పేరు లోనే వున్నది పెన్నిధి - సి హెచ్. వి. యస్. యస్. పుల్లం రాజు

Perulone vunnadi pennidhi

"రాజూ!" "ఆ ఏమిటమ్మా , ఎందుకు చెప్పు?"అన్నాడు కొడుకు. "అత్తయ్యా! నన్ను పిలిచావా?" అడిగాడు మేనల్లుడు.(అన్న గారి కొడుకు) ఇద్దరి పేర్లు రాజు కావడం, ఇద్దరూ ఒకే ఇంట్లోవుండడంతో ఆ చిక్కు ముడి గట్టిగా బిగిసింది. ఆ మేనత్త గారి భర్త, చతురుడు, ఈ ముడిని సునాయసంగా లాగేశాడు. పనిలో పనిగా తన భార్య మీద సున్నితమైన వ్యంగాస్త్రాన్ని సంధించాడు. " మీరు కంగారు పడకండి. ఒరేయ్ నాన్నా, రాజూ! అని పిలిస్తే నువ్వు స్పందించు" అన్నాడు మేనల్లుడితో నవ్వుతూ. "మరి… నాన్నా! నేను ఎప్పుడు?". వెంటనే ప్రశ్నార్థకంగా అడిగాడు ఆయన కొడుకు . సమాధానంగా చిరునవ్వు నవ్వి, "ఇంకా అర్థం కాలేదురా! ఒరేయ్ వెధవ రాజూ! అని మీ అమ్మ పిలిచిందంటే నువ్వురా నాయనా!" అన్నాడాయన. " హా…ఎంత మాట! ఎంత మాట" అన్నారు అక్కడ వింటున్న వాళ్ళు ముక్కు మీద వేలేసుకొని. మరోసారి నవ్వి," మేనల్లుడికి తన తండ్రి పేరు కాబట్టి నాన్నా రాజూ , కొడుకుకి మావ గారి పేరు కాబట్టి…"అంటూ భార్య మనసులోని గుట్టు విప్పాడు. . 🍁🍁🍁

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న