విలువైనది స్నేహం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Viluvainadi sneham

అమరావతినగర సమీపంలోని అరణ్యంలో నీరు లభించక పోవడంతో జంతువులు అన్ని కృష్ణానది ఎగువ ప్రాంతానికి తరలివెళ్ళసాగాయి. అలసటతో ఓ మర్రిచెట్టు నీడన జంతువులు అన్ని సమావేశం అయ్యాయి." మాఅందరిలో పెద్దవాడి ఏదైనా యుక్తికథచెప్పు "అన్నాడు కుందేలు . "సరే అందరువినండి...

పూర్వం అవంతి రాజ్య సమీపంలోని అరణ్యంలో కొంగ, తాబేలు, నక్కా స్నేహంగా ఉండేవి. పగలంతా ఆహర అన్వేషణలోగడిపి సాయంత్రానికి మర్రిచెట్టుకింద కలుసుకునివి.

" ఒకరోజు కొంగ మిత్రమా రేపు నేను చేపల పులుసు చేస్తాను భోజనానికి మాయింటికి రా "అని నక్కను ఆహ్వనించింది. కొంగఇంటికి వెళ్ళిన నక్కనుచూసిన కొంగ " రా మిత్రమా తిను అంటూ మరో ఎండు సొరకాయబుర్రలోని చేపలపులుసు చూపించింది.

సొరకాయ బుర్రలోని చేపలపులుసు ఎలాతినాలో అర్ధంకాని నక్క కూర్చుండిపోయింది.

"అయ్యో నక్క మిత్రమా నువ్వు భోజనానికివస్తు నీమూకుడు తెచ్చుకుంటావనుకున్నాను మాఇంట్లో అలాంటివి లేవే,అంటూ తన ముంద ఉన్నఎండు సొరకాయ బుర్రలోనీ చేపలపులుసు తన పొడవాటిముక్కుతో పొడుచుకు తినసాగింది.

జరిగిన అవమానానికి బాధపడుతూ, కొంగకు తగిన గుణపాఠం నేర్పి దెబ్బకు దెబ్బ తీయాలి అనుకుని "దానికేముందిలే మిత్రమా రేపు నేను పాయసం చెయబోతున్నాను నువ్వువిందుకు తప్పకుండా రావాలి "అని కొంగను ఆహ్వనించింది నక్క.

మరుదిన నక్క ఇంటికి వెళ్ళింది కొంగను చూసిన నక్క" రా మిత్రమా వస్తు నీఎండు సొరకాయ బుర్ర తెచ్చుకోలేదా ?ఇప్పుడు మాఇంట్లో నువ్వు పాయసం తాగటంకుదరదే " అంటూ మూకుడులోని పాయసం నాలుతో నాకసాగింది నక్క.

మూకుడులోని పాయసం తన ముక్కుతో ఎలాతినాలో తెలియని కొంగ నక్కను చూస్తూ కూర్చుండి పోయింది.

తనకు బుద్దిచెప్పడానికే నక్క ఈనాటకం ఆడిందని గ్రహించిన కొంగ తేలుకుట్టిన దొంగలా సిగ్గుతో మౌనంగా వెళ్ళిపోయింది.

అనారోగ్యంతో నాలుగురోజులుగా మర్రిచెట్టు వద్దకు రాలేకపోయింది తాబేలు వచ్చి, మరుదినం మర్రిచెట్టు కింద కొంగా, నక్కా, తాబేలు సమావేశం అయ్యాయి.

మిత్రులు కొంగ, నక్క మాట్లాడుకోవడం లేదన్న విషయం గ్రహించి, విషయం వారి ద్వారానే తెలుసుకొని " మిత్రులారా స్నేహం ఓ మధురమైన అనుభూతి. దానికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం. ' స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. ప్రవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. పేదరికం, ఐశ్వర్వ తేడా తెలియకుండా చేసేదే స్నేహం, ఉదాహరణకు దుర్యోధనుని కొరకు కర్ణుడు ప్రాణాన్ని ఇచ్చాడు. ఇలా ఆపదలో ఆదుకున్నవాడు, అవసరానికి మంచి సలహ ఇచ్చెవాడే నిజమైన స్నేహితుడు. మిత్రుని గుణగణాలు ఎదటివారి వద్ద అతని లోని లోపాలను అతని వద్ద చెప్పాలి. ముందు జీవితంలో మరెన్నడు ఇలా ప్రవర్తించకండి" అన్నది తాబేలు.

" నేను మన మిత్రుడు నక్కను అలా అవమానపరచడం తప్పే, స్నేహంలో ఇచ్చి పుచ్చుకోవాలని తాబేలు ద్వారా తెలుసుకున్నాను. ఇటువంటి తప్పిదం మరెన్నడు నా ముందు జీవితంలో చేయను, నక్క మిత్రమా నన్ను మన్నించు" అన్నది కొంగ .

"కొంగ మిత్రమా నేను చేసింది తప్పే. నన్ను అవమానపరచావు అన్నకోపంలో నేనుకూడా నీపట్ల మూర్కంగా ప్రవర్తించాను నన్ను క్షమించు" అన్నాడు నక్క.

ఇదికథ అన్నాడు ఏనుగు .

జంతువులన్నిసంతోషంగా తమప్రయాణం కొనసాగించాయి

మరిన్ని కథలు

Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి