సదానందుని గొప్ప సలహ - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sadaananduni goppa salahaa

అవంతి రాజ్యాన్ని జయసింహ అనేరాజు పరిపాలిస్తు ఉండేవాడు. ఒకరోజు తనమంత్రితోకలసి రాజధాని శివారు ప్రాంతంలోని సదానందుని ఆశ్రమంచేరి "గురుదేవులకు ప్రణామాలు,నేను త్వరలో భువనగిరి రాజ్యంపై దాడిచేయబోతున్నాను నాకు విజయం వరించేలా ఆశీర్వదించండి గురుదేవా "అన్నాడు.

" మహరాజా యుధ్ధం జరిగితే ఇరువైపులా అపారప్రాణ,ధన నష్టం,అకారణంగా వారిపై యుధ్ధంఎందుకు? "అన్నాడు సదానందుడు. "గురుదేవ వారివద్ద అపారధనరాసులు ఉన్నాయి వాటిని తెచ్చి నాదేశం అభివృధ్ధిచేస్తాను నాప్రజలు కష్టపడకుండా చేస్తాను "అన్నాడు జయసింహుడు. "నాయనా దేశాన్ని అభివృధ్ధిచేయడం మంచిదే ఆపేరున ప్రజలను సోమరులను చేయడం మనకేప్రమాదం.శ్రమలోనే స్వర్ణం దాగిఉంది.అంతగా నీకు ధనం కావాలంటే మీతండ్రిగారు కరువు,కాటకాలు ఎదుర్కోనేందుకు దాచిన రహస్య అపార నిధి మీ ఉద్యానవనం లోని పనసచెట్టుమొదట్లో దాచి ఉంచారు అది తీసుకుని నీదేశఅభివృధ్ధికి ఆలోచించి పొదుపుగా వాడుకో,యుధ్ధం మాత్రం తగదు "అన్నాడు సదానందుడు.

"అలాగే గురుదేవ యుధ్ధప్రయత్నం విరమిస్తాను, నాకులభించే అపారనిధితో నాదేశంఅభివృధ్ధిచేస్తాను సెలవు "అనినమస్కరించి వెళ్ళాడు జయసింహుడు.

మరదినం "ఇందుమూలంగా తెలియజేయడమేమనగా వచ్చే పౌర్ణరోజు నుండి ప్రజలకు పలు ఉచిత పధకాలద్వారా ధనసహయంతోపాటు, రాజ్యంలోని ప్రజలందరు మీప్రాంతాలలో రాజుగారు ఏర్పాటుచేయించిన భోజనశాలలో మూడుపూటల ఉచితంగా భోజనం చేయవలసిందిగా తెలియజెయడమైనదహో "అంటూ రాజ్యం అంతటా దండోరావేసారు.

ప్రజలంతా రాజుగారు ఏర్పాటు చేసిన భోజనశాలలో మూడుపూటల తిని రాజుగారిని పొగుడుతూ వెళ్ళసాగారు. కొద్ది రోజుల అనంతరం రాజుగారి భోజనంలో నేయి లేకుండాపోయింది. "ప్రభువులు మన్నించాలి మనరాజ్యంలో పాడి చేసేవారులేరు ఆకారణంగా నేయి అందుబాటులో లేదు పొరుగురాజ్యంనుండి నెయి తేవడానికివెళ్ళినువారు ఇంకారాలేదు" అన్నారు భోజనం వడ్డించేవారు.

మరుదినం మారు వేషంలో రాజధాని పర్యటనకు మంత్రితోకలసి బయలుదేరాడు. రాజ్యంలో ఎక్కడ చూసిన మగవారు పెరిగిన గడ్డాలతో,ఆందరు నూనె లేని తలలతో, అందరికి పని లేకపోవడంతో పొట్టలు బానల్లా తయారయ్యాయి. చింపిరి తలలతోపిల్లలు పాఠశాలకు వెళ్ళకుండా ఆడుకుంటూ కనిపించారు. రచ్చబండపై కూర్చునిఉన్నవారివద్దకు వెళ్ళిన రాజు " అన్నా మీరంతా ఇలా గడ్డాలు పెంచారే ఏదేవుడుకైనా ఊరంతా మోక్కుకున్నారా? "అన్నాడు. "లేదు అబ్బి మాతిక్కలరాజు ప్రజలను సుఖపెడదామని అందరిని ఇలా సోమరులుగా తయారు చేసాడు. ఆహరం ఉచితంగా లభించడంతో అందరు పనులు చెయడం మానుకున్నారు.ఆందరికి తలకి నూనె కావాలంటే గానుగ ఆడాలిగా,పసువులకు మేతకావాలంటే వ్యవసాయం చేయాలిగా, బట్టలునేసేవారులేరు,గడ్డంగీసేవారులేరు ,అసలు వృత్తులు మానేసారు ప్రజలు.మారాజుగారి ఉచిత నిర్ణయంతో మాఅందిని సోమరులనుచేసాడు. ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే వారు కోరుకున్నవృత్తిలో వారికి నైపుణ్యంతోపాటు ఆర్ధికసహాకారం అందించాలి పన్నులు తగ్గించాలి, రవాణా,విద్యా,వైద్యం,నీటిపారుదల తదితర ృరంగాలు మెరుగు పరచాలి. ప్రజలుఏంకోరుకుంటున్నారో వారికి తక్కువ ధరలలో అందించాలి అప్పుడే ఆరాజ్యం అభివృధ్ధిచెందుతుంది.అనవసరమైన వాటిపైన ధనం కర్చుచేసి ప్రజలను సోమరులను తయారుచేయడమే అవుతుంది.ఇప్పిటికే పొరుగు రాజ్యాల ప్రజలు మారాజుగారి చట్టాలకు నవ్వుకుంటున్నారు "అన్నాడు.

సదానందుని సలహ తనుపాటించకుండా ఈనిర్ణయం తీసుకున్నందుకు,తనచర్యలవలన ప్రజలకు మేలు జరగడంకన్నా కీడే ఎక్కువజరిగిందని గ్రహించాడు రాజు.వెంటనే అన్నిఉచితపదకాలు రద్దు చేసి యధావిధిగా పాతచట్టాలనే అమలు పరిచాడు. క్రమంగా ప్రజలు తమతమ వృత్తులు చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు .

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు