అమరావతి పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకుని ఉచిత వసతితోపాటు విద్యా భోధనతోపాటు తనఆశ్రమంలో వ్యాధిగ్రస్తులకు ,వృధ్ధులకు,నిరాదరులకు సేవలు చేయసాగాడు. ఒకరోజు సాయంత్రం తనబోధనలు వినడానికి వచ్చిన ప్రజలకు తను ప్రసంగిస్తూ...నాయనలారా బ్రహ్మచర్యం,గార్హస్ధ్యం,వానప్రస్ధం,సన్యాసం అనేవి ఆశ్రమధర్మలు.
బ్రహ్మచర్యం:బ్రహ్మచర్యాన్ని 'సావిత్రం'అంటారు.ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి.ఉపనయం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడురోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని 'ప్రజాపత్యం'అంటారు.తరువాతవేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని'బ్రహ్మమని'వేదాన్నిసంపూర్ణంగా అధ్యాయనంచేసి అనుష్టానం చేయడాన్ని'నైష్ఠికమని'అంటారు.
గృహస్ధాశ్రమం:గృహస్తులు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు.పొలం పండించుకు తినేవారిని'వార్త'అంటారు.యజ్ఞ సామాగ్రిని సమకూర్చు కోవడాన్ని'సంచయం'అంటారు.గృహస్తుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని'శాలీనం'అంటారు.పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని'శిలోంఛం'అంటారు.
వానప్రస్తం:కందమూలాలు తిని జీవించేవారిని.'వైఖానసులు'అంటారు. కొత్తపంటచేతికి అందగానే ఇంటఉన్న పాత ధాన్యాన్ని దానంచేసేవారిని'వాఖల్యులు'అంటారు.రోజుకు ఒక దిక్కున యాచనద్వారా జీవించేవారిని'ఔదుంబరులు'అని,పండ్లను,ఆకులను భుజించి జీవనంచేసేవారిని'ఫేనవులు'అంటారు.
సన్యాసులు:సొంతకుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని' కుటీచకులు' అని.కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని ' బహుదకులు' అని,కేవలంజ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని 'హంసలని' జ్ఞానంకూడా పొందకుండా,పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యే వారిని 'పరమహంసలు అంటారు.నేటికి ఇంతటితో స్వస్తి.అన్నాడు.
సదానందునిబోధనలు విన్న ప్రజలు తమశక్తికొద్ది ధనసహయం హుండిలో వేసివెళ్ళిపోయారు. పొరుగూరిలో అత్యంతధనవంతుడైన పరంధామయ్య ఒకమూలు దిగులుగా కూర్చొని కనిపించాడు సదానందునికి.
" ఏంనాయనా అలా చింతిస్తూ కూర్చున్నావు"అన్నాడు సదానందుడు.
" స్వామి ఈపరగణాలోఅత్యంత ధనవంతును నేను. నాఆస్తికోసం ఎదురుచూసేవాళ్ళేకాని,నాఆరోగ్యం గురించిఆలోచించేవారులేరు.రేపునేను వృధాప్యంలో మంచానా పడితే చూసేవాళ్ళులేరి "అన్నాడు.
" నాయనానేనుకూడాఒకప్పుడు నీలానే బాధపడ్డాను. ఇప్పుడు చూడు వందలమందికి నేనే ఆశ్రయం కలిగించాను.నాకు రేపటిగురించి ఆందోళనలేదు.పదిమందికి సహయాపడిననాకు రేపు ఎవరోఒకరు సహయం చేస్తారు. నీవుకూడా నిరుపయోగంగా నీవద్ద పడిఉన్న ధనాన్ని సమాజహితానికి వాడిచూడు అప్పుడు అంతానీవాళ్ళలాగానే అనిపిస్తారు"అన్నాడు సదానందుడు.
"స్వామీ రేపటినుండి మనఈ ఆశ్రమ నిర్వాహణ బాధ్యతలు,దానికి అయ్యే కర్చులు నేనే భరిస్తాను "అనివెళ్ళినపరంధామయ్య ,తనపరగణాలోని అన్ని గ్రామాలలో తన తల్లిగారి పేరిట ఉచిత పాఠశాలలు,తండ్రిగారి పేరిట అన్నివసతులు ఉన్న ఉచిత వైద్యశాలలు,తనపేరిట గ్రంధాలయాలు, సదానందునిపేరిట నిరాదరులకు ఆశ్రమాలు నిర్మించాడు.ఉన్నత విద్యకొరకు ఎందరికో ధనసహయంచేయసాగాడు, పేదరికంలోఉన్నవారిని ఆదుకోసాగాడు. కొద్దిరోజుల్లో పరంధామయ్యకు ఎనలేని కీర్త,గౌరవం లభించాయి తనకంటీకి కనిపించిన ప్రతివారు పరంధామయ్యను ఆప్యాయంగా పలుకరిస్తూ గౌరవంగా నమస్కారం చెయసాగారు. ఆపరగణాలో ప్రతిఇంట జరిగే కార్యక్రమాలకు పరంధామయ్యను ఆహ్వనించసాగారు.కాలక్రమంలో సదానందుడు చెప్పినట్లే తనకళ్ళళముందు కనిపించే వారుఅందరు తనవాళ్ళ లాగా కనిపించారు పరంధామయ్యకళ్ళకు.