కలల సౌధాలు!!! - hemavathi bobbu

Kalala soudhalu

అతను ..... నాతో అంటున్న మాటలు వినలేక రెండు చెవులు చిల్లులు పడుతున్నాయి నాకు.

ఎన్నెన్ని కలలు కన్నాను నేను , నా వాడు నా కలల రాకుమారుడు నేనే ప్రాణమంటూ నన్ను ఏలుకొంటాడని....
నా కలల సౌధాలన్నీ పేకమెడల్లా కూలిపోతున్నాయి.
కాదు కాదు నేనే.....దానికి కారణం.
నా ఉద్యోగప్రయత్నాలని చూసి నాన్న ముందు పెళ్ళి చేసుకో అమ్మా...
చాలా మంచి సంబంధం...
ఆ అబ్బాయి నిన్ను మీ అక్క పెళ్ళిలో చూసినప్పటి నుండి మాటలు జరుగుతున్నాయి....
అంటుంటే పల్లెటూరి చాధస్తాలని వాళ్ళని లెక్కచేయక ఉద్యొగంలో చేరా....
ఆ రోజు మొదటి జీతం తీసుకొన్న రోజు ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు సంతోషంతో ఉప్పొంగా.
నా వర్క్ నేచుర్ చూసి ఆరు నెలలైనా కాలేదు....
కాని ఈ అమ్మాయి ప్రొగ్రామ్మింగ్ అద్బుతం... అంటూ
తన సత్తా చాటింది.......
అని పొగుడుతూ నన్ను విదేశాలలోని మా బ్రాంచ్ కి రెకమ్మండ్ చేసినప్పుడు...
సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవ్వుతూ....
మా స్టాఫ్ పార్టీ ఇవ్వమంటుంటే అందరి తో కలసి డిస్కో కి వెళ్ళా....
అతిగా మద్యం తాగి అలవాటులేని తప్పు తో అదుపుతప్పిన నన్ను 'అతను" నా ఫ్లాట్ కి చేర్చినప్పుడు ఎంతో మర్యాదస్తుడు అని తలచా.
'అతను', నేను మరో ఇద్దరితో కలిసి విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు అతని కేర్ టేకింగ్ కి ముగ్డురాలయ్యా.
కంపనిలో 'అతని' సలహాలతో నేను ముందడుగు వేస్తున్నప్పుడు 'అతను' నన్ను మరింత గా పొగుడుతూ ఉంటే మంచి స్నేహితుడు దొరికాడని తలచా....
వీకెండ్ పార్టీ లో 'అతని తో' చనువు పెరిగి 'అతను' నా హృదయానికే కాక నాకు దగ్గరైనప్పుడు.......... 'అతనే' నా సర్వస్వం అనుకున్నా.
నయాగర జల్లులతో మా నవ్వులు కలిసి 'అతని' తోనే నా సంతోషం అనుకున్నా.
'ఆతను' లేని జీవితం నాకు నరకమనుకొన్నా.
'అతను' నన్ను వేగిరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి రమ్మనప్పుడు నా గుండే ఆగిపోతుందని తలచా.
అచ్చమైన ఆంధ్ర అమ్మాయిలా పసుపు పచ్చని కంచి పట్టు చీర కట్టి గుడి కొచ్చిన నన్ను చూసి 'అతను' నవ్వుతూ ...
తన పక్కన ఉన్న అమ్మాయి తో "నీకు చెప్పిన పల్లెటూరి చామంతి ఈవిడే" అంటుంటే...
జీన్స్ లో ఉన్న ఆ అమ్మాయి నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ....
మీ ఇరువురు నయాగరా లో దిగిన ఫోటోలు చూశాను...!!!
మీరు చాలా రొమాంటిక్ అని మా ఆయన ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు.....అన్నది....!!!!
'అతను' నాతో ఈవిడ నా భార్య, ఇదిగో వీడు నా కొడుకు అంటూ తన చేతిలోని బాబుని తీసుకొన్నాడు....
ఆవిడ రండి దేవుడి దర్శనానికి అంటూ ముందు నడుస్తుంటే అతను ఆవిడ వెనకాలే.....
అతన్ని ఆ రోజు నిలదీసాను ......... నువ్వు నన్ను ప్రేమించలేదా అంటూ
అతను నవ్వుతూ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు నీవు.
ఇప్పుడు ప్రపంచమంతా చాలా ఫాస్ట్ గా ఉంది.
నీవు కూడా ఫాస్ట్ గర్ల్ అనుకొన్నా అంటూ ....."లైట్ తీసుకో" అంటూ తన కాబిన్ లోకి దూరాడు.
"నేను అక్కడ ఇమడలేనని ఎంతైనా నేను పల్లెటూరి చామంతి ని ఎంత పై చదువులు చదివినా" అని అనుకుంటూ.....!!!!
నాన్న కి ఫోన్ చేసా.... పెళ్ళికి అంగీకరించడానికి నాకు కాస్త సమయం కావాలని...
వచ్చే వారం మన దేశానికి వస్తున్నానని చెప్పా.....

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.