జమిందారు గజపతికి కథలు వినడంలో అమిత ఆసక్తి చూపించేవాడు. గొప్పకథ చెప్పినవారికి వందవరహలు బహుమతి ప్రకటించాడు.
ఎందరో ఎన్నోరకాల కథలు వినిపించారు కాని ఎవరుకథచెప్పినా చివరకువచ్చేసరికి జమిందారుగారి పరివారం ఈకథ మేము విన్నదే అని అనేవారు.
శివయ్య అనే బాటసారి పూటకూళ్ళ అవ్వ ఇంటిలో భోజనంచెస్తూ ఈకథల విషయం తెలుసుకుని ,జమిందారుగారిని కలుసుకుని,అదేరోజున రాత్రి కథచెప్పసాగాడు.
" అయ్యా జమిందారుగారు యదార్ధమైన ఈకథ మూడుభాగాలుగా మూడురోజులు వినిపిస్తాను " అన్నడు .జమిందారు సమ్మతించాడు." అయ్యగారు మా ముతాతగారు మూడుతరాలకుముందు మీజమీకి పొరుగునేఉన్న చంద్రగిరి అనేప్రాంతంలో మాజమి ఉండెది.మీముత్తాతగారితో స్నేహంగా ఉండేవారు.ఆకాలాంలో మాముత్తాతగారు,మీముత్తాతగారు కలసి రెండు జమీందారి పసువులు ఉండేందుకు పెద్దపసువుల పాకా నిర్మించారు.ఆపాకా ఎంతపెద్దదంటే ఆపాక ఈమొదటి నుండి ఆచివరకు పోవడానికి ఒకరోజు పడుతుంది.
ఈపసువులనీటికొరకు కోసెడు దూరంలోని నదినుండి నీటికాలువను తొవ్వించారు. ఆపాకవద్దకు వచ్చిన వారికి లేదనకుండా ఉచితంగా మీ మా జమిందారి ప్రజలకు పాలుపోసేవారు. పసువులమేతతీసుకురావడానికి వంద ఎడ్లబండ్లు ఉండేవి వందలమంది పనివారు ఉండేవారు.ఇలాంటి పసువులపాక ఉన్నకథ తమరు ఎన్నడైనా విన్నారా? "అన్నాడు శివయ్య.
లేదని తలఊపారు జమిందారుగారు,ఆయన పరివారం . "మిగిలినకథ రేపు చెపుతాను "అనివెళ్ళిపోయాడు శివయ్య.
మరుదినం రాత్రి కథ ప్రారంభించిన శివయ్య..." అయ్యా నిన్న పసువులపాక గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆపాకలోని పసువులగురించి తెలుసుకుందాం. ఉదయంపిండినపాలు మధ్యాహ్నంవరకు పనివాళ్ళుమోసేవారు,ఆపాకలోఉన్న వ్యవసాయఎడ్లకొమ్మునుండి మరోకొమ్ముకుబారెడు దూరంఉండేది. "ఏమిటి అంతటి గొప్ప ఎడ్లు ఉడేవా?"అన్నాడు జమిందారు ఆశ్చర్యంగా.
మహరాజా మిగిలినకథ రేపు రాత్రికి చెపుతాను "అని శివయ్య వెళ్ళిపోయిడు . "వీడెవడో మహతెలివైనవాడిలా ఉన్నాడు రేపు వీడు కథ ప్రారంభించి కొద్దిగా చెప్పగానే ఈవిషయం మాకు ఎప్పుడో తెలుసు అనండి " అనితనపరివారానికి చెప్పాడు జమిందారు.మరుదినం రాత్రి కథప్రారంభించిన శివయ్య "ఆపసువులపాక నిర్మించడానికి పదివేలవరహలు కర్చుఅయింది. మోత్తం మాతాతగారే కర్చుచేసి పసువులపాక నిర్మించాడు. మీముత్తాతగారు అందులో సంగం ఐదువేలవరహలు బాకీపడ్డారట ఆవిషయం మీకు తెలుసా? "అన్నాడు శివయ్య. "ఓ ఇదిమాఅందరికి తెలిసినకథ కదా"అన్నారు జమిందారు పరివారం.
అయితే మరీమంచిది తమపరివారానికేతెలిసిన ఆబాకీవిషయం తమకుతెలియకుండా ఉంటుందా ?కనుక మీముత్తాత గారు మాముత్తాతగారికి ఇవ్వవలసిన బాకీ కథకు వందవరహలు మొత్తం ఇప్పించండి "అన్నాడు శివయ్య వినయంగా.
శివయ్య తెలివితేటలకు నివ్వెరపోయిన జమిందారు తేలుకుట్టిన దొంగలాగ మరోమార్గంలేక శివయ్య అడిగిన ధనంఇచ్చిసాగనంపాడు.