తిక్కలపిల్లీ - తెలివైన ఎలుక . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Tikkala pilli Telivaina Eluka

' ఒరే అడ్డగాడిద కొడుకా నిన్న చెప్పిన పాఠం రాసుకొచ్చావా? ఏది చూపించు ' అన్నాడు నక్క . ' ఇదిగో రాసుకోచ్చాను ' అని చూపించాడు పిల్లగాడిద . ' ఒరి నీ చదవేస్తే ఉన్నమతి పోయిందని,ఇక్కడ చూసుకో పదిలంగా అనిఉండాలి మరి నువ్వేం రాసావు చూసు పంది లంగా అనిరాసావు వెధవ, పందులు లంగాలు వోణీలు వేయవు .ఒరే కోతి కొడకా నువ్వురాసింది చూపించు 'అన్నాడు నక్క. 'అయ్యోరు ఇదిగో అని పలక అందించింది పిల్లకోతి. ' ఏమిట్రా ఇది రామునితో కపివరుండిట్లనిఏ అనికదా ఉండాలి ,నువ్వు రామునితోక పిరువరుండిట్లనిఏ అనిరాసి తగలడ్డావు,తోక బుద్దులు నువ్వునూ, సరేకాని మీకు ఒక కథచెపుతాను అదివిని ఆకథలో నీతి ఏంటో చెప్పండి... ఒకఅడవిలో పిల్లి ఆహర వెదుకుతూ బయలు దేరింది. కొంతదూరం వెళ్ళక, ఏదోతింటూ అటువైపుకు తిరిగి ఉన్న ఎలుక కనిపించింది. ఒక్కఉదుటున ఎగిరి దానిపై పడిన పిల్లి తనకాళ్ళతో బంధించింది . ఉలిక్కిపడిన ఎలుక పకపక నవ్వసాగింది. 'ఏయ్ తిక్కల ఎలుక కొద్దిసేపట్లో నాకు ఆహరం కాబోయే నువ్వు భయపడాలిగాని ఇంత సంతోషంగా ఎలా నవ్వుతున్నావు? 'అన్నది పిల్లి. 'అయ్యా కాలం చాలగొప్పది ఎంతటివారైనా దానిముందు తలవంచక తప్పదు, నేను చాలా కాలంగా మందులకు లొంగని మొండి వ్యాధికి లోనై బాధపడుతూ ఉన్నాను. అందుకే నేను చనిపోవడానికి ఈవిషంఉన్న కాయ తింటున్నాను, ఇప్పుమీరు విషపూరితమైన నాశరీరాన్ని తిన్నావనుకో నాతోపాటే మీరు మరణిస్తారు అందుకేనాకు నవ్వోచ్చింది 'అన్నది ఎలుక 'ఒతిక్కల ఎలుక నేనేమైన తెలివి తక్కువ దాన్నా విషపూరితమైన నిన్ను తిన డానికి ,నువ్వుకాకుంటే మరొకటి తింటాను ,నీచావేదో నువ్వు చావు 'అని ఎలుకను వదిలి వెళ్ళిపోయింది పిల్లి .

పిల్లలూ కథవిన్నారుగా ఈకథలో మీకు ఏం అర్ధంమైయింది 'అన్నాడు నక్క. 'ఇందులో అర్ధకాకపోవడానికి ఏముంది? విషపూరితమైన ఆహరపదార్ధాలు తినకూడదు 'అన్నది పిల్లకోతి. దానిమాటలువిన్న నక్క బాధతో తనచేతికాలు నోటపట్టి కోపంతో కస్సుక్క కొరుక్కొని కెవ్వుమంటూ, 'ఒరే గాడిదకొడకా నీకెలా కథ అర్ధమైనదో చెప్పు 'అన్నాడు' 'అయ్యొరు రోగంతో ఉండే ఏప్రాణిని ఆహంరంగా తినకూడదు అనితెలుసు కున్నాను'అన్నాడు. గాడిద మాటలకు మూర్చవచ్చినంత పనిఅయిన నక్క మరో ముందరకాలు చేతిని కొరుక్కోబోయి నొప్పిభయంతో ఆప్రయత్నం విరమించుకున్నాడు . 'తిక్కలోళ్ళారా మీచదువులు, తెలివితేటలు మెచ్చదగినవే కాని, ఎలుక తనప్రాణంపోతున్నందుకు కాదు పిల్లి చనిపోతుందని జాలితో అలాచెప్పింది' అన్నది కుందేలుపిల్ల. వీటి తెలివి తెల్లారా అనుకుని ముంతలో నీళ్ళతో ముఖంపైన గుమ్మరించుకున్నాడు నక్క.

' ఓయ్ తమ్ముళ్ళు ఇక్కడ ఎలుక తనప్రాణాలను కాపాడుకోవడానికి పిల్లికి అబధంచెప్పింది. ఏవిషయమైనా మనం తెలుసుకున్నప్పుడు దాన్ని పరిశీలించి, ఆలోచించి సమాధానం ఇవ్వాలి. కథవినడం,చదవడం వలన ప్రయోజనం ఉండదు దానిలోని అర్ధాన్నా,భావాన్నిగ్రహించగలిగితేనే పరిపూర్ణత లభిస్తుంది . అన్నది గున్న ఏనుగు.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు