భాషా కాలుష్యం - సి హెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు

Bhasha kalushyam

వ్యవసాయ నేపథ్యంతో, గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నుండి ప్రారంభమై యూనివర్సిటీ ఉన్నత చదువుల దాకా వచ్చిన వేమనకి, పట్టణ కాన్వెంట్ చదువులతో యూనివర్సిటీ చదువుల దాకా వచ్చిన సృజనేశ్వర్ , కైలాసగిరి పార్కు లో తారస పడ్డాడు."ఆదివారం వస్తే చాలు, చుట్టుప్రక్కల విలేజ్స్ నుండి వుమన్ ఫోర్క్ బాగా వస్తారిక్కడికి తెలుసా?" అన్నాడు. వేమన కొంచెం కంగారు పడ్డాడు."అంటే మీ అభిప్రాయం, చుట్టుపక్కల గ్రామాల్లోని ఆడవాళ్ళు, విమెన్ ఫోక్ (women folk) అని కదా!" అన్నాడు. అవును అన్నట్లుగా తలుపుతూ, " తరచు ఈ కైలాష్ మౌంటైన్ కి వస్తూంటారా మీరు?" అడిగాడు సృజన్. "లేదు. అప్పుడప్పుడు," అన్నాడు వేమన సాలోచనగా. సాధారణంగా సులువుగా పైకి చేరుకోగల ఎత్తయిన ప్రదేశాలని కొండ(hill),చాలా ఎత్తుగా వుండి అధిరోహించడానికి కష్టమైన హిమాలయాల వంటి వాటిని పర్వతాలు (mountains) అంటారని వేమన భావన. అందుకే అతను కైలాష్ మౌంటైన్ అనగానే ఆలోచనలో పడ్డాడు. దూరంగా కనిపించే బంగాళాఖాతం చూసి, ఇది బెంగాల్ నోషనా, అరేబియా నోషనా" ఆని అడిగాడు సృజన్. "బహుశా వీడికి దేశ సరిహద్దులు గురించి కూడా జ్ఞానం లేదు కాబోలనుకొని, వేమన అన్నాడు,"దేశానికి తూర్పు దిక్కున వున్న ఈ సముద్రం పేరు తెలుగులో బంగాళాఖాతం, ఇంగ్లీషు లో బే ఆఫ్ బెంగాల్ అంటారు అన్నాడు." యు మీన్ బంగాళాఖాతం ఈజీ కొల్టు బే ఆఫ్ బెంగాల్' " అన్నాడు సృజన్. 'ఈజ్ ఈక్వల్ టు' ని ఇలా కూడా అంటారు మాట అనుకొన్నాడు వేమన మనసులో. "మీరు సోషియల్ స్టడీస్ బాగా చదివారనుకొంటా! బే ఆఫ్ బెంగాల్ గురించి బాగా చెప్పారు." అన్నాడు సృజన్ మెచ్చుకోలుగా భుజాలు ఎగురేస్తూ. "మీరనుకొంటున్నట్లు సోషియల్ స్టడీస్ కాదు, సోషల్ స్టడీస్ పదో తరగతి వరకు చదివాను". అన్నాడు వేమన బదులుగా. ఆతని మాటలు పూర్తిగా వినకుండానే మళ్ళీ సృజన్, "బట్, మీరు ఇంగ్లిష్ లో కూడా బాగా 'కంఫర్ట్ బుల్ గా టాక్ చేస్తున్నారు. అంటే,టెల్గు మీడియా కాదు, ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియం కదా!"అన్నాడు ఉత్సాహంగా. "నేను తెలుగు మాధ్యమంలోనే చదివా. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నా. అందుకే 'కంపటబుల్ ' గానే మాట్లాడగలను." అన్నాడు నవ్వుతూ . కొంచెం సేపు పరిసరాలను గమనించి, వేమన కేసి చూస్తూ అడిగాడు సృజన్," ఈ ' ఎన్విరాన్ మెంట్ 'నాకు బాగ నచ్చింది. మీకూ షేమ్ టు షేమ్?" "నాకూ ఈ 'ఎన్వైరన్ మెంట్' నచ్చింది. కానీ షేమ్ టు షేమ్ కాదు." అంటూ చటుక్కున లేచి వెళ్లిపోయాడు అక్కడ నుంచి వేమన. ఈనాడు భావ దారిద్ర్యం, భాషా కాలుష్యం మన తెలుగు జాతికి పట్టిన కనిపించని అంగ వైకల్యం. "తెలుగు తల్లీ! అమ్మా! మమ్మల్ని కాపాడు". అనుకొంటూ భారంగా నడిచాడతడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు