మరణంలో జననం. - రాము కోలా.దెందుకూరు.

Maranam lo jananam

"పోస్ట్! అన్న పిలుపుతో గుమ్మం వైపు పరుగు తీస్తున్న నామనస్సుకు తెలియదు. గుండెలు పిండేసే "నా స్నేహితుని మనోవ్యధను" తనలో నింపుకున్న లేఖ కోసం నామనస్సు పరుగులు తీస్తుందని. ప్రాణమిత్రుడు చివరి క్షణాల్లో,నాకు అప్పగించే గురుతర బాధ్యతను తీసుకువస్తుందని తెలియదు. లేఖను అందుకున్న నాకు మొదటి వాక్యమే శరాఘాతంలా !ఎదను తాకింది. "ఇంకెన్ని క్షణాలు ప్రాణాల్తో ఉంటానో తెలియదు, ఏ క్షణం ఎటువైపు నుండి బుల్లెట్ దూసుకువస్తుందో తెలియదు." నేను చనిపోతాననే బాధ నాలోలేదు.." శత్రువు బుల్లెట్లు నా శరీరంను జల్లెడలా మార్చినా ! జన్మభూమి ఋణం తీర్చుకునేందుకు లభించిన అదృష్టంగా భావిస్తున్నా. చేతుల్లో లేఖ .. జారిపోతున్న కన్నీటిని ఆపుకోలేక పోతున్నా.....కానీ తప్పదు...గుండె ధైర్యం చేసుకుని చదవాలి .... అనుకుంటూ రెండవ లైన్ వైపు నా చూపులు పరుగులు తీయిస్తున్నా. ప్రియ నేస్తమా! ఈ లేఖ నిను చేరేసరికి నేను .. ఈజన్మ ప్రసాదించిన నా భరతమాత ఒడిలోకి శాస్వతంగా చేరుకుంటానేమో....! అయినా ....ఈ శరీరం మరో నలుగురికి ఉపయోగ పడాలనే కోరిక, నీవలన తీరాలనే ఇలా లేఖ రాస్తున్నా... ఉల్లాసంగా గడిచే వారాంతపు సెలవులు ముగించుకుని, డ్యూటిలో చేరి గంటకూడా గడిచిందో లేదో... వైర్ లెస్ సెట్లో మెసేజ్ ... రాత్రి టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సంతో కాళరాత్రిగా మారింది బొంబాయి సిటీ. విశ్రాంతి, వినోదాలు కోసం బయటికి వచ్చిన ప్రజలు రక్తపాతంలో తడిసిముద్దయ్యారు . రెస్టారెంట్లే ఉగ్రవాదులకు లక్ష్యంగా మారాయి అని.. సరదాగా గడిపేందుకు వచ్చిన సామాన్య పౌరులు టెర్రరిస్టు తూటాలకు బలైపోతున్నారని... బాంబు పేలుళ్లలో ఎందరో ఛిద్రమైపోతున్నారని.... రెస్టారెంట్లు అధికంగా ఉండే ప్రాంతంలో కాల్పులకు టెర్రరిస్టులు తెగబడ్డారని....టెర్రరిస్టుల విచ్చలవిడి కాల్పులతో .... అనేక మందిని బలి తీసుకుంటున్నారని విధి నిర్వహణం... టెర్రరిస్టులను పట్టుకోవాలనే ప్రయత్నం..... ఇరు వర్గాల మధ్యన భీకర కాల్పులు... ఎదుటివారి నుండి దాడి తగ్గింది అనుకున్న సమయంలో... వెనుక నుండి దాడి జరిగింది....అయినా దాదాపుగా పొరాడాను... గుండెపక్కగా ఒక బుల్లెట్ట్ దూసుకుపోయింది అనుకుంటా.....కానీ మరో నలుగురునైనా నేలకరిపించాలనే నా లక్ష్యం ముందు బాధ తలవంచింది....శత్రువును ఓడించిన విజయగర్వం...నా ఆధరాలపై నిలిచింది. సమయం రాత్రి పదిన్నర కావస్తున్నది. కానీ నాకు తెలుస్తుంది.....తగిలిన బుల్లెట్ట్ గాయం ఇంకేంతసేపు నన్ను నిలువనీవ్వదని.... అందుకే ఈ లేఖ నీకు రాయిస్తున్నా.... నేను లేకున్నా ..నాశరీరం నలుగురికి ఉపయోగపడాలని చేసిన అవయవదానం...కార్యం నెరవేర్చే బాధ్యత ఒక మిత్రుడిగా నువ్వు నెరవేర్చగలవని...నా కోరిక తీరుస్తావుకదూ.... నాకు కుటుంబానికి కాస్త అండగా ఉండిపో. అమ్మ బాధ్యులు ఇక నుండి నీవే.. చెల్లాయి కూడా జాగ్రత్తగా.. ఇక చదవలేక పోయాను కన్నులు అశ్రుధారలు కురిపిస్తుంటే .. కనిపించని అక్షరాలు మాటున నా నేస్తం హృదయ స్పందన అర్దం చేసుకుంటున్నా.. (ఇంత గొప్ప దేశభక్తుడికి స్నేహితుడినైనందుకు ....గర్వపడుతూ ముందుకు సాగుతున్నా ...అతని కోర్కె నెరవేర్చాలని....). జై జవాన్.. జైజవాన్.. జై జవాన్..

మరిన్ని కథలు

Devuniki Kanukalu
దేవునికి కానుకలు
- సరికొండ శ్రీనివాసరాజు
Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి