సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న.
నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి దాన్ని పైకి లేపింది. అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్నట్లు కనిపించింది. అంతలోనే ఎదురింటి ముసల్ది దీన్ని చూసేసి ఓలమ్మో ఓలమ్మో గోరిమ్మ ఎంత పని జరిగి పాయెనే అమ్మా...ఇన్ని రోజులు ఎక్కడకు పోయినవే? ఆడిజిమ్మడ నా శాపాలు తగలతాయి వానికి. నీకు ఎంత అన్నియమ్ము జేసినాడే ఆ దేముడు అంటూ అరుత్తా అక్కడకు వచ్ఛేసి దీన్ని అక్కడనే కూలేసింది. హే హె ముసల్దానా.. నువ్వుండహే ..అని నవనీత..ముసల్దాన్ని పక్కకు తోసేసి ...గోరి ..నువ్వు లేవే...ఈ ముసల్ది ఇక్కడ జాతర చేస్తుంది, అని నాతో తీసుకుపోవే వసంత దాన్ని లోపలి అంది. నేను కుమిలి కుమిలి ఏడుస్తున్న గౌరిని పట్టుకుని లోనికి పొయ్యా...బయటినుంచి ముసల్దాని ఏడుపు ..నా మనవరాలి జీవితం పాయెనే అంటూ వినిపిస్తాంది.
వసంత నెమ్మదిగా గౌరితో...ఏమైంది....ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. గౌరీ నెమ్మదిగా తలపైకి ఎత్తి వసంత కళ్ళలోకి చూస్తూ "నేను మనువు చేసుకున్నా" "ఈ కడుపుకు కారణం వాడే బైరాగి" అంది. "వాడు ఇప్పుడు నాలుగు నెలల నుండి కనిపించలేదు.యాడికి పొయ్యాడో తెల్వలేదు""గంగమ్మ గుళ్ళో పసుపుతాడు కట్టి నన్ను తీసుకుపోయాడు". మొహాన్ని చేతుల్లో దాచుకుంది. బోరున ఏడవడం మొదలు పెట్టింది. మళ్ళీ కళ్ళ నీళ్ళు తుడుచుకుని చెప్పింది బైరాగి రోజు నేను స్కూల్ కి పోయేటప్పుడు వెంటపడేవాడు. "నీ అంత అందగత్తె లేదు". "కలలో నువ్వే వస్తున్నావు". నాకు రోజా పూలు ఇఛ్చి.. "నువ్వు ఎర్రటి రోజా పువ్వు అనేవాడు". తెల్లటి బట్టలు వేసుకుంటే తెల్ల మందారం అనేవాడు. "నిన్ను వదిలి ఉండలేను". నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బాగా చూసుకుంటాను. నేను చదువుకోవాలి, నాకు వద్దు ప్రేమ అని నేను అంటే, నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే, నాతో రాకపోతే అని నా ముందరే బ్లేడ్ తీసుకున్నాడు. ఎందుకో నాకు ఎప్పుడూ వాడే గుర్తుకు వచ్చేవాడు పుస్తకాలు ముందర వేసుకుని చదువుదామని అన్నా....వసంతక్క నాది వానిది నిజమైన ప్రేమ అనుకున్నా. పట్నం లో కాపురం పెట్టాడు. కామం వానికి నా మీద. ప్రేమ లేదు. నా శరీరం కావాలి. కడుపు రాగానే నన్ను కొట్టడం తిట్టడం మొదలు పెట్టాడు. నువ్వు ఊరికే కూచోని ఉంటే కూడు ఎవడు వేస్తాడు నీకు అని అరిచేవాడు. లేచిపోయి వచ్చావు నాతో అనేవాడు. పైసా తేలేదు నీ అమ్మ బాబు దగ్గర నుండి అనేవాడు.
ఇంతలో ఒక పెద్దాయన గుంపు లో నుండి బయటికి వచ్చి " సర్ వీళ్లిద్దరు పట్నంలో మా బాడుగ ఇంట్లో కాపురం చేశారు. మీరు ఈ విషయం నన్ను ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతాను " అన్నాడు. ఇనస్పెక్టర్ కోపంతో "ఇప్పుడు ఏమంటారు చెప్పండి. కోర్టు మెట్లు ఎక్కిస్తాను మిమ్మల్ని" అనగానే బైరాగి పెద్దప్ప బైరాగిని చెంపకు పట్టి ఒకటి వేసి "ఏ ఆడకూతురు పరాయి వాడిని తన మొగుడు అనదు. నువ్వు ఆ పిల్ల తో కాపురం చేసింది ఊరంతా చూసింది. ఇప్పుడు కాదంటే నీకే కాదు మాకు కూడా పరువు చేటు" అంటూ "సార్ నాది పూచి. ఈ బిడ్డను నా బిడ్డ గా చూసుకుని వీరిద్దరూ కాపురం చేసేటట్లు నేను చూస్తాను" అంటూ చేతులు జోడిస్తూ మా వైపు తిరిగి "అమ్మల్లారా మా వాడిని క్షమించండి". "నేను నా ఇంట్లో బిడ్డను పెట్టుకుని వాళ్ళిద్దరి దగ్గర కాపురం చేపిస్తాను". "ఈ బిడ్డను నా బిడ్డగా చూసుకుంటాను". "నాది పూచి కుటుంభం పెద్దగా". అన్న వెంటనే ఇనస్పెక్టర్ బైరాగి వైపు చూసి " ఈ అమ్మాయి నా భార్య ఈమెని ఇక బాగా చూసుకుంటాను అని క్షమాపణ పత్రం రాసిచ్చి వెళ్లు" అనగానే బైరాగి మొహం దించుకుని సరేనంటూ తల ఊపాడు.