా ఆడవారితో
రోజులు గడుపుతున్నారు.
భీమశంకరం దంపతులు ఓల్డేజి హోమ్ లో చేరి మూడు సంవత్సరాలు
గడిచి పోయాయి. అనుకోకుండా ఒకరోజు అమెరికా నుంచి కొడుకు
శ్రీనివాస్, యూరోపియన్ కోడలు ,ఇదేళ్ల మనవడితో ఓల్డేజ్ హోమ్
ఆఫీస్ రూములో భీమశంకరం గారిని కలియాలని చెప్పారు.
నా కోసం ఎవరొచ్చారని అనుమానంతో గెస్టు రూములో కొడుకును
కోడలిని మనవడినీ చూసి ఆశ్చర్య పోయారు. చాలా కాలం నుంచి
ఇండియా వద్దామనుకుంటే కుదరక ఇప్పుడు వచ్చామనీ, భార్యను
మనవడిని పరిచయం చేసాడు. యూరోపియన్ కోడలు ఎర్రని రంగుతో ఇంగ్లీషులో మాట్లాడింది.గ్రాండ్ పా అని ఎర్రగా ఉన్న మనవడిని చూపింది.
అనుకోని సంఘటనకు భీమశంకరం గారు కొంత సమయం వరకు తేరుకో
లేకపోయారు. గెస్టు రూముకు భార్యను పిలిపించి కొడుకును కోడల్నీ
మనవడిని చూపించారు. ఆమె తన కళ్లని తనే నమ్మలేకపోయింది.
కొడుకును చూసి కన్నీళ్ల పర్యంతమైంది.ఇంగ్లీషు రానందున కోడలి
వైపు మనవడి వైపు మౌనంగా చూస్తుండిపోయింది.
తన కుటుంబానికి ఇండియా చూపించడానికి వచ్చి నట్టు ఆఫీసులో
ఎంక్వయరీ చేయగా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఓల్డేజ్ హోమ్ లో
ఉన్నారని తెలిసి చూడ్డానికి వచ్చినట్టు కొడుకు శ్రీనివాస్ చెప్పాడు.
కనీసం జీవిత చరమాంకంలోనైన చూడటానికి వచ్చినందుకు సంతోషం
అని అభినందనలు తెలియచేసారు కొడుక్కి. కొన్ని గంటలు వారితో గడిపి
టేక్సీలో వెళిపోయారు.చనిపోయాడనుకున్న కొడుకు బతికే ఉన్నందుకు
సంతోషం అనుకున్నారు.
భీమశంకరం దంపతులకు మరో సంతోషకర వార్త ఏమంటే కూతురు
మాధవి కూడా సిఖ్ భర్తతో ఓల్డేజ్ హోమ్ కొచ్చి చరమాంకంలో అమ్మా
నాన్నల్ని చూసి వెళ్లింది.
ఎంత సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినా సమాజంలో పరిస్థితులు
సన్నిహితులు స్నేహితుల ప్రభావంతో వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు
సంభవిస్తాయి.
గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచ దేశాల మద్య వాణిజ్య వ్యాపార వినోద
విద్య టూరిజం రంగాల్లో రాకపోకలు ఉధ్యోగ ఆర్థిక అవసరాలు పెరిగాయి .
నాగరిక ప్రపంచంలో నేటి యువత మతం కులం జాతి భావనకు విలువ
ఇవ్వకుండా ఒక దేశం అమ్మాయిని మరో దేశం యువకుడు ప్రేమ వివాహం
చేసుకుంటున్నారు. స్వదేశంలో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రస్తావన
లేకుండా జీవితాలు గడుపుతున్నారు. గ్రీన్ కార్డు సంపాదించి దేశ పౌరసత్వం
పొంది పిల్లలకు ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిపాది‌స్తున్నారు.
* * *

మరిన్ని కథలు

Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ
Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి