సర్వేజనా సుఖిఃనో భవంతు ... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sarve jana sukhino bhavanthu

సదానందస్వామి తనఆశ్రమంలోని శిష్యులందరిని సమావేశపరచి - 'నాయనలారా గురువు త్రిమూర్తి స్వరూపుడని,బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త రూపమే గురువని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది శ్రుతి వాక్యం. మనపూర్వీకులు గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలను విడి విడిగా చెప్పారు. గర్బదానాది కర్మలు చేయించి, అన్నము పెట్టి విద్యార్ధులను పోషించేవారు 'గురువు' వేదాంగాలను, వ్యాకరణాదులను శిష్యులచేత అధ్యయనం చేయించేవారిని 'ఉపాధ్యుయుడు' అంటారు. తన శిష్యులకు ఉపనీయం చేసి వేదములను, కల్పసూత్రములను, ఉపనిషదములతోనూ అధ్యాయనం చేయించేవారిని 'ఆచార్యుడు' అంటారు. ప్రియ శిష్యులార నేడు చాలా సుదినం.

మనిషి పుట్టుక చాలా గొప్పది. మనం గొప్ప అనుభూతులతో, మంచి అనుభవాలు నింపుకుంటూ, దుఖఃము, ఆనందమయమైన జీవితం అనుభవిస్తూ మన ఆనందాన్ని సుఖాన్ని ఎదటివారికి పంచుతూ జీవించాలి. చతుర్విధ వర్ణాశ్రమధర్మలైన బ్రూహ్మచర్యం, గార్హస్థ్య, వానప్రస్థ , సన్యాశాశ్రమాలు.

ఇప్పుడు మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు. స్త్రీ లకు దూరంగా ఉండాలి. అసత్యానికి, నృత్యము, గానము, వాద్యము ఆస్వాదించకూడదు, సుగంధద్రవ్యాలు, పుష్పమాలధారణ, పాదుకా, ఛత్రధారణ, అలంకారం చేసుకోకూడదు. మధువు, మాంసాహారము, ఉప్పు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసిన వంటకం తినకూడదు నేలపైనే కూర్చోవాలి, నేలపైనే నిద్రించాలి. ప్రతిదినము గురువుకు, తల్లితండ్రికి, ఆచార్యునికి, విద్వాంసునికి నమస్కరించాలి.

మనజీవితానికి సఛ్ఛీలము, సత్ ప్రర్తన, సహాజీవనం, సహవాసం, సహన్నివేశం, నేర్పించగలిగి, జీవనవిజ్ఞానాన్ని, నవ్యమైన, భవ్యమైన భావిజీవితానికి మార్గమైనదే బ్రహ్మచర్యం. ఈరోజుకు ఈపాఠం చాలు. నాయనా శంకరం నువ్వు జయంతుని తోడు తీసుకుని, రాజు గారి వద్దకు వెళ్ళు మన గురుకుల నిర్వాహణకు ధనం ఇస్తారు తీసుకురా' అన్నాడు సదానందుడు.

జయంతుడు, శంకరం ఇద్దరూ బయలుదేరి వెళ్ళి రాజుగారి వద్ద ధనం తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు, అక్కడ వేగంగా ప్రవహిస్తున్న వాగు ఒడ్డున చేతిలోని పాలచెంబుతో ఒక బక్కచిక్కిన స్త్రీ నిలబడి ఉంది. శిష్యులిద్దరిని చూసిన ఆమె 'అయ్యా నాబిడ్డకు పాలు తీసుకురావడానికి ఇక్కడకువచ్చాను కాని తిరిగి వెళ్ళేలోపే వాగు ప్రవాహం పెరిగింది అక్కడ నాబిడ్డ ఆకలితో ఏడుస్తుంటుంది, దయచేసి నన్ను అవతలి ఒడ్డుకు చెర్చండి' అని వేడుకుంది.

'కుదరదు మేము బ్రహ్మచర్యదీక్షలో ఉన్నాం' అని వాగులో దిగి అవలి ఒడ్డుకు చేరాడు. జయంతుడు. 'తల్లి పాల చెంబు భద్రంగా పట్టుకో, నేను నిన్ను నా చేతులపై ఎత్తుకుని తీసుకువెళతాను' అని ఆమెను క్షేమంగా ఒడ్డు చేర్చాడు శంకరం.

శిష్యులు ఇరువురు ఆశ్రంచేరి రాజుగారు ఇచ్చిన ధనం సదానందునికి అందించారు. 'గురుదేవా మేము తిరిగి వచ్చే దారిలో వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో తన బిడ్డకు పాల కొరకు వచ్చిన ఒక స్త్రీ ఇవతలి ఒడ్డున చిక్కుకుపోయి వాగు దాటించమని మమ్మల్ని ప్రాధేయపడింది. మేము బ్రహ్మచర్యదీక్షలో ఉన్నాం కుదరదు అని చెప్పాను కాని, శంకరం ఆ స్త్రీని తన చేతులపై మోస్తూ అవతలి ఒడ్డుకు చేర్చాడు' అన్నాడు జయంతుడు.

'నాయనా జయంతా, శంకరం తను చేసిన పనిని అక్కడే మర్చిపోయాడు కాని నువ్వుమాత్రం ఆ భావాన్ని మనసులోనుండి తొలిగించలేకపోయావు. శంకరం ఒ బిడ్డ ఆకలితీర్చే పుణ్యకార్యం చేసి మౌనంగా ఉన్నాడు. దాన్ని అపరాధభావంతో చూసిన నీవు దాన్ని ఇక్కడిదాక మోసుకొచ్చావు. సాటివారికి సహాయపడటంలో మనలోని మానవత్వం వెలువడుతుంది. మానసేవే మాధవసేవ అనికదా అన్నిమతాలు చెప్పేది. అక్కడ ఆస్ధానంలో శంకరం కళ్ళకు ఆమె ఒక మాత్రుమూర్తిగా కనిపించింది. వృత్తులు వేరైనా మనుషులంతా ఒక్కటే. నియమాలు మనం చేసుకున్నవి అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలి. ఎవరికైనా పాము కరిచిందటే దుర్ముహర్తం పోఏదాకా ఆగుతామా? అలా ఆగితే ఆవ్యక్తి మనకు దక్కుతాడా? మంచి మనసుతో చేసే మంచి పనికి ముహుర్తం ఎందుకు? సాటి ప్రాణిని ఆదుకోవడమే మహోన్నత మానవత్వం. ఆర్తులను, వృధ్ధులను, వ్యాధిగ్రస్తులను ఆదుకోవడం మనసంస్క్రతిలో అది ఒ భాగం, నీ కుటుంబాన్నికాపాడినట్లే, నీ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. నీతో పాటు నీతోటి వారు కూడా సుఖః సంతోషాలతో ఉండాలని కోరుకోమని మనవేదాలు వాక్యాలు ఓ పర్యాయం గుర్తుచేసుకో.

'సర్వేజనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినోభవంతు' అన్నాడు సదానందుడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు