ఆ రోజు మా స్కూల్ ఎంతో కళకళలాడుతోంది. పిల్లలందరూ సంతోషముతో తుళ్ళి పడుతూ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హాజరవుతూ ఉన్నారు. అన్ని రోజుల మా కష్టాన్ని పిల్లల ఆనందముతో మరచిపోయాము.
ముఖ్య అతిథిగా మా ఊరి నుంచి మినిస్టర్ గా ఎన్నికయిన ఎం.ఎల్.ఏ ని పిలుద్దామని మా హెడ్మాస్టర్ ని ఎంతో ప్రాధేయపడ్డాము. ఆయన ఓ పట్టాన ఒప్పుకోలేదు. మా స్కూల్ ఒకప్పటి ఓల్డ్ స్టూడెంట్ ప్రస్తుత త్రోబాల్ ఛాంపియన్ అయిన సదాశివాన్ని పిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మినిస్టర్ చేతుల మీదుగా అతనికి సన్మానం చేయాలని నిర్ణయించారు.
ఆయన నిర్ణయాన్ని మేము హర్షించ లేకపోయినా, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఆహ్వాన పత్రిక ముద్రించడం దగ్గరనుండి, స్కూల్ ఫంక్షన్ కి స్పాన్సర్స్ ని వెతకడం వరకు అన్నీ మేము ముందుండి చూసుకున్నాము. మాకు మా హెడ్మాస్టర్ మీద ఎంతో గౌరవం మరియు నమ్మకమూను. ఆయన స్వతహాగా చాలా మితభాషి. కానీ న్యూ టీచింగ్ మెథడ్స్ ద్వారా పిల్లలకు పాఠాలను బొధించడాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. స్కూల్లో పిల్లలను ఎంతో ప్రేమగా చూసేవారు.
మేమందరమూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మా స్కూల్ లో పండుగ వాతావరణం నెలకొంది. మా ఎం.ఎల్.ఏ మరియు మా ముఖ్య అతిధి ని, మా హెడ్మాస్టర్ వేదికపైకి ఆహ్వానించారు. మా హెడ్మాస్టర్ గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ వేదికను అలంకరించిన ఆహ్వానితులు ఇద్దరూ ఒకప్పటి ఆ స్కూల్ స్టూడెంట్స్ అని చెబుతూ వారి నుండి పిల్లలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అన్నారు. మా ముఖ్య అతిథి ప్రస్తుత త్రోబాల్ ఛాంపియన్ అయిన సదాశివాన్ని మాట్లాడాలని కోరారు.
అతను మాట్లాడుతూ తను ఆ స్కూల్ కి ఎంతో రుణపడిఉన్నానని చెబుతూ, "మా నాన్నగారు కూడా ఇదే స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. ఈ స్కూల్ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. ప్రేమతో స్కూల్లో పిల్లలను చేరదీసేవారు. ప్రస్తుత హెడ్మాస్టర్ గురుతుల్యులు ప్రకాష్ గారు, ఆనాడు మాకు టీచర్ గా ఉండేవారు అని చెబుతూ మేము మా నాన్నగారితో సహా కుటుంబ సమేతంగా తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు మా బస్ కి జరిగిన యాక్సిడెంట్ లో మా నాన్నగారు మరణించారు. మా అమ్మ నిండు చూలాలు అప్పటికి. మా అమ్మకు రెండు కాళ్ళు పోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మ తమ్ముడికి జన్మనిచ్చింది కానీ అవిటి దై పోయింది అని నాకు ఎడమచేతిని తీసివేసారని అంటూ అతను ఒక్కసారిగా తన ఎడమ చేతిని చూపాడు".
అది అది..... ఒక ఆర్టిఫిషియల్ లింబ్. ఒక్కసారిగా పిల్లలందరూ నిశ్శబ్దంగా అయిపోయారు.
అది అది..... ఒక ఆర్టిఫిషియల్ లింబ్. ఒక్కసారిగా పిల్లలందరూ నిశ్శబ్దంగా అయిపోయారు.
"తొందరలోనే నేను స్కూల్ కి తిరిగి వచ్చినా ఆ ఇన్సిడెంట్ ని మరువలేకపోయాను. నిద్రలో కూడా భయంతో కలవరించే వాడిని. ఒకపక్క అమ్మని చూస్తుంటే నాకెంతో దిగులు. చంటిపిల్లాడైన మా తమ్ముడిని చూసుకోలేక మా అమ్మ ఎంతో అవస్థపడేది. కాళ్ళు లేకపోయినా వీల్ చైర్ ని ఆసరాగా చేసుకొని నన్ను ఆ ట్రామా నుండి బయటకు తీసుకు వచ్చింది. మా నాన్నకు ఉన్న మంచి పేరు వలన స్కూల్ లో అందరూ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు" అని చెబుతూ "నా తోటి స్నేహితులు నన్ను ఓదార్చే వారు. నా హోంవర్క్ వాళ్ళు చేసేవారు. ఇప్పటికి నాకు నా చిన్ననాటి స్నేహితులతో సత్సంబంధాలు ఉన్నాయి".
"నాలోని పోరాట పటిమను గమనించిన మా పి.యి.టి టీచర్ నన్ను మన నేషనల్ గేమ్ అయిన త్రోబాల్ నందు ప్రోత్సాహించారు. పెట్టుడు చేతితోనే నేనా గేమ్ ఆడటం మొదలు పెట్టాను. ఒంటి చేతితో ఆ గేమ్ ఆడటం ఎంతో కష్టమయ్యేది. నాలో నేనే ఎంతో ఉత్తేజాన్ని నింపుకొని పోరాట పటిమతో ఆడటం మొదలు పెట్టాను. ఒక్కొక్కసారి రక్తం ధారలుగా స్రవించేది. అయినా ఆ బాధను ఓర్చుకొని నేనా గేమ్ ఆడేవాడిని. నా కృషి, పట్టుదల వలన, స్టేట్ టీం లో నాకు తొందరగానే చోటు లభించింది. స్కూల్ లో చదువుతున్న రోజుల్లోనే నేను స్టేట్ చాంపియన్ అయ్యాను. అలాగని నేను నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. పై చదువుల కోసం నేను కాలేజ్ కి వెళ్ళినా కూడా నా స్కూల్ మిత్రులు నన్ను మర్చిపోలేదు. తరువాత నేను నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ అయ్యాను. దానికి కారణం మన స్కూల్ లోని ప్రోత్సాహకరమైన వాతావరణం".
"ఈనాడు నేను మీ ముందు ఆసియా చాంపియన్ గా నిలిచానంటే దానికి కారణం నాకు ఈ గేమ్ లో పునాది వేసిన ఈ స్కూల్. అందుకే నేను ఈ ట్రోఫిని మరియు దానిద్వార వచ్చిన పదిలక్షల రూపాయలను నా స్కూలుకి అంకితమిస్తున్నా. దీని ద్వారా మరింతమంది చాంపియన్లు తయారుకావాలని కోరుకొంటున్నాను. అవిటితనం మనిషికే కానీ మనస్సు కు కాదు.
పిల్లలు...... మీరు అవిటివారిని మీ ఇంటివారనుకొని సహాయం చేయండి, మరింత గా ఎదగండి.
కృషి, దీక్ష, పట్టుదల వీటివలన ఏదైనా సాధించవచ్చు, మీ కలలను నిజం చేసుకోవచ్చు. ఓటమి అన్నది శరీరానికే కాని మనస్సు కు కాదు. ఒకసారి ఓడినా మరొక్కసారి ప్రయత్నించండి. మీ గెలుపు కోసం ప్రయత్నాన్ని మాత్రం విడవద్దు. జైహింద్ " అంటూ తన మాటలను ముగించాడు.
పిల్లలు...... మీరు అవిటివారిని మీ ఇంటివారనుకొని సహాయం చేయండి, మరింత గా ఎదగండి.
కృషి, దీక్ష, పట్టుదల వీటివలన ఏదైనా సాధించవచ్చు, మీ కలలను నిజం చేసుకోవచ్చు. ఓటమి అన్నది శరీరానికే కాని మనస్సు కు కాదు. ఒకసారి ఓడినా మరొక్కసారి ప్రయత్నించండి. మీ గెలుపు కోసం ప్రయత్నాన్ని మాత్రం విడవద్దు. జైహింద్ " అంటూ తన మాటలను ముగించాడు.
వెంటనే పిల్లలందరూ లేచి నిలబడి ఆయన మాటలకు చప్పట్లు చరుస్తూ ఆయన దీక్షకు నమస్కారం చేశారు.
ఆ క్షణం మాకు అర్థమైంది మా హెడ్మాస్టర్ గారు అతన్ని ఎందుకు ఆహ్వానించారని. అతను తన అవిటి తనాన్ని లెక్కచేయక ఈ ప్రపంచాన్నే జయించాడు. అతని దీక్షను ప్రశంసించకుండా ఉండలేకపోయాము.