తనబొరియలో చలిగాలి తగలకుండా వెచ్చగా నిద్రపోతున్నా నక్కను ఎవరో పిలవడంతో బొరియవెలుపలకు వచ్చాడు. ఎదురుగా కొతి,కుందేలు కనిపించాయి. " హచ్ ,హచ్ " మంటూ బలంగా తుమ్మిడు కోతి ."ఏమిటి పొద్దున్నే మామా అల్లుళ్ళు ఇలావచ్చారు " అన్నాడు నక్క .
"రాత్రి అడవి దగ్గరలోని బస్తిలో ఎవరితో పెళ్ళిఅట ,అక్కడకు వెళ్ళిన అల్లుడు కోతి పిల్లల చేతుల్లోని ఐస్ క్రీములు తిన్నాడట తెల్లవారకముందే,జలుబు,జ్వరంతో తుమ్ములు రావడం మొదలు పెట్టాయి " అన్నాడు కుందేలు."ఏం ఒక్కసారి అన్నిఐస్ క్రీంములు తినకపోతే " అన్నాడు నక్క. "హచ్" మంటూ తుమ్మి ముక్కు తుడుచుకూంటూ ,రెండుసార్లు దగ్గి "వాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు మనం తినాలి కాని మనం తినాలి అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళి పెళ్ళి చేసుకోరుగా "అన్నాడు కోతి.
ఇంతలో హచ్ హచ్ మంటూ రెండుసార్లు తుమ్మి ,మూడుసార్లు దగ్గాడు కుందేలు .
" ఈతెలివితేటలకేం తక్కువలేదు, మిరియాలు వేడిపాలల్లో వేసుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. గోరువెచ్చనినీళ్ళు తాగుతూ ఉండాలి భయంలేదు , జలుబు అంటు వ్యాధి .తలనొప్పి, జ్వరం అనేవి వ్యాధులుకావు .మనశరీరంలో జరిగేమార్పులు ఆరూపంలో మనల్ని హెచ్చరిస్తాయయి.
సాధారణంగా జ్వరానికి భయపడవలసిన అవసరంలేదు.వైద్యుని చూసే అవకాశం లేకుంటే రోగి నుదుటి పైన తడిగుడ్డ వేసి మారుస్తూ ఉండాలి "అంటూ హచ్ ,హచ్ మంటూ బలంగా తుమ్మాన నక్క..
జలుబు 200 లకు పైగా వైరస్ ల వల్ల రావచ్చు. వీటిలో రైనోవైరస్‌లు అత్యంత సాధారణమైనవి. వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది. జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి , తులసి ఆకులు మిరియాలు కలిపితిను ఉపసమనం కలుగుతుంది.హచ్ "అని
తుమ్మాడు నక్క.
"సరే వెళ్ళావస్తాం "అని రాజు గారి గుహముందు అడవి జంతువులన్నసమావేశంకావడం గమనించి,అక్కడకు వెళ్ళారు కుందేలు,కోతి తుమ్ముకుంటూ దగ్గుకుంటూ.
"వన్యప్రాణులారా అడవిలో మొక్కలు పరిరక్షించండి అవిరేపు చెట్లుగామారి మనసంతతికి చల్లదనాన్ని, ఫలపుష్పలు ఇవ్వడమేకాకుండా వాతావరణ సతుల్యతను కాపాడతాయి. కనుక మనందరం అడవి అభివృధ్ధికి కృషిచేయిలి "అన్నాడు. మరికొద్దిసెపటికి సింహరాజు తోపాటు అక్కడ ఉన్న జంతువులన్ని తుమ్ముతూ దగ్గసాగాయి.
"ఓహో అడవికే జలుబు చెసిందీ ,ఇది మన కోతి పుణ్యమెనా "అన్నాడు సింహరాజు .
సిగ్గుతో మెలికలు తిరిగాడు కోతి.