సాధు బుద్ధి? - - బోగా పురుషోత్తం.

Sadhu buddhi
పూర్వం నర్మద నది ఒడ్డున ఓ కొంగ, నక్క, కప్ప నివసించేవి. అక్కడే ఓ సాధువు ఆశ్రమం వుండేది. ఆ పక్కనే ఓ చెట్లో కొంగ తన పిల్లలతో గూడు కట్టుకుని నివసించేది. ఆ పక్కనే ఓ సరస్సు వుంది. అందులో ఓ కప్ప నివసిస్తోంది. నక్కకి, కొంగకి ఎంతో కాలంగా కలహం ఉండేది. కొంగ తన ఆహారం కోసం సరస్సులోకి వెళ్లేది. నక్క అది చూసి అడ్డుకునేది. దీంతో కొంగ తన ఆకలి తీర్చుకునేందుకు చుట్టూ తిరిగి అలసిపోయి ఆకలితో అలమటిస్తూ గూట్లో నిదురపోయేది.
కొద్ది రోజులకు వేసవి కాలం వచ్చింది. వంకలు, వాగులు,చెరువులు, సెలయేర్లు పూర్తిగా ఎండిపోయి నీటి జాడ కరువయింది. ఇక కొంగకు ఆహారం దొరకలేదు. అది చిక్కి పోవడంతో పాటు తన పిల్లలకు ఆహారం సమకూర్చలేకపోయింది. తిండిలేక కొంగ పిల్లలు రోజుకు ఒక్కొక్కటి చనిపోసాగాయి. ఇది గమనించాడు సాధువు దయానందుడు. రోజూ తను తినే పెరుగన్నం, పులిహోర తన పూరి గుడిసె పై కప్పు మీద ఓ గిన్నెలో పెట్టేవాడు. కొంగ హాయిగా ఆరగించి తన పిల్లలకుకూడా కొంచెం పెట్టేది. ఆహారం తినడంవల్ల కొంగ పిల్లలు కొంచెం తేరుకుని పెద్దవై ఆకాశంలో ఎగరసాగాయి.
కొద్దిరోజులకు కొంగ గూడు పక్కనే వున్న సరస్సు కూడా ఎండిపోయింది. ఇప్పుడు దానిక్కూడా ఆహారం దొరక్కపోడంతో ఆకలితో అలమటించింది. దీన్ని గమనించాయి కొంగ పిల్లలు. కొంగను తమ చెట్టువద్దకు తీసుకెళ్లాయి. రోజూ ఆ చెట్టు కిందే కొంగతో పాటు నక్క కూడా నివసించేది. ఆ సాధువు పెట్టే ఆహారంలో కొంత నక్క కూడా తినేది. కానీ మాంసాహారం అలవాటు వుండటంతో శాకాహారం రుచించలేదు.
కొద్దిరోజులకు ఆ ఆహారం చాలలేదు. కొంగ పిల్లలపై కన్ను పడిరది. కొంగ బయటకు వెళ్లినప్పుడు సమయం చూసి గూటిలో వున్న కొంగ పిల్లలను చంపి రక్తం కారుతుండగా సాధువు ఆశ్రమంలోకి ప్రవేశించింది. సాధువు తనకోసం దాచుకున్న పలు రకాల పండ్లను, పెరుగు అన్నాన్ని తనకు ఇష్టం వచ్చినట్లు తిని చిందరవందరచేసింది. అక్కడే వున్న కుక్కను గొంతుపట్టుకుంది.
రోజూ ఇలాగే ఆహార పదార్థాలను నాశనం చేస్తుండడంతో పాటు తన సాధు ధర్మానికి కళంకం తెచ్చేలా జీవ హింస చేస్తూ సాధువుకు మనశాంతి లేకుండా చేసింది. ఇదంతా చేస్తున్నది కొంగే అని సాధువు కొంగ మీద కోపం వచ్చి ఆహారం పెట్టడం మానేశాడు. ఇప్పుడు నక్క కపట బుద్ధితో కొంగ పిల్లలను కోల్పోవడమే కాకుండా ఆహారం కోల్పోయి ఆకలితో నకనకలాడసాగింది. సాధువు కోపంతో తన సాధు ధర్మానికి అపఖ్యాతి తెచ్చిన వారిపై కన్నేశాడు.
మరుసటి రోజు నక్క వచ్చి ఆహారంలో మూతి పెట్టి చిందరవందరచేయడం గమనించాడు. ఆ తర్వాత నక్క అక్కడే కట్టేసిన శునకాన్ని గొంతు కొరికి వెళ్లడం కళ్లారా చూశాడు. జీవ హింస మహాపాపం అని చంపకుండా కట్టెతో తరిమివేశాడు.
ఆ మరుసటి రోజునుంచి తన ఆహార పదార్థాల్ని ఓ గది లోపెట్టి తాళాలు వేసుకోసాగాడు సాధువు. తన ఆహారాన్ని నాశనం చేసేది కొంగ కాదని తెలుసుకున్నాడు సాధువు. దానిపై కోపం తగ్గించుకుని కొంగకు ఆహారం పెట్టడం మళ్లీ మొదలుపెట్టాడు.
సాధువు నక్కను తరిమివేయడంతో ఇక ఆ పరిసరాల్లో వుండేందుకు చోటు లభించలేదు. వెళ్లి సమీపంలోని గ్రామంలో చెట్టు తొర్రలో వుంటూ సాయంత్రం ఆ దారిలో వచ్చే సాధు జంతువులైన పశువులు, మేకలు, గొర్రెలను వెంటాడి చంపి తినేది. రక్తం రుచి మరిగిన నక్క నెమ్మదిగా గ్రామంలోని మనుషులపై దాడిచేయసాగింది. దీన్ని గమనించిన మనుషులు దాని ప్రమాదం నుంచి తొలగించుకోవడానికి బాకులతో దానిపై దాడి చేయడంతో కన్ను మూసింది. శాకాహారం తిన్నా నక్క సాధు బుద్ధి అలవరుచుకోకపోవడంతో తనకు తానే ప్రమాదం కొని తెచ్చుకుంది.
Attachments

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్