'ఓహో ఓహోబి ఓహోం' పల్లకిమోసే బోయల్లా, వెదురు గడకు కోతిని వేళ్ళాడదీసి మోసుకు వచ్చి వైద్యుడు అయిన నక్కవద్ద ధబీమని నేలపై పడవేసారు ఎలుగుబంట్లు.
' ఏంజరిగింది పందిని పొద్దున్నే తీసుకువచ్చారు ' అన్నాడు.నక్క వైద్యుడు. ' ఏమిటి నేను నీకు పందిలా కనపడుతున్నానా ' ?అన్నాడు కోపంగా కోతి.
' ఓహో తమ్ముడూ నువ్వా ఎలుగుబంటి అన్నలు నిన్ను పందిలా వెదురు గడకు వేళ్ళడదీసుకువస్తే పెద్దవాణ్ణి కళ్ళు సరిగ్గా కనిపించక అలా అనుకున్నాను ఏమిటి విషయం ' అన్నాడు నక్కయ్య. ' ఏం తిని చచ్చాడో చెట్టు పైనుండి ఒకటే శబ్ధాలు, ఆప్రాంతమంతా వీడువదిలిన గాలికి దుర్వాసన భరించలేక మేమంతా అల్లాడిపోయాం గబ్బు వెధవ. రాత్రినుండి ఒకటే మూలుగుడు ,ఆపొట్టచూడు చెత్తతొట్టిలా ఎంతబిర్రుగాఉందో 'అన్నాడు ఎలుగుబంటి.
' తమ్ముడు ఏమిటి నీబాధ ' అన్నాడు నక్క. ' నిన్న గూడెంలో పెండ్లికి వెళ్ళా అక్కడ గారెలు,బూరెలు,లడ్లు,వడ,పాయసాలు కనిపించాయి. పొట్టపట్టినవరకు తిని దొంగతనంగా వస్తు ఓపది లడ్లు చేతిసంచిలో వేసుకుని వచ్చి, నాచెట్టు కొమ్మకు తగిలించుకుని రాత్రి మెలకువ వచ్చిన ప్రతిసారి ఒక లడ్డు తినసాగాను పొట్టకొద్దిగా బరువెక్కడంతో అప్పుడప్పుడు కొద్దిగా నాతోక దిగువనుండి గాలా పోతుంది.అంతే మరేంలేదు. రాత్రినుండి విపరీతమైన కడుపునోప్పి సొంతవైద్యం చేసుకున్నా తగ్గలేదు. ' అన్నాడు కోతి. కోతిని పరిక్షించిన నక్కవైద్యుడు ' సొంతవైద్యం ప్రాణాంతకం 'అని చేతిలోని కషాయం కొబ్బరిచిప్పలో పోసి అందిస్తు' భయపడక ఈకషాయం తాగు కొద్దిసేపట్లో తగ్గిపోతుందిలే ' అన్నాడు. అంతబాధలోనూ కోతి కిచకిచ మంటూ పెద్దగా నవ్వసాగాడు. కోతి ఎందుకు నవ్వుతుందో అక్కడ ఉన్నవారికి ఎవరికి అర్ధంకాలేదు. పడిపడి నవ్విన కోతిబావ ' నక్కన్నా ఈకషాయం పట్టే ఖాళి నాపొట్టలో ఉంటే,చెట్టుకొమ్మకు తగిలించిన చేతిసంచిలోని మరో రెండ్లు తినేవాడిని ' అన్నాడు నింపాదిగా. అదివిని పట్టరాని కోపంతో కోతి తోక ఎత్తిపట్టి బలంకొద్ది తన్నాడు ఎలుగుబంటి.గాలిలో తేలుతూ పొదల మాటుకు వెళ్ళిపడిన కొతి అనంతరం నింపాదిగా నడుచుకుంటూ వచ్చాడు. 'నక్క సైగ చేయడంతో కోతి కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకున్నారు ఎలుగుబంట్లు. కొబ్బరి చిప్పలోని కషాయం కోతి నోట్లోపోసి ముక్కుమూసాడు నక్క.ఊపిరి ఆడని కోతి కషాయాన్ని గుటుక్కున మింగాడు.
' అందరు బ్రతకడానికి తింటుంటే నువ్వేంటి తమ్ముడు తిండికోసమే బ్రతుకుతున్నావే! అదీ దొంగతనంతో.సిగ్గుగాలేదునీకు. మనం మన అవసరాలకు ఎలాదాచుకుంటామో ఎదటివారుకూడా వాళ్ళ అవసరాలకు అలాగే దాచుకుంటారు. దొంగతనంతో ఎవరూ గొప్పవాళ్ళుకాలేరు.ఇదిగో ఇలాంటి తిప్పలేవస్తాయి. మరెన్నడు దొంగతనం వంటి తప్పుడు పనులు చేయక ,అలాగే సొంతవైద్యం చేసుకోకూడదు అది ప్రమాదం ' అన్నాడు నక్కవైద్యుడు.బుధ్ధిగా తల ఊపాడు కొతి. ' సాయంత్రం దాకా చెట్టువద్దకు వచ్చావంటే చచ్చావే ' అన్నారు ఎలుగు బంటి మరోతన్నుతన్నాడు . బుధ్ధిగా తలఊపుతూ 'అన్నా చెట్టుపైన నాలడ్లు సంచి జాగ్రత్తా రాత్రికి అదే నాఆహరం అన్నాడు.కోతి.
'ఈజన్మకి ఈడు మారడు 'అన్నది పిల్లరామచిలుక .