మధురానగరిలో రాముడు, భీముడు,సోముడు అనే ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారికి ఒక దుర అలవాటు ఉంది. రాముడికి చేతులకు దురదలు పెట్టినట్టు గీరుకోవడం, భీముడు ముక్కును కుడి ఎడమ చేతులతో రుద్దుకోవడం, సోముడు అతని చుట్టూ దోమలు ఎగురుతునట్టు వాటిని చంపుతున్నట్టు చప్పట్లు కొట్టడం ఇవి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు.
వీళ్ళను చూసిన ప్రతి ఒక్కరూ వీరి చేష్టలను చూసి ఎగతాళి చేసేవారు. ఒక రోజు ముగ్గురూ ఒక చోట కూర్చున్నాక “అరే కనీసం ఒక్క రోజైనా మన అలవాట్లను పక్కన పెట్టాలి... అలా జరగాలంటే మనం పందెం కాయాలి” అన్నాడు రాముడు. “ఓ అలాగే మేము పందేనికి రెడీ” అన్నారు భీముడు,సోమూడు.
“పందెం ప్రాంభమయ్యింది” అన్నాడు రాముడు. కాసేపటికే రాముడు కుడి, ఎడమ చేతులతో మోచేతుల వరకు గోకాడు. “నువ్వు ఓడిపోయావు.. ఇక మా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంది” అన్నాడు భీముడు. “నేను గోక లేదు ఇందాక ఒక బండి వాడు పెద్ద పెద్ద సొరకాయలను అమ్ముతుంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో అని మీకు చూపించాను” అన్నాడు తెలివిగా రాముడు.
చాలా సేపటి నుండి ఓపికగా ఉన్న భీముడు ముక్కును కుడి, ఎడమ చేతులతో రుద్ద సాగాడు. “ఆ నువ్వు కూడా ఓడిపోయావు ఇక నేనే మిగిలాను” అన్నాడు సోముడు.
“ ఆ... ఆ సొరకాయల బండి వాడు ఇటు వెళ్లడా... అటు వెళ్లడా అని అడుగుతున్నాను” అన్నాడు అంతే తెలివిగా భీముడు.
సోముడికి కూడా ఓపిక నశించింది చప్పట్లు కొట్టసాగాడు “ఆ నువ్వూ ఓడిపోయావు..” అన్నారు రాముడు,భీముడు “ఆ... అదేమీ లేదు ఆ బండి వాడిని చప్పట్లు కొట్టి పిలుస్తున్నాను” అన్నాడు వారికి ఏమాత్రమూ తీసిపోనట్టు సోముడు.
“అవునురా పందెం కాయటం మన వల్ల కాదు... తెలివిగా ముగ్గురం భలేగా సాకులు చెప్పాము. అందరూ ఏదో ఒకటి సాధిస్తారు మనం ఈ అలవాట్లను సాధించాము” అని నవ్వుకున్నారు ఆ భలే మిత్రులు.
“నాయనలారా... దురద గీరుకున్నంత సేపు భలేగా ఉంటుంది... ఆ తరువాతే చిమ.. చిమ మంటూ మండుతుంది” అన్నాడు వారిని చూసిన ఒక సాధువు.“మాకూ మానుకోవాలనే ఉంది స్వామీ కానీ సాధ్యపడడం లేదు” అన్నాడు రాముడు. “మీకు మందు ఇస్తాను పదండి” అని ఆ సాధువు వారిని ఒక వేప చెట్టు వద్దకు తీసుకెళ్లి “మీలో ఎవరైనా ఈ చెట్టు ఎక్కి కొన్ని వేపమండలు తెంపి కింద పడేయండి” అన్నాడు సాధువు.
భీముడు చకచకా చెట్టు ఎక్కి కొన్ని వేప మండలు కింద పడేశాడు. లేత ఆకులను, ముదురు ఆకులను వేరు చేసి కాస్త నీరు పోసి రాళ్లతో ముద్దగా చేసి కాస్త పసుపు కలిపాడు సాధువు. లేత ఆకులతో నూరిన ముద్దను చిన్న గోళికాయలంత చేసి వారిని మింగమన్నాడు.
వారు గబుక్కున మింగారు, తరువాత ముదురు ఆకుల ముద్దతో రాముడికి రెండు మోచేతుల వరుకు, భీముడికి ముక్కుకు అటూ ఇటూ, సోముడికి రెండు అర చేతులకు బాగా రాశాడు “ఒక గంట తరువాత కడిగేసుకోండి..ఇదే విధంగా మరో రెండు రోజులు చేసుకోండీ... మీకు దురద పూర్తిగా నయమవుతుంది” అని చెప్పాడు ఆ సాధువు.
“మీకు మా ధన్యవాదాలు స్వామీ” అన్నారు ఆ ముగ్గురు. సాధువు చెప్పినట్టే చేశారు ఆ ముగ్గురు. దానితో వారికి పూర్తిగా ఆ అలవాట్లు పోయాయి తరువాత చక్కగా పనులలో చేరి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ భలే మిత్రులు.**
యు.విజయశేఖర రెడ్డి,హైదరాబాద్,చరవాణి: 9959736475
భలే మిత్రులు