అమరావతి రాజ్య పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకుని రాజుగారి సహాయంతో వసతి,భోజన సదుపాయాలు కలుగజేసి విద్యాదానం చేయడంతో, పలుపువురు విద్యార్ధులు అతని ఆశ్రమంలో చేరి చదువుకోసాగిరు.
ఒకరోజు కొందరు విద్యార్ధులు సదానందుని కలసి "స్వామి మాతోటి విద్యార్ధి రంగనాథం మావస్తువులు,మేము ఇంటివద్దనుండి తెచ్చుకున్న తినుబండారాలు దొంగతనం చేస్తున్నాడు కనుక అతన్ని ఆశ్రమంనుండి పంపంచండి "అన్నారు.
" నాయనలారా దొంగతనం చేయడం తప్పు అని ,అది నేరం అనిమీరు తెలుసుకుని సన్మార్గంలో ఉంటున్నారు. మేకలసమూహంలో ఒక మేకతప్పిపోతే తప్పిపోయిన మేక కొరకు కావలిదారుడు మేకలసమూహాన్ని అక్కడేవదలి తప్పిపోయిన మేకను వెదకడానికివెళతాడు ,అలావెళ్ళడాని అతనికి మిగిలిన మేకలు ఎక్కడకిపోవనేనమ్మిక. ఇక్కడనేనుకూడా అంతే ,అతన్నిదండించి ఆశ్రమం వెలుపలకు పంపితే,అతను ఎప్పటికిమారడు ,ఓపికతో మనమే అతన్ని మార్చుకోవాలి ,సమయం సందర్బం వచ్చేవరకు మనం సహనం
తో అతని చేష్టలనుభరించాలి " అన్నాడు.
రోజు దసరాపండుగ కావడంతో విద్యార్ధులు అందరికి భోజనంలో లడ్డు, బొబ్బట్టు సిధ్ధచేసి వంటగదిలో ఉంచారు.
అదేసమయంలో సదానందుడు రంగనాధాన్నిపిలిచి "నాయనా దాహంగా ఉంది వంటగదిలోనికివెళ్ళి మంచినీళ్ళుతీసుకురా " అన్నాడు.
వంటగదిలోనికివెళ్ళిన రంగనాధం అక్కడ ఉన్న పిండివంటలు చూస్తూ తనను ఎవరూ గమనించడంలేదని ,ఒక లడ్డు బొబ్బట్టు దుస్తుల్లో దాచుకుని, సదానందునికి మంచినీళ్ళు అందించి వెళ్ళిపోయాడు.
కొంతసేపటి అనంతరం అందరు భోజనానికి కూర్చున్నారు. బంతిలో విద్యార్ధులకు చివరిభాగంలో సదానందుడు కూర్చున్నాడు. అందరికి పిండివంటలు వడ్డించగా సదానందుని వద్దకు వచ్చేసరికి పిండివంటలు తగ్గినవి.
" గురుదేవా నేను అందరిని లెక్కించి మరి తయారు చేసాను,ఎవరో ఇవి దొంగతనం చేసారు "అన్నాడు వంటమనిషి. "
" అంతేకదా నావంతుకూడా నాశిష్యుడు ఎవరో తినిఉంటాడు,అయినా అడిగితే నేనే ఇచ్చేవాడిని, దొంగతనం తప్పుఅని దాని వలన పలువురి ముందు అవమానం పొందడపాటు శిక్ష అనుభవించవలసివస్తుంది.నాశిష్యులలో ఒక దొంగ ఉన్నందుకు నాకు చాలా బాధగాఉంది , ఎవరైన గోప్పవారుకావాలి అంటే ఇష్టంగా చదవాలి గొప్పవాడు కావాలి అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది, భోజనం కినివ్వండి "అన్నాడు సదానందం.
భోజనానంతరం విశ్రమించిన సదానందుని పాదాలపై కన్నిటి చుక్కలు పడటంతో కళ్ళుతెరిచాడు. ఎదురుగా చేతులు జోడించి నిలబడిన రంగనాధం " గురుదేవ మన్నించండి, దొంగతనంతో ఎవరు గోప్పవారు కాలేరు. బాగా చదవాలి ఉన్నత స్ధానాలు పొందాలి అని తమ సందేశంద్వారా తెలుసుకున్నాను మరెన్నడు నాజీవితంలో తప్పుడు పనులు చేయను నన్ను మన్నించండి "అని సదానందుని పాదాలు తాకాడు రంగనాధం. ఆప్యాయంగా రంగనాధాన్నా చేరువకు తీసుకున్నాడు సదానందుడు.