వంద వరహల అబధ్ధం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Vanda varahala abaddham

అవంతిరాజ్యాన్నిపాలించే గుణశేఖరుడు తనరాజ్యంలో ఎవరైన నిజమైన అబధ్ధం చెప్పినవారికి వందవరహలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.

ఏందరో నిజమైఅబధ్ధం రాజుగారికిచెప్పి సంతోషపరచి వందవరహలు పొందలేకపోయారు. శివయ్య అనే బాటసారి అవంతి రాజ్యంలో ప్రయాణంచేస్తూ,పూటకూళ్ళ అవ్వఇంట భోజనంచేసే సమయంలో వందవరహల అబధ్ధంగురించి విన్నాడు.

భోజనం సిధ్ధం కావడానికి ఆలస్యం ఉన్నందున, శివయ్య అక్కడ ఉన్నవాళ్ళు, పెద్దవేపచెట్టు అరుగుపైచేరి పొడుపుకథలు వేసుకుంటూ కాలక్షేపంసాగారు.అక్కడచేరినశివయ్య " అన్నలు మీరుపొడుపు కథవేయండి నేనువిప్పుతా "అన్నాడు. "ఉడికిందొకటి,ఉడకనిదొకటి,కాలిందొకటి,కాలనిదొకటి ఏమిమిటది" అన్నాడు ఓబాటసారి. "ఉడికిందంటే సున్నం,ఉడకనిదొకటి అంటే వక్క,కాలిందొకటి అంటే పుగాకు,కాలనిదోకటి అంటే తమలపాకు "అన్నాడు శివయ్య. "అక్కడక్కడబండి అంతరాలబండి మద్దూరు సంతలో మాయమైనబండి" అన్నాడు మరోబాటసారి. "సూర్యుడు "అన్నాడు శివయ్య"పిఠాపురంచిన్నోడా,పిట్టలకువేటగాడా,బతికినపిట్టను కొట్టోద్దు,చచ్చిన పిట్టను తేనూవద్దు,కూరకులేకుండా రానూవద్దు "అన్నాడు మరోబాటసారి. " గుడ్లు "అన్నాడు శివయ్య. "అన్నిదేశాలకు ఇద్దరే రాజులు " అన్నాడు మరోబాటసారి. " సూర్య,చంద్రులు "అన్నాడు శివయ్య. "ఆకులోడుకాదమ్మ ఆకులుంటాయి,బాలింతకాదమ్మ పాలుంటాయి,సన్నాసోడుకాదమ్మ జడలుంటాయి "అన్నాడు మరోబాటసారి. "మర్రి చెట్టు "అన్నాడుశివయ్య. "మంచంకింద మామయ్య ఊరికిపోదాంరావయ్య" అన్నాడు ఒక బాటసారి. "చెప్పులు "అన్నాడు శివయ్య. "ఆకాశమంతా అల్లుకురాగా: చాటెడు చక్కలు చక్కలుగారాగా: కడవెడునీరుకారుకు రాగా: అందులో ఓరాజు ఆడుతుంటాడు " అన్నాడు మరోబాటసారి. "గానుగ "అన్నాడు శివయ్య.

"నాలుగు రోళ్ళు నడవంగా,రెండు చేటలు చెరగంగా,నోట్లో పాము వేళాడుతుండగా,మన రాజుగారు ఊరేగంగా "అన్నాడు ఒక బాటసారి.

" ఏనుగు " అన్నాడు శివయ్య. "ఊరికికలి,వీధిలోకలి,ఇంట్లోకలి,వంట్లోకలి" అన్నాడుఒక బాటసారి.

"చాకలి,రోకలి,వాకిలి,ఆకలి "అన్నాడు శివయ్య.

"సరే మీరు ఇప్పటిదాకా పొడుపుకథలు వేసారు నేను విప్పాను,నేను ఇప్పుడు పొడుపుకథవేస్తాను మీరువిప్పండి " అన్నశివయ్య. " సుబ్బన్న,సూరన్న,మల్లన్న,ఎల్లన్న,ఆఅన్న, ఈఅన్న,ఓరన్న వీళ్ళంతా తెల్లనివస్త్రాలు ధరించి కట్టకట్టుకునీ ఒకటిగా చచ్చారు "అన్నాడు శివయ్య .అక్కడఉన్నవారు ఎవరూ ఆపొడుపుకథ విప్పలేకపోయారు.

"చిన్నఉల్లిపాయ" అన్నాడు శివయ్యనవ్వుతూ.

భోజనానంతరం రాజుగారికి వందవరహల అబధ్ధం చెప్పదలచిరాజసభలో ప్రవేసించి "జయజయము మహరాజులవారికి,ఆరునెలలక్రితం నాకుభిక్ష వేయడానికి వచ్చిన మహరాణీగారికి నేను కాశీవెళుతూ వారివద్ద దాచమని ఇచ్చివెళ్ళిన వందవరహలు తిరిగినాకు ఇప్పించండి " అన్నాడు బిచ్చగాని వేషంలో ఉన్న శివయ్య.

" ఓరి ముష్టివెధవా అన్నానికిలేనినీవు వందవరహలు మహరాణిగారికి ఇచ్చావా? అబధ్ధం ఎంతచక్కగా ఆడుతున్నావు.అబధ్ధం ఆడినా నమ్మేటట్లుగాఉండాలి. అంతఃపురంలోఉండేమహరాణి నీకుభిక్షవేయడానికి వీధిలోనికి ఎలా వస్తుంది అబధ్ధాలపుట్టా ఇదినమ్మతగిన విషయమేనా? ఎవరైనావింటే ఇదినిజం అనుకుంటారా? ముమ్మాటికి ఇది అబధ్ధమే "అన్నాడు కోపంగా రాజుగారు.

"అయితేమహరాజా నేను మహరాణివారివద్ద వందరూపాయలు దాచినది విషయం అబధ్ధమైతే, నాకు వందవరహల అబధ్ధం బహుమతి ఇప్పించండి "అన్నాడు శివయ్య

కరతాళధ్వనులు చేస్తూ ఫక్కుననవ్వారు సభికులు .అందరితోకలసి ఆనందంగా నవ్విన రాజుగారు శివయ్యకు వందవరహలు ఇచ్చి సాగనంపాడు.

()హమీ: ఈకథ ఏభాషలోనూ ఏమాధ్యంమంలోనూ ఇప్పటివరకు ప్రచురింపబడలేదు)

మరిన్ని కథలు

Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్
Kshama lo dharitri
క్షమలో ధరిత్రి.
- Aduri.HYmavathisrinivasarao,
Marmam
మర్మం
- రాము కోలా దెందుకూరు
Korthi
కొర్తి
- బివిడి ప్రసాద రావు
Atrhata
అర్హత
- డి.కె.చదువుల బాబు
Antataa neeve
అంతటా నీవే
- షామీరు జానకీ దేవి
Ahakaram techhina sapam
అహంకారం తెచ్చిన శాపం
- గొట్టాపు శ్రీనివాస రావు