తెల్లవారుతూనే వచ్చిన కుందేలు, చెట్టుపైన నిద్రపోతున్నకోతిని చూసి "అల్లుడు ఇంకానిద్రలేవలేదా ? ,రాత్రి చిలుకడదుంపలు దొరికాయి .పచ్చివి నువ్వు తినలేవని కాల్చి తీసుకువచ్చాను చెట్టుదిగిరా తిందాం "అన్నాడు కుందేలు.
" దుంపలు రుచిగా ఉన్నాయి, మామానాకు ఎప్పటినుండో పందిపైన ఎక్కితిరగాలని కోరిక ఉంది ఎలాతీరుతుందో తెలియలేదు "అన్నాడు చేరువగా ఉన్న పెద్దపందిని చూస్తూ కోతి.
" అల్లుడు ఎవరైనా ఏనుగునో,గుర్రాన్నో ఎక్కితిరగాలనుకుంటారు, ఇదేంపాడుకోరికనీకు "అన్నాడు కుందేలు. "ఏనుగుతాత,గుర్రం బాబాయి నన్ను తమపైకూర్చోపెట్టుకుని పరుగు తీసి నాకోరిక ఎప్పుడో తీర్చారు, ఈరోజుఎలాగైనా నాపంది సవారి కోరికతీర్చుకోవాలి,నువ్వు కనుక నాకు సహకరించావంటే ఇప్పుడే నాకోరికతీరుతుంది " అన్నాడు కోతి.
" వద్దు అల్లుడు ఇది తగని కోరిక లేనికష్టలు కొని తెచ్చుకోవడం ఎందుకు? "అన్నాడు కుందేలు. " అహ నువ్వు నాకు సహయంచేయవసిందే లేదంటే మనస్నేహం తెగిపోతుంది "అన్నాడు కోతి. " సరే నీకు నేను ఎలా సహయపడగలను "అన్నాడు కుందేలు . కుందేలు చెవివద్ద గుసగుసలాడాడు కోతి.
చెట్టుకిందరాలిపడిన పండ్లను తింటున్న పందిపైకి ఒక్కఉదుటున ఎగిరికూర్చుని దాని రెండు చెవులు బలంగా పట్టుకున్నాడు కోతి . అదేసమయంలో తనచేతిలోని కర్రపుల్లతో పంది తోక కింద భాగాన బలంగాగుచ్చడు కుందేలు.
హఠాత్తుగా ఎవరో తనపైన వచ్చికూర్చొని రెండు చెవులు బలంగా పట్టుకోవడంతో భయడింది పంది, అదేసమయంలో ఎవరో తనతోక కిందభాగానూపుల్లతోగుచ్చడంతో అదిరిపడి ప్రాణభయంతో
పరుగు తీయసాగింది పంది.పంది పరుగుకు ఆనందంతో పెద్దపెట్టన కిచకిచలాడాడు కోతి.
కోతి కిచకిచలు విన్నపంది మరింతభయంతో వేగంగా పరుగుతీస్తూ ధధధమఎదురుగా వస్తున్న సింహరాజును గమనించకుండా వెళ్ళి బలంగా తగిలింది,పంది గుద్దుకు గాల్లోఎగిరిన సింహరాజు తనపక్కనేఉన్న నక్కపైన పడ్డాడు, సింహరాజు గారిమూతి నేలకు తగిలి సీతాఫలం అంతవాచిపోయింది. సింహరాజు ఎగిరి తనపైన పడటంతో ఊపిరి ఆడక
కళ్ళుతేలవేసి గిలగిలా తన్నుకోసాగింది నక్క.
ఇవేమి పట్టని పంది ప్రాణభయంతో ముళ్ళపొదలు అనికూడా చూడకుండా దూరి వేగంగా పరుగుతీస్తూ, ఎదురుగావచ్చిన ముళ్ళపందికి భయపడి తన పరుగువేగం తగ్గించుకునే ప్రయత్నంలో ఆపక్కనేఉన్నచెట్టును బలంగా ఢీకొట్టింది . పందికి చెట్టుకు మధ్యలోపడిన కోతికి నడుము పట్టేసింది,అతికష్టంపైన చెట్టుపైకి చేరిన కోతి తనవంటినిండా ముళ్ళు దిగబడి,వళ్ళంతా గీరుకుపోయి గాయిలు కావదడంతో తన తగనికోరిక తచ్చిపెట్టిన తిప్పలు తలచుకుంటూ తప్పుడు పనులు,తగనికోరికలు ఎటువంటి బాధలు తెచ్చిపెడతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కోతి.