మనోడు మారడుగాక మారడు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Manodu maradu gaka maradu

చిన్నతప్పెటపై దరువు వేసుకుంటూ వచ్చిన కుందేలు " ఒహో ఇందు మూలంగా తెలియజేయడమేమనగా రేపు పొద్దుటేల అందరు సింహరాజు గుహవద్దకు రావలసినదిగా రాజుగారు తెలియజేయమన్నారు, అడవిలో జరిగే దొంగతనాలకు కారణమైన దొంగను రేపు బహిరంగంగా ఉరితీయబోతున్నారు కనుక అందరు రేపు రావలసినదిగా తెలియజేయడమైనదహో " అని కుందేలు వెళ్ళిపోయాడు.
తింటున్న పనసపండు చేదుగా అనిపించింది కోతికి,ఈఅడవిలో ఉన్నదొంగను నేనే అంటే రేపు ...భయంతో ఒణికిపోయినకోతిబావ , నారసంచితో చెరువు గట్టుకు పరుగుతీసాడు.
పొద్దుపోవడంతో మంత్రి నక్క తన బొరియలొతల వెలుపలకుపెట్టి పడుకున్నాడు ,పొదలమాటున అలికిడి కావడంతో చేతికి అందినకర్రతో బలంగా పొదపైన రెండు దెబ్బలు వేసాడు.
" చచ్చానురా బాబోయ్ " అని గావుకేక పెట్టాడు కోతి. " ఎవరు కోతినువ్వా! ఎవరో దొంగ అనుకున్నాను "అన్నాడు నక్క. "మహప్రభో తమకు పీతలు అంటే మహఇష్టంకదా! ఇచ్చివెళదామని వచ్చా " అన్నాడు దెబ్బతగినిన నడ్డిని సవరించుకుంటూ కోతి. "
" రెండు దెబ్బలు పడేసరికి నేను ప్రభువును అయ్యానా ?" అన్నాడునక్క.
"అయ్యా నాగురించి మీకు తెలియనిది ఏముంది ,రేపు రాజుగారు నాకు విధించే ఉరిశిక్ష తమరే ఆపగలరు ఎలాగైనా ఈఆపదనుండి నన్ను తమరే రక్షించాలి "అని నక్క కాళ్ళు పట్టుకున్నాడు కోతి .
" ఓహో అందుకు ఈపీతలు లంచంగా తెచ్చావా ? పాము చిన్నదీ అయినా పెద్ద కర్రతోనే కొట్టాలి అలాగే తప్పుఏదైనా శిక్ష ఖటినంగాఉంటేనే తప్పు చేసేవారికి భయం ఉంటుంది" ఉన్నాడు నక్క.
" రామ రామ పెద్దలను చూడ్డానికి వెళ్ళెటప్పుడు వట్టిచేతులతో వెళ్ళకూడదని ఈపీతలు..."నసిగాడు కోతి.
" చెడిన ఆహారం,చెప్పుడు మాటలు, తప్పుడు పనులూ ఎప్పుడూ ప్రమాదకరమైనవే జీవితంలో వాటికి దూరంగా ఉండాలి నువ్వు వీటికి దూరంగా ఉంటానని నాకు మాట ఇస్తే నిన్ను ఈ ఆపదనుండి కాపాడతాను " అన్నాడు నక్క .
" ప్రాణాలు పోతుంటేకూడా తప్పుడు ఆలోచన చేస్తానా ? ముందు జీవితంలో మరెన్నడు దొంగతనం చేయనుగాక చేయను" అన్నాడు కోతి.
మరుదినం జంతువులన్ని సభతీరి ఉండగా "మహరాజా చిన్న దొంగతనాలకు ఉరిశిక్ష న్యాయంకాదు కనుక తమరు ఈసారికి ఆదొంగను క్షమించమని నావిన్నపం " అన్నాడు మంత్రి నక్క. "మంత్రి మీమాట ఎన్నడు కాదన్నాము ఈసారికి ఆదొంగను క్షమించి వదిలి వేస్తున్నాం " అన్నాడు సింహరాజు. ఆతీర్పు విన్నజంతువులన్ని ఎవరిదారిన వాళ్ళు
అందరు వెళ్ళిపోయారు.
అక్కడ ఎవరూ లేకపోవడంతో,అప్పటివరకు సింహరాజు గారు కూర్చన్నా పీట ఎత్తి నెత్తిన పెట్టుకొని పరుగు తీసాడు కోతి.
అది చూసిన పిల్లరామచిలుక " మనోడు మారడుగాక మారడు వీడికి సరైన గుణపాఠం నేర్పాలి " అనుకుంది.

మరిన్ని కథలు

Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి