అవంతి రాజ్యపొలిమేరలలో సదానందుడు ఆశ్రమంనిర్మించి అందులో విద్యాదానంతోపాటు పలువురు నిరాదరణకు గురైన వారికి ఆశ్రయంకలిగించాడు.సదానందుని బోధనలు వినడానికి ఆపరిసరప్రాంతాల గ్రామప్రజలు వస్తుండేవారు. ఒకరోజుసాయంత్రం
తనబబోధనలు వినడానికి వచ్చినవారికి 'నాయనలారా
ఆశయం లేని జీవితం,తెగిన గాలిపటం వంటిది.పెద్దలను గౌరవించాలి.జన్మనిచ్చిన తల్లితండ్రుల తరువాత జన్మ సంస్కారాలను విద్యా వివేకాలను నేర్పే పరమ భాగవోత్తముడు 'గురువు'ఈయనే ఇలలో కనిపించే మూడవ దైవం.అందుకే తల్లితండ్రి,గురువు,దైవం అన్నారు.
గురుని శిక్ష లేక గురు తెట్లు కల్గునో
అజునికైనా వాని యబ్బకైనా
తాళపు జెవి లేక తలు పెట్టు లూడును
విశ్వదాభి రామ వినుర వేమ! అన్నాడు ప్రజాకవి.
పరనిందచేయనివాడు,సమస్తప్రాణులందు భూతదయకలిగినవాడు, పరోపకారి,విరోధభావాన్ని మనసులోనికి రానివ్వనివారు ఉత్తములు.
అలాగే దానగుణం చాలాగొప్పది
చతుర్విధ దానాలు అంటే మరణ భయంతోఉన్నవానికి అభయంయివ్వడం,వ్వాధిగ్రస్తునకు సరియైన చికిత్స చేయించడం,విద్యాదానం,అన్నదానం.ప్రత్యుపకారం ఆశించకుండా చేసేదానాన్నిసాత్విక దానంఅని,తిరిగిఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానంఅని,తృణీకారభావంతొ చేసేదానాన్ని తామస దానం అని అంటారు. దానంచేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు. తనకుఉన్నదంతా దానంయిచ్చేవాడు దాత. తనవద్దఉన్నదంతాయిచ్చియింకా యివ్వలేక పోయానే అని బాధపడేవారిని ఉదారుడు తనవద్ద లేకున్నాయితరులను అడిగి తెచ్చి యిచ్చేవాడిని వదాన్యుడు అంటారు. ఈరోజుకు ఇక్కడస్వస్తిపలుకుదాం! 'అన్నాడు సదానందుడు.
బోధన విన్న ప్రజలు తిరుగుముఖంపట్టారు. అప్పటి వరకు సదినందుని బోధనలువిన్న ఓయువకుడు వినయంగా చెతులుకట్టుకొని "స్వామి నాపేరు శివయ్య నేను సకలవిద్యలు నేర్చాను కానీ ఎందుకో నాలోతెలియని అసంత్రుప్తి ఉంది.నాకు పలు సందేహలు ఉన్నావి దయచేసి తమరు నాసందేహలకు సమాధానం తీర్చాలి"అన్నాడు.
"నాయనా కాలం చాలాగొప్పది కొన్ని సందేహలకు కాలమే సమాధానం చెపుతుంది.నీసందేహలకు సమాధానం కావాలిఅంటే ఈఆశ్రమంలోని వృధ్ధులకు సేవలుచేసుకుంటూ,నాఆధ్యాత్మిక బోధనలు వింటూ కొంతకాలం నీవు ఇక్కడే ఉండాలి " అన్నాడు సదానందుడు.
అంగీకరించిన శివయ్య సదానందుని బోధనలు వింటూ ఆశ్రమంలోని వృధ్ధులు,వ్యాధిగ్రస్తులకు సేవలుచేయసాగాడు. అలా సంవత్సరకాలం గడచింది.
ఒకరోజు ఉదయం సదానందుడు " నాయనా శివయ్య పెద్దలఎడల నీకున్నగౌరవభావం,ఇతరులపట్ల నీకున్న సేవానిరతి అభినందనీయం.
ఇప్పుడు అడుగు నీసందేహలకు సమాధానం చెపుతాను "అన్నాడు సదానందుడు. "నాసందేహలకు సమాధానం మనఆశ్రమంలోనే లభించిందిస్వామి" అన్నాడు శివయ్య.
"ఏంతెలుసుకున్నావు ఈ ఆశ్రమంలో "అన్నాడు సదానందుడు. "స్వామి ప్రార్ధీంచే పెదవులకన్నా ఆదుకునే చేతులేమిన్న అనేవిషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తతెలుసుకున్నాను. అంతేకాదు ఒకసందేహనికి ఒకసమాధానము మాత్రమే లభిస్తుంది. తమవంటి పెద్దల ప్రసంగాలు శ్రధ్ధగావింటే అన్నిసందేహలకు సమాధానం లభిస్తుంది. మనఎదుటి పెద్దలతో తక్కువమాట్లాడాలి వారిమాటలు ఎక్కువవినాలిఅన్నది తెలుసుకున్నాను నాకు సెలవు ఇప్పించండి ఇక్కడ పొందిన జ్ఞానోదయం లోకానికి తెలియజేస్తాను "అన్నాడు వినయంగా శివయ్య.
"ఎక్కడికో ఎందుకునాయనా ఇక్కడే ఉండి మన ఆశ్రమ బాధ్యతలు నిర్వహించు "అన్నడు సదానందుడు.
"తమరి ఆశయం నెరవేరుస్తాను గురుదేవా "అన్నాడు చేతులు జోడీంచిన శివయ్య.