అవసరం ఎవరికి?? - bhaskarachandra.

Avasaram evariki
"రోహన్ , కంగ్రాట్స్! నీవు సీటూ నుండి సీవో బ్యాచ్ కి ప్రమోట్ అయ్యావు" అంటూ రోహన్ కు తన ఆన్సర్ షీట్ ను చేతికందిస్తూ చెప్పాను.
రోహన్ పేపర్ తీసుకొంటూ సంతోషంగా "థాంక్స్ సర్" అన్నాడు.
"రోహన్ రేపటి నుండి సీవో బ్యాచ్ టైమింగ్ ప్రకారం రావాలి"
"సరే ,సార్"అన్నాడు రోహన్
క్లాస్ పిల్లల వైపు చూస్తూ "మీరంతా మీ టైమింగ్స్ ప్రకారమే వచ్చేయండి" అని పురమాయిస్తు , క్లాస్ ని క్లాస్ టీచర్ కి అప్పగించి బయటకు వచ్చాను.
చీఫ్ ప్రిన్సిపల్ గా భాద్యతలు చేపట్టినప్పటి నుండి నేను క్లాసెస్ తీసుకోవడం మానేశాను.ఒక వేళ తీసుకున్నా ఏదో ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే తీసుకుంటాను..టీచింగ్ స్టాఫ్ ని మేనేజ్ చేయడం తోటే సరిపోతుంది.అప్పుడప్పుడు ఏవో ఇన్స్పిరేషనల్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను.
టీచింగ్ కాకుండా ,ఇంకా అధనపు భాద్యతలు చాలా ఉంటాయి. స్కూల్స్ ఓపెన్ అయిన మొదటి నుండి వారిని వివిధ బ్యాచ్ లు గా విభజించి, వారిచేత మంచి ర్యాంకులు తెప్పించే వరకు వివిధ దశలలో ఎంతో వత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది
మొదటి వారం లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి, విద్యార్థులను మూడు సెక్షన్స్ గా అంటే సీటు,సీవన్, సీవో లుగా విభజిస్తాము.
సీవో అంటే టాప్ బ్యాచ్..అందరూ టాప్ మార్క్స్ తో పాస్ అవుతారు.ఏదడిగినా ఇట్టే సమాధానం చెప్పెస్తారు.వీరే మా భవిష్యత్తు.వీరు మంచి ర్యాంక్స్ తెస్తే మా స్కూలు ఇమేజ్ పెరుగుతుంది.అందుకే వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాము. మా ఫ్యాకల్టీ కూడా వీరికి ఎక్కువ సమయం కేటాయిస్తుంది.
వీరు ఉదయాన్నే ఆరింటికి వచ్చి సాయంత్రం ఏడు వరకు తరగతి లోనే ఉంటారు. స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ బ్యాచే! టిఫిన్స్, లంచ్ లు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి రోజుకి పన్నెండు గంటలు బందించి, మరీ చదివిస్తాము.
సీవన్ బ్యాచ్ వారు రోజుకి ఎనిమిది గంటలు తరగతిలో గడుపుతారు.వీరు కొంచెం ఆవరేజ్ స్టూడెంట్స్.వీళ్లలో కూడా ప్రతిభావంతులు వుంటారు,కానీ వారికి కొన్ని సబ్జెక్ట్స్ లో పట్టు లేకపోవడం వల్ల ఈ బ్యాచ్ లోనే ఉంటారు.
ఇక సీటు. ఇది వెరీ జనరల్ బ్యాచ్.వీరిపై శ్రద్ద వహించడం వేస్ట్.చదవరు.బేసిక్స్ తెలియవు.వీరు ర్యాంక్స్ తెస్తారన్న నమ్మకం లేదు. అందుకే వీరికై పెద్దగా సమయం కేటాయించం !! ఫీజ్ లు కడుతున్నారు కాబట్టి, మొక్కుబడిగా చూసుకుంటాం..వీరంతా నలభై యాభై మార్కులతో పాసయ్యే బ్యాచ్ ఇది.ఎవడో ఒకడు అప్పుడప్పుడు తళుక్కున మన రోహన్ లా మెరిసి ,తమ ప్రతిభతో సీవో బ్యాచ్ కి ప్రమోట్ అవుతారు.
యాజమాన్యం నా మీద ఎంతో నమ్మకం పెట్టి , నన్ను ఈ స్కూలు కి చీఫ్ ప్రిన్సిపల్ గా నియమించింది.
పెర్ఫార్మె్ చేయాలి. తప్పదు.
మొన్నటి వరకు అడ్మిషన్స్ అని, ప్రతి స్టూడెంట్ పేరెంట్స్ కి కాల్ చేసి ,సెమినార్లు పెట్టి, హోం విజిట్స్ ఏర్పాటు చేసి.ఆడ్స్ ఇచ్చి క్లాస్ టీచర్స్ కి ప్రలోభాలు చూపి , క్లాస్ స్త్రెంథ్ పెంచడంలో తీవ్ర వత్తిడి ఎదుర్కొన్నాను..
తరువాత మౌఖిక సదుపాయాల ఏర్పాటు.
గత వారం,స్క్రీనింగ్ టెస్టుల కోసం టీచింగ్ స్టాఫ్ ని సన్నద్ధం చేయడం, తరువాత విద్యార్థుల బ్యాచ్ విభజన.సివో క్లాసెస్ కి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వారిని మంచి ర్యాంకర్స్ గా తయారు చేయడం,ఇలా స్కూలు పనులతో సతమత మై పోయాను.
ఇవన్నీ రొటీన్ పనులతో బేజారెత్తి పోయాను.నాకు కొంచెం మార్పు కావాలి.కొంచే విశ్రాంతి ,కొంచెం రీఛార్జ్ కావడానికి మంచి ప్లేస్ కావాలి.
మంచి ప్రశాంత మైన స్థలము అంటే మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడియే .ఆ గుడి నా కళ్ళ ముందు కదలాడుతుంది.
ఆక్కడకు వెళుతున్నాను అనే అనుభూతి నాలో లేని ఉత్సాహాన్ని నింపుతుది.
######. ##₹₹####. #######
అది హైదరాబాదుకు యాభై కిలోమీటర్ల దూరం లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం.
నా మనసుకు నచ్చిన దేవుడు, నచ్చిన ఆధ్యాత్మిక స్థలము.
నాకు తిరుపతితో సమానము. ఇక్కడికి వచ్చిన ప్రతి సారి నాలో ఏదో మార్పు సంభవిస్తుంది. ఈ సారి ఏం చేస్తారో చూడాలి ఆ ఏడుకొండలవాడు.
ఆ ఆలయం మా ఊరికి ఓ మైలు దూరంలో ఉంటుంది. మా ఊరికి , పక్క ఊరికి సరిర్గా మధ్యలో ఉంటుంది.
ఆ ఆలయం పైకి ఎక్కి, గర్భ గుడి ముందున్న మంటపం నుండి చూస్తే అక్కడొక ఊరు,ఇక్కడొక ఊరు , ఆ రెండు ఊర్ల మధ్య చిన్న చెరువు, చెరువు పక్కన ఉన్న పచ్చటి పంట పొలాలు, పొలాలో అక్కడక్కడ ఏపుగా పెరిగిన తాటి చెట్లు.వాటి పక్కనే విరివిగా పూసిన తంగేడు చెట్లు అన్నీ కలిపి ఎంతో రమణీయంగా ఉంటుంది ఆ దృశ్యం. ఆ స్వామి ఆ ప్రకృతి రమణీయతను చూడటానికే కాబోలు ఇటు వైపు ముఖం చేసి ఉన్నారు అనిపిస్తుంది !!
ఒత్తిడిగా అమిపించిన ప్రతిసారీ ఇక్కడకు వస్తాను.
ఒకప్పుడు ఈ గుడి చాలా పురాతమైనదిగా కనిపించేది, గుడి మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉండేది ,ఎందుకంటే అవన్నీ గచ్చు రాళ్లతో చేసి ఉండేవి.చెప్పులు వదిలేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే ముళ్ళ మీద కాలు పెట్టినట్టు ఉండేది.ఇక వేసవిలో అయితే, వేడితో కాళ్లు సర్రున అంటుకునేవి.
ఎవరో పుణ్యాత్ముడు,మా ఊరిని దత్తత తీసుకున్నాడట.అతడు ముందుగా ఈ దేవాలయాన్ని బాగు చేయించాడు. మెట్లన్నీ సిమెంట్ తో నున్నగా చేయించాడు.మెట్ల పైన ఎండ తగలకుండా రేకుల షెడ్డు వేయించాడు.ఎక్కుతున్నప్పుడు పట్టుకోవడానికి ఆసరాగ ఉండేట్టు మెట్ల పక్కన రేలింగు కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు మెట్లు ఎక్కలేని వాళ్ళకి,పక్కనుండి రోడ్డు కూడా వేయించాడు.
మెట్ల మొదట్లో చిన్న రేకుల షెడ్డు, చెప్పులు బద్ర పరచుకో దానికి రాకులు. కాళ్లు కడుగు కోవడానికి కుళాయి కూడా ఏర్పాటు చేశాడు.
దేవుడికి మంచి రోజులు వచ్చాయి అంటి ఇదేనేమో అనిపించినది.
చెప్పుల్ని అక్కడ ఉన్న అరలో పెట్టి, కుళాయి దగ్గర పాదాలు కడుక్కొని, మొదటి మెట్టుకు నమస్కరించి దాని మీద అడుగేశాను.అడుగుకి ఆ గరుకు తగలలేదు. మెత్తని తివాచీ మీద అడుగు పెట్టిన అనుభూతి కలిగింది
పాదాలకు తాకిన మెత్తదనం, ఆ సదరు ధాతను మనసారా స్మరించుకుంది.స్వామి వారిని దర్శించుకుంటే కలిగే భాగ్యం లో మొత్తం అతని కాతాలో వేసినా ఆ రుణం తీరదు అనిపించింది.ఇలా రోజుకు ఎంత మంది భక్తులు ఆ మనిషిని దీవిస్తున్నరో! అతని కాతా లో ఎంత పుణ్యం జమ అవుతూ ఉంటుందో!!
మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు బాగానే అనిపించింది.
ఓ పది మెట్లెక్కేటప్పటికి కొంచే ఆయాసం అనిపించింది.శరీరం వయసుని గుర్తు చేస్తుందన్నట్లపించింది.
నాకంటే ముందు,ఓ అమ్మాయి సంకలో పిల్లాడు,మరో చేతిలో ఇంకో పాపను పట్టుకొని .పాపం తను ఆయాసపడుతూ కనిపించింది. అలిసిపోయి నడవ లేక పోతుంది కాబోలు,సేద తీరడానికి అలా కూర్చుంది. ఆమెను దాటుతూ ముందుకు సాగాను.
నాలో ఓపిక ఉంది కాబట్టి కూర్చోవాల్సిన అవసరం పడలేదు. అలాగే ఇంకో ఐదారు మెట్లెక్కి కొంచెం ఆగాను.
నాకంటే వయసులో పెద్ద అయిన ఒకతను మెట్లను ఎక్కలేక ఆయాస పడుతున్నాడు. కొంచెం సేపు ఆగి అక్కడే నిలబడి వచ్చి పోయే భక్తులను గమనిస్తున్నాడు.
ఏం చేస్తాము.ముక్తి కోసం ఎవరి బాధలు వారివి.
ఇంకా పది మెట్లు ఎక్కితే చాలు ,ఆలయ మంటపం.
మంటపం అంటే భక్తులు కూర్చుని భజన చేసుకునేందుకు వీలుగా గర్భ గుడికి ముందు ఏర్పాటు చేసిన చిన్న మంటపం.
అదే నా ఇష్టమైన స్థలం. ఆ స్థలం నుండి ఆ ప్రకృతి అందాలను చూస్తేనే నాకు తృప్తి.ఒకవైపు ప్రకృతి, మరో వైపు దేముడు.
ఇంకా ఐదు మెట్లెక్కితే చాలు, కానీ ఆయాసం ఎక్కువయ్యింది. ఇక ఎక్కలేను అనిపించ సాగింది.కాలు లాగుతున్నట్లనిపించిది.ఓ అయిదు నిమిషాలు ఆగి , శ్వాసను మామూలు స్థాయికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాను.ఎవరైనా చేయి ఇస్తే ,కొంచం అసరాగ ఉండునని కూడా అనిపిస్తుంది. పక్కనే ఉన్న రైలింగ్ పట్టుకుని కొంచెం అగాను. ఇంతలో ఎవరో యువకుడు నన్ను, నా అవస్తను గమనించి, నాకు సాయం చేయడానికి ఓ రెండు మెట్లు దిగి నా చేయిని అడిగాడు.
అదే సమయంలో ఇంకొక పెద్దాయన, నేను అవస్త పడుతున్న తీరును మరియు సాహాయం కోసం చేతినందివ్వ బోతున్న ఆ యువకుడిని ఆశ్చర్యంగా చూస్తూ మా దగ్గరికి వచ్చాడు.
అతని ముఖంలో ఏదో తెలియని కల,కట్టు బొట్టు చూస్తే మంచి పలుకుబడి ఉన్న మోతుబరిలా కనిపిస్తున్నాడు.
"రండి సర్, నా చేయి పట్టుకొని మెట్లెక్కండి.ఎక్కాల్సినవి ఇంకా అయిదారే. ఇవి ఎక్కితే చాలు శ్రీవారి మండపం"అన్నాడు చేయి చాచుతు ఆ యువకుడు.
అతనికి నా చేయిని అందించి, అతని సహాయంతో మిగిలిన మెట్లు ఎక్కేద్దాము అనుకున్నా, కానీ ఎందుకో, ఆ పెద్దాయన మా ఇద్దరినీ అదో రకమైన చూపులతో , ఏదో చెప్పాలనె భావనతో ఉన్నట్టు అనిపించింది.
నేనే కలిగించుకొని, ఆ పెద్దాయన కళ్ళలోకి చూస్తూ ,"అయ్యా! మీరేమి అనుకోనంటే ,మీరేదో మాకు చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి " అన్నాను.
అతను చిరు నవ్వుతో మరింత దగ్గరికి వచ్చి,
"తొంబై ఆరవ మెట్టు పై ఉన్న వారిని వందవ మెట్టుపైకి చేర్చడానికి సహాయం అవసరమా?" అని తన ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నని అడిగాడు.
మేమిద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం.
అతనే మళ్ళీ, మెట్లు ఎక్కలేక పిల్లలతో సమతమవుతున్న ఆ అమ్మాయి మరియు ఇతర భక్తుల వైపు చేయి చూపిస్తూ,
"ఏ నలబయ్యో, యాబయ్యోవ మెట్టుదగ్గర్లో ఎక్కలేక అవస్త పడుతున్న ఆ భక్తులను చూడండి.వీలైతే వారిని పైకి తీసుకు రావడంలో సహాయ పడండి- ఇంతే చేపుదామనుకున్నా అంతే.." అన్నాడా పెద్దమనిషి
నిజానికి ఆతను చెప్పింది ముమ్మాటికీ నిజం. మధ్య మెట్ల దగ్గర ఎక్కలేక అవస్త పడుతున్న వారికే, సహాయం చాలా అవసరం.అలసట అని కిందికి వెళ్ళలేరు, అలా అని తాపీగా పైకి ఎక్కనూ లేరు.
అవును, ఈ సహాయం నాకవసరం లేదు .నేను చాలా మెట్లు ఎక్కి గమ్య స్థానానికి చేరువలో ఉన్నాను.
'నా వెనక ఆ పెద్ద మనిషి, ఆ వెనకాల బిడ్డలతో ఆ అమ్మాయి మెట్లేక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజానికి సహాయం అవసరమైనది వారికి 'అని నాలో నేను అనుకున్నాను, నా చూపును అటు వైపుగా సారిస్తూ.
అంతే, అతను అలా అన్నదే తడవుగా ఆ యువకుడు మెట్లనుండి చక చకా కిందికి దిగి పోయి వారిని పైకి తేవాల్సిన కార్యంలో నిమగ్నమయ్యాడు ,అది వేరే విషయం.
నాకు మాత్రం ఆ మాటలు ఎక్కడో తగిలాయి.
అవును ఒకటో మెట్టు దగ్గర ఉన్నవాడు ఎక్కాల వద్దా అని తన శక్తి సామర్థ్యాలు బేరీజు వేసుకుని ఓ నిర్ణయం తీసుకొని ఎక్కడం మొదలు పెడతారు.ఎక్కలేము అనుకుంటే పక్కన ఏర్పరచిన రోడ్డు గుండా వచ్చేస్తారు.
ఇక చిక్కంతా ఉన్నది మెట్ల వరసలో మధ్య వరకు చేరుకున్న వారితోనే. వీరు సగం ఎక్కి, డీలా పడిపోయి అటు దిగలేక ఇటు ఎక్క లేక ఇబ్బంది పడుతూ ఉంటారు
నేనక్కడ ఒక ఒక సీవో బ్యాచ్ స్టూడెంట్స్ లాగా నిలబడ్డట్టు అనింపించింది.ఆ యువకుడు మా టీచర్స్ లా నన్ను వందవ స్థానానికి తీసుకెళ్లడంలో తన హస్తాన్ని అందిస్తున్న వారిలా తోచాడు.
నా వెనక సివన్ స్టూడెంట్స్ నిలబడ్డట్టుగా, ఇంకా కింద మెట్ల మార్గ మధ్యలో సీటూ స్టూడెంట్స్ చతికిల బడి ,సహాయం కోసం దీనంగా ఆ టీచర్ వైపు చూస్తూ కూర్చున్నట్లు అనిపించ సాగింది.
అవును... మా స్కూలు విద్యార్థులు తమ తమ బ్యాచ్ల కనుగుణంగా, అక్కడ నిలబడి అవస్థలు పడుతున్న భావన కలిగింది.
తొంభై శాతం మార్కులు తెచ్చుకొనే విద్యార్తులను తీసుకొని వారిచేత తొంబై తొమ్మిదో లేక వందో తెప్పించడం లో గొప్పేంటి ??
.
బాగా చదువుకొనే బ్రైట్ స్టూడెంట్స్ ని ఇంకా రప్పాడించి వారిచేత రాంక్క్స్ తెప్చించి మన స్కూళ్ల ఇమేజ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తాము తప్ప , ఈ సామాన్య విద్యార్థుల గోడు మనకు పట్టదు.
నిజానికిగ. ఒక తరగతి లో ఉన్న విద్యార్థుల్లో ఎవరికి ఎక్కువ సమయం కేటాయించాలి.ఎవరిపై ఎక్కువ శ్రద్ద వహించాలి అన్న విషయాన్ని పాఠశాల యాజమాన్యం ర్యాంకుల మోజులో పడి , పట్టించు కోదు.
అవును మా బడిలో వివిధ బ్యాచ్ లకి కేటాయించే సమయం, చూపే శ్రద్ధ వారి అవసారానుసారంగ లేవని అనింపించ సాగింది. ఆ పెద్దాయన చెప్పినట్టు, సహాయం ఏ బ్యాచ్ కి అవసరమో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది,దానికనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని బలంగా అనిపించింది.
అలా నడుస్తూనే సంస్కరణలు చేసే దిశగా మెదడు ఆలోచించడం మొదలు పెట్టింది.
ఇంతకీ ఆ యువకుడేమిటి,ఆ పెద్ద మనిషి చెప్పగానే పూనకం వచ్చిన వాడిలా , టక్కున వెనుకా ముందు ఆలోచించ కుండా ఆ పనిలో నిమగ్నమైపోయాడు..
అతని మాటల్లో ఏదో మహిమ మాత్రం ఉందనిపించింది
అతనెవరో తరువాత తెలుసుకోవచ్చు లే అనుకుంటూ, ఎలాగో అలాగ మండపం చేరుకున్నాను.
అటునుండి కనిపించే ప్రకృతి దృశ్యం చూసి మనసు ఆనందంతో పొంగి పోయింది.
లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటామో, అది జరిగేలా చూసే భాధ్యత ప్రకృతి తన మీద వేసుకొంటుడట. మనం అనుకున్నది జరగడానికి తోడ్పడుతుందట.
అందుకే ఆ ప్రకృతిని చూస్తూ మళ్ళీ ఒక్క సారి, రేపు స్కూల్లో చేపట్టాల్సిన సంస్కరణలను మేనేజ్ మెంటు ముందు పెట్టి ఒప్పించాలన్న నిర్ణయాన్ని శ్రీవారి సన్నిధిలో ప్రకృతికి పదే పదే పంపించాను.
ఇంతలోనే యువకుడు కూడ వచ్చి నా పక్కన నిలబడ్డాడు.అతను నాలాగే ఆ ప్రకృతి అందాన్ని తిలకిస్తున్నట్టున్నాడు.
నేనే కల్పించుకొని," ఇందాక మెట్ల దగ్గర మనకు సలహా ఇచ్చాడే , ఆ పెద్దమనిషి ఎవరు బాబు? " అని అడిగాను.
అతను నా ప్రశ్నకి ఆశ్చర్య పడుతూ, " అతను మీకు తెలియదా, అతనే వెంకన్న!! అతను ఈ ఊరిని దత్తత తీసుకున్న పెద్ద మనిషి, ఈ గుడికి ఇన్ని వసతులు కల్పించబడింది అతని చొరవ వల్లనే.
అందుకే అతడు అంటే అందరికీ గౌరవం....."అంటూ అతని గూర్చి ఇంకా ఏవెవో చెప్పుకుంటూ వెళుతున్నాడు.
నాకు మాత్రము అతనొక దిశా నిర్దేశకుడిలా కనిపించాడు.
స్కూలుకు వెళ్లి ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో ఒక కచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది, ఇక అటువైపు అడుగులు వేయడం మే తరువాయి ,అంటూ వెంకన్నను దర్శనం చేసుకొన్నాను. ఒక కొత్త ఆలోచనకు ప్రాణం పోసిన ఆ వెంకన్నకు కూడా కృతజ్ఞతలు.!!

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న