అడ్డం - జీడిగుంట srinivasa rao

ADdam

అబ్బా ఏమిటి దరిద్రపు మూట, కాళ్ళకి అడ్డంగా పెట్టి, నా కాలు విరిగాకోట్టారు అన్నాడు శంకరం, కుంటు కుంటూ వెళ్లి కుర్చీలో కూర్చుంటో భార్య మాలతి తో.

అదా, మీ నాన్న గారు రాసిన కథలు, వేసిన కార్టూన్స్. ఆయన నా పెళ్లి అయిన తరువాత నాతో ఒకే ఒక్క మాట మాట్లాడరు, అది అమ్మాయి, నేను పోయిన తరువాత నా రచనలు, ప్రింట్ అయినవి కానివి అన్నీ ఒక మూటలో కట్టి, హాల్ లో tv దగ్గర అందరికి కనిపించేడట్లు పెట్టు. నా మనవలో, మా అన్నదమ్ములో వచ్చి చూసి ఏమిటి ఈ మూట అని అడిగితే ఈ పుస్తకాలు తలో ఒకటి యివ్వు, చదువుకుని సంతోషిస్తారు అని కోరిక కోరారు. మామ గారి మాట కాదనలేక, ఈ మూటని tv దగ్గర పెట్టాను. ఉదయం పనిమనిషి యిల్లు వూడుస్తో, మూట జరిపినట్టుంది, అయినా మీ నాన్న రాసిన పుస్తకాల సంచి తగిలితేనే కాలు విరిగింది అని గొడవ పెడుతున్నారు, మరి ఆయన పుస్తకాలు చదివి తలబోప్పి కట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటిటా అంది.

సరేలే, నువ్వు ఆయన కథలు చదివింది ఎప్పుడు, నన్ను చదవనిచ్చింది ఎప్పుడు, మా నాన్నకి తన కథలు ఎవ్వరు మెచ్చుకోవడం లేదని బెంగతో పోయారు, లేదంటే ఇప్పటి వరకు వుండేవారు అన్నాడు శంకరం. ఆ, అప్పుడు యింకో మూట కూడా తయారు అయ్యేది, అప్పుడు రెండు కాళ్ళు విరగకోట్టుకునే వారు అంది నవ్వుతు. అవునే నాదే తప్పు, ఏ మగాడు అయితే పెళ్ళానికి, తన జీతం బేసిక్, DA లతో కలిపి ఎంత వస్తుందో దాచకుండా చెపుతాడో అప్పుడే లోకువ అవుతాడు అన్నాడు శంకరం.

అబ్బో, నిజం చెప్పారని మేము అనుకోవడమే గాని, ప్రతీ నెల మీ యిద్దరు చెల్లెళ్లు కి డబ్బులు పంపడం నాకు తెలియదు అనుకోకండి అంది యింకో కుర్చీలో కూర్చొని. ఏడ్చావ్, మా చెల్లెళ్లు కేమి ఖర్మ, నాదగ్గర నుంచి డబ్బు ఆశించడానికి, వాళ్ళ యిద్దరు పిల్లలు అమెరికా లో ఉద్యోగం తెలుసా అన్నాడు శంకరం. అయ్యో యింత అమాయకులు అయితే ఎలా అండీ మీరు, ఆడపడుచులకు ఎంత డబ్బున్నా, అన్నగారి డబ్బులు మీద ఆశ తెలుసా అంది బుగ్గలు నొక్కుకుంటో.

మరి నీ అన్న దగ్గర నుంచి నువ్వు ఏమి లాగవు, ఎప్పుడు ఏదో వంకతో మన డబ్బు పంపించే దానివి కదా? అన్నాడు శంకరం.

అన్నగారిని చిన్న మాట అన్నా వూరుకొని, మాలతి కి కోపం వచ్చి, రెండు నిముషాలు మీతో సరదాగా మాట్లాడుదాం అనుకుంటే చాలు, మా అన్నయ్యని అడిపోసుకుంటారు, కానీయండి, రాత్రికి మీ పని చెపుతా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.

ఛీ, పొద్దున్నే ఎవ్వరి మొహం చూసానో గాని, కాలు విరగడం, తిట్లు తినడం అనుకుంటూ తండ్రి రాసిన మూటని అటకమీద పెట్టాడు. తెల్లారింది, శంకరం అటక మీద పెట్టిన మూటని నెత్తిన పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి, ఎవ్వరు లేకుండా చూసి, మున్సిపల్ చెత్త కుండీలో పడేసాడు, మనసంతా బాధతో. పెళ్ళాలా దగ్గర ఈ రాత్రులు ఎందుకు లొంగిపోతున్నామో అనుకుంటూ.

శుభం

మరిన్ని కథలు

Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్