*నా కూతురితో ఉదయపు నడక* ఉదయపు నడకకు వెళ్లేప్పుడు నా కూతురు లలిత రోజూ మారాం చేసేది నాన్న నేను కూడా వస్తాను , ఎందుకురా నాన్న అంటే ,బుంగ మూతి పెట్టి.....అబ్బా నాన్న....నేను కూడా వస్తా ప్లీజ్..... అని అంటే......నేను నవ్వి ఊరుకొని.....తీసుకెళ్తారా....ఈ ఆదివారం తప్పకుండా తీసుకువెళ్తా , కానీ నువ్వు నాతో పాటు మాస్క్ పెట్టుకోవాలి (కరోనా కాలం మరి) , బూట్లు వేసుకోవాలి అని చెప్పాను..... లలిత సరే అన్నది.....ఇంకా ఎంతో సంతోషపడింది......ఇలా....ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంది...... ఆదివారం రానే వచ్చేసింది, ఎప్పుడూ తెల్లవారు ఝామున 8 గంటలకి నిద్ర లేచే నా కూతురు , 6 గంటలకే రెడీ గా ఉంది.....నాతో ఉదయపు నడక కోసం...... స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను తన కాళ్ళకి బూట్లు తొడిగే వాడిని ఇప్పుడు నా అవసరం లేకుండానే తనే.....తన చిన్న చిన్న కాళ్ళకి స్పోర్ట్స్ షూస్ వేసుకొని, నేను చెప్పకుండానే తన మొహానికి మాస్క్ వేసుకొని..... ముద్దు ముద్దుగా నాన్నా పద....వెళదాం అని అన్నది.......నాకు చాలా సంతోషంగా అనిపించింది......నిజంగా మనకిష్టమైన పని చేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరు ఉన్నా లేకపోయినా మనం మన పనుల్ని చేసుకుంటామ్...... అంతే కదా.... నా చిన్నారి చిట్టి లలితకి ఈ రోజు పండగ ....నాతో పాటు ఉదయపు నడకకి వస్తుంది అని....... నేను కూడా మాస్క్ పెట్టుకొని , బూట్లు వేసుకొని రెడీ అయిపోయి.....నేను , లలిత మార్నింగ్ వాక్ కి బయలుదేరాం..... అలా కొద్దీ దూరం నడిచినా లేదో....పక్కన మూడు కుక్కలున్నాయి......నేను రోజూ వాటిని చూస్తూ వెళతాను.....కానీ ఎలాంటి ఆలోచన లేకుండా నా పని చేసుకుంటూ....ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి రాజకీయ సామాజిక విశ్లేషణలు, ఇళయరాజా వంశీ గారి పాటలు వింటూ వెళ్లే వాడిని..... కానీ ఈ రోజు నా కూతురు నాతో రావడం వళ్ల నేను వాళ్ల విశ్లేషనని , ఇంకా పాటలని వినలేకపోయాను......అంతలో నా కూతురు.....నాన్నా doggies ఉన్నాయి కదా వాటికి మనం ఏదైనా చేయాలి అని చెప్పింది , ఏం చేయాలి నాన్న అంటే....నాన్న నాన్న పాపం వాటికి ఇల్లు లేదు , వేసుకోవడానికి డ్రెస్ లేదు.....చూడు పాపం మాస్క్ కూడా లేదు....వీటిని కరోనా వస్తే....పాపం...చూడు ఎలా సన్నగా ఉందొ......ఎవరూ ఏమీ పెట్టడం లేదేమో....పాపం.... నాన్న మనం వీటికి ఏదైనా తినిపిద్దాం నాన్న అని చెప్పింది...... నేను సరే అన్నాను......పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి 50 రూపాయల పార్లే జీ.....biscuit ప్యాకెట్స్ కొని లలితకి ఇచ్చాను...తను ఒక్కో biscut తీసి ఆ కుక్కలకి వేసింది.....పాపం ఎన్ని రోజులైందో....ఆ కుక్కలు ఆవురావురమంటూ....ఆ biscuits తిన్నాయి........నా కూతురు లలిత ఆ కుక్కలకి biscuit వేస్తుంటే....నాకు చాలా గర్వంగా అనిపించింది....మనిషిని మనిషిగా చూడని ఈ కాలం లో....కుక్కల గురించి ....ఇంతగా ఆలోచించిన నా ఆరేళ్ళ లలితని చూసి నాకు గర్వంగా అనిపించింది....ఆ biscuits అన్ని అయిపోయిన తర్వాత తను నాతో చెప్పింది.... నాన్న sharing is caring అని......నా కళ్లల్లో నీళ్ళు తిరిగాయి....నా మనసులో అనుకున్నాను....ఇలాగే ఎల్లప్పుడూ ఇంకొకరి గురించి ఆలోచిస్తే....అది ఏ ప్రాణి అయినా కానీ వాళ్ళు మన గురించి తిరిగి ఆలోచిస్తారు అని.....అంతలోనే ఆ కుక్కలు మా వెనక రావడం చూసి అది నిజమే అని అర్థం అయ్యింది......ఇలా మనుషులు కూడా కుక్కల్లాగా తిరిగి ఆలోచిస్తే....ఈ ప్రపంచమంతా బావుంటుంది కదా..... అని అనిపించింది......ఈ ఆలోచనలతో నేను నా కూతురు లలిత మార్నింగ్ వాక్ అదే....ఉదయపు నడకను ముగించి....ఇంటికి వచ్చేసాం...... *