పంతులు గారి సతీ సతమతం - బి.రాజ్యలక్ష్మి

Pantulugari satee satamatam
“రాత్రి రాలేక పోయాను రాజ్యం !అలుక మానవే బంగారు ,” బుజ్జగిస్తూ లోపలికొచ్చాడు రామం ,ఉదయం యేడయ్యింది ,రాజ్యం మౌనం గా వంటింట్లోకెళ్లింది సీరియస్ గా .వెనకాలే వెళ్లాడు .
“ఏం చెయ్యను చెప్పు ,మంగళ బజారుకెళదామన్నది,నేను తీసికెళ్లకపోతే అన్నం తిననని పేచీ పెట్టింది .తిరిగి వచ్చేటప్పటికి చీకటిపడింది .అక్కడే భోజనం చేసి వుండిపొమ్మని బలవంతం చేసారు “సంజాయిషీ యిచ్చుకుంటూ స్నానానికి వెళ్లాడు రామం .
“అబ్బో షాపింగ్ యెక్కువే చేసినట్టున్నారు “వ్యంగం గా అస్త్రం వేసింది రాజ్యం .
రామం ప్రైవేట్ బళ్లో ఉపాధ్యాయుడు .పెళ్లయ్యి పదినెలలయ్యింది .రాజ్యం పల్లెటూరి నించి వచ్చింది గడుసు అమ్మాయి కాదు .యింకా భర్త దగ్గర అంత చనువు లేదు .ఇద్దరూ అరమరికలు లేకుండా వుంటారు .కరోనా వచ్చేసి రామం వుద్యోగం మింగేసింది .పెద్ద ఆస్తిపరులు కారు .ఆ టైం లో నాలుగైదు ట్యూషన్లు కుదుర్చుకున్నాడు .కరోనా తగ్గుమొహం పట్టింది కానీ వుద్యోగం మాత్రం కరుణించలేదు .అందుకే సాయంకాలం యిళ్లకు వెళ్లి ట్యూషన్స్ చెప్తున్నాడు .పగలు రెండుగంటలు షాప్ లో అకౌంటెంట్ గా పనిచేసుకుంటాడు .
రామం భోజనం చేసి షాప్ కి బయల్దేరాడు .
“రాజ్యం ,నేను. ట్యూషన్స్ ముగించుకుని వస్తాను ,నా కోసం యెదురు చూడకు ,భోజనం చేసి పడుకో “ అంటూ రామం వెళ్లిపోయాడు .రాజ్యం తలూపింది .వంట పనయ్యింది ఒకనిమిషం సోఫా లో వాలింది .పొరుగింటి సీత ,పద్మ వచ్చారు .
“రాత్రి. రామం రానట్టున్నారు కదూ “అంటూ సీత పద్మ వైపు కనుబొమ్మలెగరేసింది .
రాజ్యం “అవునండీ ,ట్యూషన్ లో ఆలస్యం అయ్యిందని వాళ్ళు బలవతం చేసి వుండమన్నారుట “అన్నది .
పద్మా .సీతా వంకర నవ్వు నవ్వారు .
“రాజ్యం మీరు మరీ అమాయకుల్లా వున్నారు ,ఈ రోజుల్లో మగాళ్లను నమ్మలేం ,భార్య మెత్తగా వుంటే ఆడిస్తారు ,”అయినా మీ సంసారం ,మీ యిష్టం ,కాస్త జాగ్రత్తగా వుండండి “అంటూ రెండు బ్రహ్మాండ బాణాలు లాగి రాజ్యం గుండెకు కొట్టేసి వెళ్లిపోయారు సీతా పద్మా ద్యయం .
“రాజ్యం ,మంగళకు చలిజ్వరం ,తలనొప్పి ,’మేష్టారూ నా దగ్గరే వుండండి ‘అంటూ ఒకటే పంతం పట్టింది ,తండ్రి లేనిపిల్ల ,వాళ్ల అమ్మ కూడా నన్ను బ్రతిమిలాడారు ,ఏం చెయ్యను ? అందుకే రాత్రి వుండిపోయాను .”అన్నాడు రామం .రాజ్యం అసలు వినిపించుకోలేదు .
“రాజ్యం ,త్వరగా భోజనం వడ్డించు ,మంగళ నిద్రపోతుంటే నెమ్మదిగా జారుకున్నాను .వెళ్లాలి “అంటూ రామం భోజనం చేసి వెళ్లిపోయాడు .రాజ్యం మౌనం గా శూన్యం లో చూసింది .
పదిహేను నిమిషాల తర్వాత సీతా ,పద్మా ,మూడో యింటి శ్రావణి. హడావిడిగా వచ్చారు .
“”రాజ్యం ,ఏమీ అనుకోకండీ ,మీ వారి పధ్ధతి బాగోలేదు ,యేదో సాకు. తో రాత్రిళ్లు రావడం మానేస్తున్నారు ,కాస్త. గట్టిగా నిలదీయండి” మళ్లీ అస్త్రాలు సంధించి వెళ్లిపోయారు రాజ్యానికి భర్త ప్రవర్తన. అర్ధం కావడం లేదు .
రామం ఆ రోజు సాయంకాలం వచ్చాడు .”రాజ్యం ,జీతం. యిచ్చారు ,అదనం గా మరో రెండువేలు పండగ బాగా జరుపుకోమని మంగళ. అమ్మగారు. యిచ్చారు ,నీకు నచ్చిన చీరె కొనుక్కో “ రామం డబ్బులు. రాజ్యం చేతికిచ్చాడు .
“ఏమండీ పుట్టింటికెల్దామనుకుంటున్నాను ,పదిరోజులుండి వస్తాను “అంటూ రాజ్యం. డబ్బులు లెక్కపెట్టుకుంటున్నది .
“అలాగే ,వెళ్లు ,పది కాకపోతే యిరవై రోజులుండు “అన్నాడు. రామం నవ్వుతూ .
రాజ్యం “మీరు రారా “అన్నది .
“ నాకు కుదరదు ,ట్యూషన్లు వున్నాయిగా “అన్నాడు రామం .
తాను లేకపోతే భర్త మొత్తం గా మంగళ. దగ్గరే వుండాలనుకుంటున్నారు ,ఆమ్మో కాపురం. కొల్లేరవుతుంది ,పుట్టింటి కి. యిప్పట్లో వెళ్లకూడదు .అనుకుంది రాజ్యం .
యధాప్రకారం ముగ్గురమ్మలక్కలు ప్రత్యక్షము ! రాజ్యం తన బాధ వెళ్లబోసుకుంది .
“చూసావా రాజ్యం ,మేం వూహించిందే అయ్యింది ,మీరు పుట్టింటికెళ్లిపోతే తను ఆనందం గా గడపొచ్చు అనుకుంటున్నారు ,,లాభం లేదు , ఆ ట్యూషన్. అమ్మాయిని యింటికి. తెమ్మని. చెప్పండి
అందరం కలిసి. గడ్డి పెట్టాలి “అంటూ. రాజ్యానికి సుభాషితాలు చెప్పేసి వెళ్లిపోయారు .
రాజ్యానికి. ఏడుపొస్తున్నది .
ఆ రోజు సాయంకాలం వస్తూనే “రాజ్యం యెప్పుడు నీ ప్రయాణం ? “అడిగాడు రాజ్యాన్ని .
“అనుకున్నాను కానీ మిమ్మల్ని వదిలి వెళ్లాలనిపించడం లేదు ,ఒకసారి ఆ ట్యూషన్ అమ్మాయిని మనింటికి తీసుకుని రండి అంటూ భర్తకు కాఫీ యిస్తూ ముద్దుగా అడిగింది రాజ్యం .
“తప్పకుండా తీసుకొస్తాను. ,మంగళ కూడా నిన్ను చూడాలనుకుంటున్నది “అన్నాడు రామం .
ఆ విషయం అమ్మలక్కలకు చెప్పింది . మర్నాడు ఆ అమ్మాయి వస్తుందని చెప్పింది .అందరూ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు .
ఆ రోజు. సాయంకాలం రానేవచ్చింది అమ్మలక్కల హడావిడి అంతా యింతా కాదు .రాజ్యం యింటిముందు ఆటో ఆగింది .రామం దిగాడు ,లోపల కూర్చున్న అమ్మాయిని చెయ్యి పట్టుకుని దింపాడు .అయిదేళ్ల పాప పట్టుపరికిణీ పట్టు జాకెట్ ,రెండు జడలు కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు మంటూ నవ్వుతూ దిగింది .”మేష్టారూ మీ యిల్లు బాగుంది ,అమ్మగారూ నమస్తే “అంటూ రాజ్యానికి నమస్తే పెట్టింది .రాజ్యం అవాక్కయ్యింది .అమ్మలక్కలు తేలుకుట్టిన దొంగల్లాగా పరారయ్యారు .
“రామ్మా బంగారు తల్లీ “ అంటూ రామం మంగళను. లోపలికి తీసుకొచ్చాడు .
——////—-//——-/—-///—///—-/////-/////

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు