భార్య కన్నీళ్ళు - hemavathi bobbu

Bharya kannellu
మామా ఎందుకు అలా ఉన్నావు, "రాత్రంతా నిద్ర లేనట్టు, ఎర్రటి కళ్ళతో, అచ్చు గడ్డం లేని దేవదాసు లా"' ప్రభు అంటుంటే నేను వాడి వంక చూసాను.
ప్రభు చెప్పేది నిజమే.....
వాడు నిశ్సబ్దంగా తనని కాదన్నట్లు ఎటో చూస్తూ ఏదో ఆలోచనలో మమ్మల్ని దాటి వెళ్ళబోయాడు.....

వెంటనే ప్రభు, "పద మామా అలా కాంటీన్ వరకు " అంటూ వాడిని బలవంతంగా లాక్కొని పోతుంటే నేను కూడా ప్రభు ని అనుసరించాను.

"చెప్పరా' అంటూ చాయ్ ఆర్డర్ చేసి వాడిని గద్దించాడు....
ప్రభు మా గ్యాంగ్ లో ఎవ్వరికి ఎటువంటి కష్టం వచ్చినా ఓర్చుకోలేడు.
మేమందరము కాలేజ్ రోజులనుండి, ఇప్పటివరకు కలిసే ఉన్నాము. వేరు వేరు కంపెనీలలో పనిచేస్తున్నా అందరమూ వారానికొకసారైనా కలుస్తుంటాం.....

ప్రభు..... అంటూ వాడి కంట్లో కన్నీళ్లు.

'ఏమైందిరా. ఇంట్లో అందరూ క్షేమమే కదా'....అన్నాను నేను.

వాడు తల పైకి ఎత్తి ఒక్కసారి మమ్మల్ని చూసి, " రాత్రి సుసీ నిద్ర మాత్రలు మింగిందిరా, చాలా ఎక్కువగా"....
పొద్దున తొందరగా నిద్ర లేవకపోతే, డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాను, తను సూసైడ్ కు ప్రయత్నించిందని డాక్టర్ పొరబడ్డారు.
ఎందుకు ఇలా చేసావు అని నేను తనను గద్దిస్తే తనకు చాలా రోజుల నుండి నిద్ర రావట్లేదని, అందుకే నిద్రమాత్రలకు అలవాటు పడ్డాను అని చెప్పింది.
డాక్టర్ ఇది చాలా సీరియస్ విషయం, ఇంకోసారి ఇటువంటివి జరిగితే పోలీస్ కి రిపోర్ట్ చేస్తానని చెప్పాడు.
తనని ఇంటికి తీసుకొని వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ సుసీ అని అడిగితే, "నా జీవితమంతా మీకు దారపోసాను, నా కంటూ ఒక కెరీర్ నిర్మించుకోదు" ఇక బ్రతకడమెందుకంటూ ఏడుస్తూ.... ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నది.
సుసీ "నేను ఒంటరినై పోయాను" అని ఏడుస్తుంది.
తనలో సంతోషం చూసి చాలా రోజులైంది రా, ఎప్పుడు విచారంగా, దిగులుతో ఉంటుంది.
నాకు ఆఫీస్ లో పని ఒత్తిడి వలన తనని పట్టించుకోవట్లేదని అనుకోవడానికి కూడా లేదు. రాత్రి ఎనిమిది అవ్వగానే ఇంటికి చేరుతున్నాను.
అయినా "తను రోజూ నాతో గొడవ పడుతూనే ఉంటుంది. మతి బ్రమించినదానిలా ప్రవర్తిస్తుంది. చాలా డిస్టర్బ్ అవుతున్నాను రా", అంటూ కండ్ల నీళ్లు పెట్టాడు.

ప్రభు, కొంచంసేపు దీర్ఘంగా ఆలోచించి, "ఇప్పుడు మీ ఆవిడకు ఎంత రా వయస్సు" అన్నాడు.

"తనకు నలబై దాటింది రా " అన్నాడు వాడు.

వెంటనే, ప్రభు చిరునవ్వుతో, " మిడిల్ ఏజ్ లేడీస్ అందరూ ఫేస్ చేసే ఇబ్బంది ఇది అంటూ దీన్ని మెనోపాజ్ అంటారు.
ఈ దశలో వారిలో ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం, ఇంకా కొన్ని రకాల హార్మోన్ల మార్పుల వల్ల వారిలో విపరీతమైన భయాందోళనలు ఏర్పడతాయి.
చాలామంది లేడీస్ విపరీతమైన నిస్సత్తువతో, దిగులుతో, నిద్ర రాక క్రుంగి కృశించి పోతుంటారు....
"వారు మానసికంగా కుంగిపోయి, ఎటువంటి వాంచలు లేక విపరీతమైన చింతతో ఉంటారు".
"మరికొంతమంది పిచ్చివాళ్ళలా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు". విపరీతమైన తలపోటు తో భర్తతో ఎడమొఖం పెడమొఖం గా ఉంటారు....
"ఇటువంటి సమయంలో నీవు తనని ఇంకా ప్రేమగా చూసుకోవాలి. తనతో ఎక్కువ సమయం గడపాలి".
"కుటుంబం అంటే అది దేవుడు మనకు ఈ భూమి మీద సృష్టించిన స్వర్గం రా".
"తన కన్నీళ్ళు తుడిచి, తన ఒంటరితనాన్ని నీవే పోగొట్టాలి. ముందు తనకు మానసికంగా దగ్గరవ్వు" అన్నాడు.

ఆ మాటలు వినగానే మా స్నేహితుని మొహంలో చిరునవ్వు ఉదయించింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు