ద్రౌపతి పుత్రులు - bobbu hemavathi

Droupati putrulu


మార్నింగ్ నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు దుబాయి పోలిస్ నుండి నాకు కాల్ వచ్చింది. ఎంతో విశిస్టమైన విషయమని తొందరగా రమ్మని చెప్పడంతో నాకు TV@24 విలేఖరి గా బారతీయ రాయబారితో సమావేశం ఉన్నా, నేను ఒక గంట ఆగి వస్తానని వెంటనే మెస్సేజ్ పంపి దుబాయి పొలిస్ టవర్ కి వెళ్ళా.
నన్ను చూడగానే ఎంతో గౌరవంగా విష్ చేసిన దుబాయి ముఖ్య పోలిస్ అధికారి తనతో తీసుకొనివెళ్ళి ఒక బారతీయ కుటుంబాన్ని నాకు పరిచయం చేసాడు. తన మాటలలొ సంగ్రహముగా ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళనుండి ఎటువంటి విసా పత్రాలు లేకుండానే వారి దేశాన నివసిస్తున్నారని చెప్తూ వారిని చూపించాడు.
అక్కడ ముక్కు పచ్చాలారని పసిపిల్లలు దుబాయి సేఠ్ దుస్తులలో , వారితో వాళ్ళ తల్లి.
అతని మాటలలొ ఆ కుటుంబాన్ని ఇండియా పంపడానికి ఆమ్నేస్టి ముందుకు వచ్చిందని కాని వారికి ఎటువంటి జన్మ ద్రువ పత్రాలు కాని, విసా కాని, పాస్ పోర్ట్ కాని లేదని, వారిని వారి దేశానికి ఎలా పంపాలొ తెలియడంలేదని చెప్తూ వారి తల్లి ఆ పిల్లలని తన పిల్లలని ఒప్పుకోవడంలేదని, ఈ ఇస్స్యు తనకి చాల తలనొప్పి కలిగిస్తున్నదని, ఒకసారి నన్ను వారితో మాట్లాడమని చెప్పాడు.
ఆమె తెలుగు ప్రాంతమైన గురవకొండ నుండి వచ్చిందని తెలసి నేను ఆమెని పలకరించగానే ఆమె తన గురించి చెప్తూ "నన్ను మల్లెంటారండి. నేను పుట్టినప్పటినుండి యాడికి పో'లా. ఏ దేశం చూడలా. అమ్మా అయ్యల పంచనే ఉండా. నా పదారోఏటనే నేను మా ఊరోడిని మనువాడితి. ఆడు వట్టి తాగుబోతోడాయే. అందుకే నేను ఆడిని విడిచేసా. మా అబ్బ అమ్మలకి కూడెట్టేవాళ్ళు లేకపోయే. ఆళ్ళకి కూడెట్టాలి. అందుకే పాచి పని చెయడానికి ఈడకి వచ్చా".
మా ఊరు దాటి పపెంచాన్నే చూడనిదాన్ని అబ్బో గా విమానాన్ని చూస్తాంటే అబ్బొ ఎంత పెద్దగా ఉండాదని ఆచ్చెరువుచెందా . మా ఊర్ల ముత్యాలకాడ లచ్చ రుపాయలు తీసుకొన్న ఐదు రుపాయల వడ్డికి. గా ముస్టూరు సాఇబు నన్ను దుబాఇ సేట్ కాడ పని కుదర్చాడు. నేను బాగుపడాలగదానని గీపనికి ఒప్పుకున్న. నాలుగు డబ్బులు కళ్ళచూసి చానరోజులాయే.
గీడ మనకాడ ఉండేప్పుడి పొద్దుకాడె నిద్దర లేచి ఇంటింటికి పోయి సద్దెన్నం తెచ్చి అంత తిని నా ఇంట్లోఅళ్ళకి అంత పెట్టి నాను తిన్నా. అయ్యకి మందులు కొనాల. ఆడున్నప్పుడు ఒక కోకా రవికాన పండిక్కి , అయ్యొ కూటికే నాను చత్తన్న. మూడుపొట్టలు నిండాల. మందులు మాకులు కొనాల. ఈడకి వచ్చాక అబ్బొ చానా కట్టాలు పడ్డా. గా సాఇబుల ఇండళ్ళొ చాన పాచి పనులు చేసా. ఆళ్ళ మరుగుదొడ్లు కడిగా.
గప్పుడు నారయనప్ప గా ఇంట్లొనే చేరాడు కారు డైవర్ గా. అబ్బొ ఆడు చాన మంచోడు. నా కట్టం చూసి కండ్లనీళ్ళు పెట్టేటోడు. అయ్యకి ఫోన్ కలిపి చెప్పా నేనాడిని మనువాడతానని. ఈడనె దుబాఇలో మా పెండ్లి అయ్య. గా రొజు నుంచి మేమిద్దరము మొగుడు పెండ్లలైతిమి.అదెందో దుబాయి చట్టాలు మమ్మలును మొగుడు పెండ్లాలమని వప్పుకొలా. గీడనే నాకు నాలుగు కాన్పులయ్య. గాని దవాకయి కి పొయి ఎరుగను.
వాడు నా మొగుడు మా యజమాని తో గొడవపడ్డాడని వాడిని దేశాన్నిండి బహిస్కరించారు. ఆడికి ఐరిస్ పరీక్షా చేసి దేశం బయటికి గెంటిండ్రు. ఆడేప్పుడు ఇక ఈ దేశానికి రాలేడు, గిప్పుడు ఈడ నేను బిడ్డలం ఉంటన్నాం. ఆడ తిండికి కరువాయె. ఈడ ఓ పూటైనా బువ్వ తింటన్నాం.
ఇక్కడే పదేండ్లు గడిచిపొయే.
గిప్పుడు నన్ను నా మొగుడు కాడికి పంపతామంటున్నరు. ఆడు ఆడ కూలికి పోతన్నాడు. గా దెశం పొయి ఎరుకలేని కట్టాలు నేను పడలే. గందుకే దొంగగా నా బిడ్డలతో గీడనే ఉంటన్న. మాకు విసా లేదు. నా బిడ్డలా కి చదువా. గాళ్ళు చదువుకు పొతే చంటిదాన్ని చూసెదెవరు. ఆళ్ళకు గి దేసాన గుర్తింపులెదంట. ఆళ్ళవి వలస బతుకులు. గిడ మా మనువుకే పట్టాలెదు, ఇక నా బిడ్డలకు ఏది.
ఆళ్ళు ఈడ దొంగగా ఇంట్లలోనె పుట్టారు. రొగమొచ్చినా రొస్టుచ్చినా మందు మాకు మా కెరుకే. దవాకాన లొ కాలెట్టితే గా దుబై పోలిసులు పట్టుకొని మా ఊరికి పంపిత్తరు. పండగా, మాకేడివి పండగలు. మీలాంటి పెద్దొళ్ళు చేసుకొనేవి. పిల్లకాయలు ఆడ గీడా బిచ్చమెత్తుకొని బానే సంపాఇత్తన్నారు. గా దెసానికి నేను పొన్రి. నా మొగుడు పొఇనా నాను ఈడనే ఉంటా. పదేండ్లు ఐనాది నాను ఈటికి వచ్చి. నా పానం గీడనే పోవాల, ఆళ్ళు నా పిల్లకాయలు ఎలాగుంటే నాకేంటి. నాకు పైసలు కావల. నాను సుకంగా ఉండాలా.
గా దుబాయ్ పోలిస్ నన్ను పట్టుకొని పిల్లగాండ్రు బిచ్చమెత్తతా ఉండారని గా పిల్లకాయలు నా పిల్లకాయలా అని అడిగిండ్రు. నాను కాదని చెప్పా. నా కెరుకలెదని ఎవరి పిల్లండ్రోనని చెప్పా.
అవును వాళ్ళు ద్రౌపతి పుత్రులు.
వాళ్ళు ఎవరు లేని అనాథలు.
(దుబాయ్ లో తన పిల్లలని అనాథలు చేసిన ఒక తల్లి)

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు