*సిరిసంపదలు* - కావ్య వేపకొమ్మ

Siri sampadalu

కొమ్మ రాజ్యం లో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు.అతడు తన తల్లితండ్రులకు ఏడుగురు అమ్మాయిల తరవాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు.అందుకని చిన్న అప్పటినుంచి తన తల్లితండ్రులు,అక్కలు అల్లారు ముద్దుగా పెంచారు.రామయ్య పెద్దయి వీళ్ళందరి బాధ్యత చూసుకుంటాడని వాళ్ళ అశ.కానీ వాళ్ళ ఆశలకు తలకిందులుగా తయారయ్యాడు రామయ్య.ప్రేమగా చూసుకున్న కుటుంబంలో ఎవరు పలకరించినా విసుక్కుంటూ ఉండేవాడు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి బాధ్యతలని సంతోషంగా నెరవేర్చాలి అనే తల్లి తండ్రుల మాటలు అసలు నచ్చేవి కావు రామయ్య కు.పేదరికంలో ,చేతినిండా బాధ్యతలలో ఆనందం వేతుక్కోటం ఎంటి? ఏ బాధ్యతలు లేకుండా చేతి నిండా డబ్బుతో హాయిగా వుండక అని ఎలాగైనా ఎక్కువగా సంపాదించి బాధ్యత ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. అలా వుండాలంటే ఇంట్లో వుండకూడదు అనుకొని ఇంట్లో అందరికీ విషయం చెప్పి ఇల్లు వదిలి బయలు దేరాడు.అలా వెళుతూ వెళుతూ ఒక ప్రదేశం లో ఒక చెట్టు కింద విశ్రాంతి కై కూర్చున్నాడు. బాగా ఆకలిగా వుండటంతో ఏదైనా పండ్లు దొరికితే బాగుండు అనుకున్నాడు వెంటనే చెట్టుపైన ఉన్న చిలుక రామయ్య కు ఎదురుగా ఒక చెట్టు తొర్రలో మామిడి పండ్లు ఉన్నాయి తెచ్చుకొని తిని నీ ఆకలి తీర్చుకో అంది.వెంటనే రామయ్య ఆ పండ్లు తెచ్చుకొని మరల చెట్టు కింద కూర్చొని ఆ చిలుకకు తన ఆకలి ఎలా తెలిసిందా అనుకున్నాడు! అదే విషయం పండ్లు తింటూ చిలుకను అడిగాడు. అందుకు ఆ చిలుక నేను ఒకసారి ఈ చెట్టు పైన ఉన్నపుడు ఒక మహర్షి ఇటుగా వచ్చారు వారు ఆకలి మీద వున్నటుగా వున్నారు.నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు నేను కొంచం కొరికిన ఒక పండు తప్ప.ఆ మహర్షి బాగా నీరసించి వుండటంతో అదే ఇచ్చాను.వారు అది తిని సంతృప్తి చెంది అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈ వృక్షం కింద ఎవరు వచ్చి ఆకలిగా వున్న, దాహంగా వున్న వారి ఆకలి,దాహం తీర్చే అదృష్టాన్ని వరంగా ప్రసాదించారు అని చెప్పింది.రామయ్య ఆ చిలుక మాటలకి సంతోషపడి పండ్లు అన్ని తిని తను ఇంట్లో నుంచి వచ్చిన వృత్తాంతాన్ని చిలుకకు విన్నవించాడు.అది విన్న చిలుక రామయ్యతో ఇలా చెప్ప సాగింది.ఇక్కడి నుంచి తూర్పు దిశగా ఒక ఆరు మైళ్ళ దూరంలో ఒక మాయాగృహం ఉంది. దాని పేరు మాయామల్లి. అక్కడికి వెళితే మనకు కావలసింది ఏమిటో అవన్నీ వస్తాయి అని విన్నాను.నీవు కూడా అక్కడికి వెళ్లు అని చెప్పింది. రామయ్య చాలా సంతోషంతో చిలుకకు కృతజ్యత లు తెలిపి తూర్పు దిశగా పయనమయ్యాడు. మాయామల్లి గృహానికి చేరాడు.మాయామల్లి గృహం తలపులు తెరుచుకున్నాయి. అంతా చీకటి గా ఉంది.కొంచం సేపటికి ఏదో కనిపించని ఒక చిన్న వెలుతురు రేణువు రామయ్య మేను ని తాకింది.వెంటనే నీవు ఎవరు? ఎందుకు వచ్చావు ?అనే ప్రశ్న ఆకాశవాణి నుంచి వినిపించింది.రామయ్య మొత్తం విషయాన్ని విశదీకరించాడు.వెంటనే ఆకాశవాణి ఓ రామయ్య !నాకు అర్థమయింది నీకు సిరిసంపదలు కావాలి.బంధాలు,బాధ్యతలు వద్దు నువ్వు ఒక్కడివే సిరిసంపదలను అనందంగా అనుభవించాలని అనుకుంటున్నావు.ఈ మాయామల్లి గృహము నీ కోరికలన్నీ తీర్చడానికి సిద్దంగా ఉంది కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలి అప్పుడే సిరి సంపదలు,భోగభాగ్యాలు,షడ్రుచుల సమ్మేళనంగా విందు వినోదాలు లభ్యమవుతాయి ఈ గృహాన్ని వదిలి బయటకి వెళ్లిన మరుక్షణం అన్నీ మాయమవుతాయి నీవు ఎన్ని రోజులైనా ఇక్కడే వుండచ్చు అనే మాటతో రామయ్య సంతోషంగా జీవితమంతా ఆ మాయామల్లి గృహంలోనే గడపాలని అనుకొని ఆకాశవాణి షరతులకు సరే అన్నాడు వెంటనే చీకటి గా ఉన గృహము కాంతులు విరజిమ్మింది.వజ్రవైడ్డుర్యాలు, పంచభక్ష్య పరమాన్నాలు, విలాసవంతమైన శయన మందిరము ,అందులో ఉన్న వస్త్రాలు అన్నీ చూసి చాలా సంతోషంతో ఎన్నో రోజులుగా పేదరికంలో గడిపిన రోజులు ఈ రోజుటితో సమాప్తం అనుకొని విశ్రమించాడు.అలా సంవత్సరం రోజులు తెలీకుండానే ఆ మాయామల్లి గృహంలో గడిపాడు. ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురిఅయ్యాడు రామయ్య.లేచి తినడానికి,తాగడానికి కూడా ఓపిక లేదు.ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనిపించింది రామయ్యకు.ఇలా బాగాలేనప్పుడు ఇంట్లో అందరూ ఎలా చూసుకునేవారో అని గుర్తుకువచ్చింది రామయ్య కు.అసలు బంధాలు వద్దను కున్నానే కానీ బంధాలు బంధనాలు కాదు అనురాగపు చందనాలు అనుకున్నాడు.ఇంక ఆ మాయామల్లి గృహంలో వుండలేక బయటకి వచాడు.పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం , సూర్యోదయం సమయాన్న వెచ్చని సూర్యకిరణాలు,పక్షుల కిరకిలరావాలు అన్ని అనందపరవశంలో ముంచుతున్నాయి రామయ్యను.కొంచం ఓపిక వచ్చిన వాడైనాడు.అలా వున్న ఓపికతో ఇంటికి చేరాడు.సంవత్సరం తరువాత ఇంటికి చేరిన రామయ్యకు కుటుంబ సభ్యుల ప్రేమ అభిమానంతో కూడిన పచ్చడి మెతుకులు కూడా ఎంతో సంతోషం ఆనందం ఇచ్చాయి. బంధాల నుంచి వచ్చే బాధ్యతలు ఇష్టమయ్యాయి రామయ్య కు నిజమైన సిరిసంపదలు డబ్బు లో ఉండదు అని తెలుసుకున్నాడు.ఉన్నంతలో సంతోషంతో బాధ్యతలు అన్నీ నెరవేర్చి తను కూడా పెళ్లి చేసుకొని సుఖసంతోషాలతో జీవించసాగాడు.

మరిన్ని కథలు

Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్
Veedani todu
వీడని తోడు
- Dr. శ్రీదేవీ శ్రీకాంత్
Banglaw kukka
బంగ్లా కుక్క
- -పెద్దాడ సత్యప్రసాద్
Ekaaki
ఏకాకి
- ప్రభావతి పూసపాటి
Kalpita betala kathalu.3
కల్పిత బేతాళకథలు - 3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.2
కల్పిత బేతాళకథలు - 2
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
KalpitaBetala kathalu.1
కల్పిత బేతాళకథలు - 1
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Manam
మనం
- మణి