సదానందుడు తనకు వయసుపైబడటంతో శేషజీవితం ప్రశాంతంగా కాశీలో గడపదలచి, తన ఆశ్రమ నిర్వాహణకు సముచితమైన నలుగురు శిష్యుని ఎంపికచేసుని '' నాయలారా మీరు ఈరోజు మీరు నలుదిక్కులు విడివిడిగా వెళ్ళండి అక్కడ మీకు కనిపించిన రాజ్యంలో మీరు నెలరోజులు గడిపి అక్కడి మీఅనుభవాలను, మాసంతరువాత పౌర్ణమిరోజున ఆశ్రమానికి వచ్చి నాకుతెలియజేయండి ,నాకు ఎవరు చెప్పినది సముచితమైన సమాధానం అనిపిస్తే వారికి మనఆశ్రమ నిర్వాహణ బాధ్యలు వారికి అప్పగిస్తాను ''అన్నాడు.
గురువు నమస్కరించిన నలుగురు శిష్యులు నాలుగు దిక్కులకు బయలుదేరివెళ్ళారు. మాసంరోజుల అనంతరం పౌర్ణమి రోజున నలుగురు ఆశ్రమం చేరి సదానందునికి నమస్కరించారు. "నాయన మీఅనుభవాలు తెలియజేయండి,ముందుగా ఉత్తర దిశకువెళ్ళిన శిష్యుని అనుభవాన్ని చెప్పమన్నాడు ."గురుదేవ నేను కుంతలరాజ్యం వెళ్ళాను,అక్కడి ప్రజలు గొప్పకాళారాధకులు ,ఎక్కడచూసినా రాజ్యం అంతటా సమస్తకళలు విరాజిల్లుతున్నాయి,నేను భిక్షాటన చేస్తునే నెలరోజు ఆరాజ్యంలోగడిపాను " అన్నాడు. " గురుదేవ నేను పడమర దిశ అవంతి రాజ్యానికి వెళ్ళాను అక్కడ ప్రజలు రాజభోగాలు అనుభవిస్తున్నారు వారిజీవితం నాకు ఆనందం కలిగించింది ,నేను అక్కడ భిక్షాటన తోనే నెలరోజులు జీవించాను "అన్నాడు. "గురుదేవా నేను పడమరదిశగా వెళ్ళాను అక్కడ చొళరాజ్యంఉంది అక్కడి ప్రజలు మహవీరులు వాళ్ళంతా పలురకాలయుధ్ధాలలో ఆరి తేరినవాళ్ళు ,నేను ఈనెరోజులు అక్కడ ఆహారం యాచన చేస్తు జీవించాను " అన్నాడు . "గురుదెవా నేను తూర్పు దిశగా వెళ్ళాను అక్కడ చంద్రగిరి రాజధాని నగరశివార్లలోని అడవిలో ఒక వృధ్ధుడు ఎండుకట్టెలుకొడుతూ కనిపించాడు అతన్ని విశ్రింతి తీసుకోమని నేను కట్టెలు కొట్టాను ఇద్దరం కట్టెలు అమ్మి వచ్చినధనంతో నిత్యావసర సరుకులు తీసుకుని ఆవృధ్ధుని యింటికి వెళ్ళిము వారితో పాటు నేను అక్కడే ఆహారం స్వీకరించాను,ఈనెలరోజులు నెను వృధ్ధునికి విశ్రాంతి కలిగించి రోజు నేను కట్టెలు కొట్టి అమ్మి వారికుటుంబానిపోషించాను. ఆరాజ్యంలో నిరాక్షస్యత చాలా ఎక్కువగాఉంది వారికి విద్యవిలువ తెలియలేదు " అన్నాడు.
" నాయనలారా కళలు, రాజభోగాలు,వీరత్వం, వీటిపట్ల మనిషికి ఆదరణ ఉండవలసిందే, ఇవన్ని పొందాలంటే ముందుగా విద్య అభ్యసించాలి దాని ద్వారా ఉన్నతపదవులు పొందాలి అలా తనుగొప్పగా జీవిస్తు సాటివారికి సహాయపడాలి. మనిషికి కష్టపడే మనస్తత్వంఉండాలి అది లేకుంటే సోమరితనం అలువడుతుంది. తూర్పుదిశకువెళ్ళిన గురునాథం అక్కడి ప్రజల జీవనవిథానం అధ్యాయనం చేసాడు వారికి విద్యఎంత అవసరమో గుర్తిచాడు,తను సాటివారికి సహాయపడుతూ వారితోకలసి ఆహారం తీసుకున్నాడు,మీరు అలా మీఆహారం సంపాదించుకోలేకపోయారు. మనం ఎప్పుడు ఇతరులపై ఆధారపడకూడదు,వయసులో ఉన్న మీరు కష్టపడాలి సంపాదించి నలుగురిని పోషించాలి మనకు ఉన్నంతలో ఇతరులను ఏరూపంలోనైనా సహియంచేయాలి,ఈవిషయంలో నన్ను త్రుప్తి పరిచి అర్హత పొందిన గురునాథానికి నాఆశ్రమ బాధ్యలు నేడే అప్పగిస్తున్నాను "అన్నాడు సదానందుడు .