చేతికర్ర సహాయంతో తనఎదురుగా బోనులో నిలబడిన వ్యక్తినిచూస్తూ "నువ్వుదొంగతనం చేసావా?"అన్నాడు న్యాయమూర్తి.
"అయ్య తమరు అనుమతి ఇస్తే అందుకుకారణం చెప్పుకుంటాను" అన్నాడు ఆవ్యక్తి.
అంగీకారంగా తలఊపాడు న్యాయమూర్తి.
అయ్యా నాపేరుశివయ్య నేను నదీతీరంలో చిన్నపూరిపాకవేసుకుని టీ అంగడి నడుపు కుంటున్నాను. మొన్నవచ్చిన వరదల్లో నా టీపాకా కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నాను.కరోనా వలన ఎక్కడా పని దొరకలేదు దొరికినా పోలియో వలన ఒకకాలు కోల్పోయిన నాకు పని ఎవరుఇస్తారు?రెండురోజులుగా ఏమితినలేదు ఆకలిబాధ తట్టుకోలేక రొట్టె దొంగతనం చేసాను,దొరికిపోతే చెరసాలలో ఖైదిగా మూడుపూటల ఆహరం దొరుకుతుంది, లేదంటే ఈపూటకు ఆకలితీరుతుందని దొంగతనం చేసాను. దయచేసి ఇప్పటికైనా నాకు ఏదైనా తినడానికి ఆహారం ఇప్పిచండి కళ్ళు తిరుగుతున్నాయి."అన్నాడు శివయ్య నీరసంగా.'ముందు అతనికి ఏదైనా తినడానికి తీసిఇవ్వు'అని తన బిళ్ళాజవానుకి డబ్బులు అందించిన న్యాయమూర్తి"ఈలోకంలో ఎందరో అభాగ్యులు ఆకలిబాధ అనుభవిస్తున్నారు అందరూ నీలా దొంగతనానికి పాల్పడటంలేదు.దొరికినపనిచేసుకుంటూ నిజాయితీగా, నిర్బయంగా జీవిస్తున్నారు.దొంగతంనం అనేది ఎందుకుచేసినా అదితప్పే అందుకునీకు సాయంత్రం న్యాయస్ధానం ముగిసేవరకు పోలీస్ కస్టడి విధిస్తున్నాను. సాయంత్రం న్యాయస్ధానం ముగిసినతరువాత ఇతన్ని నావద్ద హజరు పరచండి"అని పోలీసులతో అన్నడు న్యాయమూర్తి.
పోలీసులు శివయ్యను తీసుకువెళ్ళారు.
"మనకళ్ళముందు శివయ్య ఆవేదన చెందడం మనం చూసాం, మనం సమాజాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత తలకెత్తుకోలేం కనీసం కళ్ళముందు జరిగే అన్యాయాన్నిప్రశ్నించడం, అన్నార్తులను, వ్యాధిగ్రస్తులను, వృధ్ధులను ఆదుకోవడం మనబాధ్యత,అదిమనందరి కర్తవ్యం,మనిషి బాధను సాటి మనిషే అర్ధంచేసుకోవాలి దయార్ధ హ్రుదయంతో ఆదుకోవాలి. ఈశివయ్యకు కొత్తజీవితం మనందరంఇద్దాం! నావంతు రెండువేలరూపాయాలు అతని బ్రతుకుతెరువుకు ఇస్తున్నా, ఈకోర్టులో ఉన్న దయార్ధ హ్రుదయులైన తమరుకూడా మీకుతోచిన ఆర్ధిక సహాయంచేయండి"అన్నాడు న్యాయమూర్తి.
కొద్దిసేపట్లో ఆకోర్టుహాలులో ఐదువేలరూపాయలు దానంగా పోగయ్యాయి.
సాయంత్రం కోర్టు ముగిసిన అనంతరం కనిపించిన శివయ్యకు ఆడబ్బు అందిస్తున్న న్యాయమూర్తి "ఇవిగో ఐదువేలరూపాయలు వీటితో నీకొత్తజీవితం ప్రారంభించు అన్నాడు"న్యాయమూర్తి.
"అయ్యా ఈడబ్బుతో ఓ టీక్యాను కొంటాను రేపటినుండి ఇదే కొర్టు ప్రాంగణంలో టీ తిరిగి అమ్ముతూ నాకొత్తజీవితం ప్రారంభిస్తాను"అన్నాడు శివయ్య.
"మంచి ఆలోచన ఎందరో చెట్లకింద,చక్కబంకుపెట్టెల్లో కూర్చోని టైపు చేస్తుంటారు,ప్రతిరోజు పలువురు పనులపై కోర్టుకువస్తుంటారు వారంతా చేస్తున్న పని వదలి రోడ్డులోనికి టీ తాగడానికి వెళ్ళడం కష్టమే! నువ్వే వారిదగ్గరకు టీ తో వెళితే వారికి సమయం కలసివస్తుంది,నీకు జీవనాధారం లభిస్తుంది"అన్నాడున్యాయమూర్తి.
కళ్ళనిండానీళ్ళతో చేతులు జోడించాడు శివయ్య.
దైర్యంగా భుజంతట్టాడు న్యాయమూర్తి.
మరుదినంనుండి శివయ్య న్యాయస్ధాన ప్రాంగణంలో తన కొత్తజీవితాన్ని ప్రారంభించాడు.