కోతికి సోకిన మాయరోగం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kotiki sokina mayarogam

తనను గతంలో అవమానపరిచిన నక్కా,తోడేలును తగినవిధంగా బుధ్ధిచెప్పాలని ఎదురుచూస్తున్న కోతికి ,రెండు రోజుల తరువాత తన శత్రువులైన నక్కా , తోడేలు కబుర్లు చెప్పుకుంటూ రావడం చూసిన కోతి 'అన్నలు ఎక్కడకో బయలు దేరారు 'అన్నాడు. ఇంకేముంది ఆహరం కొరకు జంటగా వెదుకుతున్నాం ఉదయంనుండి ఏమిదొరకలేదు 'అన్నది నక్క. ' అలాగా మీఇద్దరు పొట్టలు నిండే పీతలు ఇక్కడ చెరువు గట్టున పుష్కలంగా ఉన్నాయి. మీకు కావంలంటే దారిచూపించడానికి నేనూ వస్తాను ' అన్నది కోతి. ' పీతలే గట్టునే తిరుగుతున్నాయా అయితె పద 'అన్నాడు తోడేలు .తనపధకం ఫలించినందుకు సంతోషంగా నక్కా,తోడేలును తీసుకుని నేరుగా సింహరాజు గుహముందర నడవసాగింది.

ఈ ముగ్గురుని చూసిన సింహరాజు తనకు నమస్కరించలేదనే కోపంతో 'ఏయ్ నక్కా నేను ఎలా ఉన్నాను ఠక్కున చెప్పు 'అన్నాడు .

తుమ్ముతూ కసుక్కున నక్కతోక కొరికాడు కోతి. 'అబ్బా'అన్ననక్క' ప్రభువులముఖం పున్నమిచంద్రుడిలా వెలిగిపోతుంది,తమశరీరంనుండి సుగంధ పరిమళాల వాసన గుభాళిస్తుంది 'అన్నడు వినయంగా . ' ఏమిటి కళ్ళనిండా పుసులు కట్టిఉన్న నాముఖం చంద్రబింబమా,నాలుగు నెలలుగా నీటిలోదిగని నాశరీరం జోరీగలతో ఉంటే నానుండి నీకు పరిమాళాల వాసన వేస్తుందా ' అని రెండు తగిలించి తోకపట్టి గిరగితిప్పి బలంగా తూర్పు దిశకు విసిరివేసి ' ఏమోయ్ తోడేలు నువ్వయినా నాముఖం ఎలాఉందో సరిగ్గా చెప్పు ' అన్నాడు సింహరాజు. కోతి తుమ్ముతూ కసుక్కు కొరికాడు తోడేలు తోక, ' అబ్బా' అన్నది తోడేలు. నక్క గతి ఏమైయిందో తనకు తెలుసు కనుక దానికి వ్యతిరేకంగా చెప్పి తప్పించుకుందామనుకున్న తోడేలు 'ఛీ ఛీ తమరి ముఖం పరమ అసహ్యంగాఉంది తమరి శరీరంనుండి వచ్చె దుర్వాసనకు వాంతి వచ్చేలా ఉంది ' అన్నది. 'ఆహ అడవికి రాజును నన్ను అన్నిమాటలంటావా 'అని రెండు తగిలించి తోకపట్టుకుని గిరగిరాతిప్పి బలంగా పడమర దిశకు విసిరివేసిన సింహరాజు ,'ఏయ్ కోతి నువ్వయినా సరిగ్గా చెప్పు లేకుంటే వాళ్ళకు పట్టిన గతే నీకు పడుతుంది అయినా వాళ్ళ తోకలు ఎందుకు అంత కసిగా కొరికావు 'అన్నాడు .

' ప్రభు వారంక్రితం గూడెంలో మూడురోజులు జరిగిన తిరునాళ్ళలో కొబ్బరి చిప్పలకొరకు మనుషులతో కలిసి తిరిగినప్పుడు నన్ను పిచ్చికుక్క జనంతోపాటు కరచింది.అప్పటినుండి ఎవరి తోక కనిపించినా నాకు కరవాలనిపిస్తుంది. పైగా జలుబు ,జ్వరం,తుమ్ములు, గొంతునోప్పిగా ఉంటుంది బహుసా నాకు రాబీస్ తోపాటు, కరోనా సోకిందని అనుమానం దగ్గరగా రాలేను తమరి ముఖాన్ని చూడలేను తప్పదు రమ్మంటే వస్తా ' అంటూ ' హఛ్ ' అంటూ రెండుసార్లు తుమ్మాడు కోతి.

కోతి మాటలు, తుమ్ములు విన్న సింహరాజు అదిరిపడి తనతొక కోతికి అందకుండా తన కాళ్ళమధ్య దాచి పెట్టుకుంటూ,ఒకచేతిని మూతికి అడ్డంపెట్టుకుని మూడుకాళ్ళతో గుహలోనికి పరుగుతీసాడు. సింహరాజు పరుగు చూసిన కోతి ఎంతటి అపాయమైనా యుక్తితో తప్పించుకోవచ్చు మాయదారి రోగంతో తను సింహరాజునే భయపెట్టానని నవ్వుకుంటూ బయలుదేరింది.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.