అవంతి రాజ్యంలో జరుగుతున్న దసరా వేడుకల సభలో ఎందరో తమ కళాకారులు,తమవిద్వత్తు,ప్రతిభ రాజుగారిముందు ప్రదర్శించి సముచితరీతిన బహుమతులు పొందసాగారు. అలారాజుగారితోపాటు, నరప్రముఖులనుండి పలు బహుమతిపొందిన ప్రముఖ కవి నాగభూషణం తనకు లభించిన ధన,కనక,వస్తువులతో సహ తను ఒకగుర్రంపైన గుర్రాలపై రెండువైపులా పెద్దసంచుల నిండుగా బయలుదేరాడు.కానిబహుమతులు రెండు గుర్రలపై సంచులనుండి నుండి కిందపడే అవకాశం ఉన్నందున,మంత్రి ఒక సైనికునిపిలిచి ''ఈకవిగారి బహుమతులు ఉన్నగుర్రంవెనుకనే నువ్వు నడుచుకుంటూ వాళ్ళఊరిదాకా కావలిగావెళ్ళిరా దారాపొడవుని కవిగారు ఏంచెప్పినా విని అలానే చేయి !"అన్నాడు.బుద్దిగా తలఊపాడు సైనికుడు.
ముందు తనుగుర్రంపైన నాగభూషణం బయలుదేరుతూ 'ఇదిగో సైనికుడా కిందపడిన ప్రతిదానిని సంచుల్లో వేయి 'అని బయలుదేరాడు. బహుమతులుఉన్నగుర్రం వెనుక సైనికుడు కాలినడకకొనసాగించాడు. అలా కొందదూరం ప్రయాణం చేసాక దారి ఎత్తు,పల్లాలతో ఉండటంతో,గుర్రంపై సంచులనిండుగా బహుమతులు ఉండటంతో కొన్ని బహుమతులు కిందపడసాగాయి.
అలా దారిపొడవునా కిందపడుతున్న ప్రతిదానిని తిరిగి సంచుల్లోవేస్తూ,నాగభూషణంగారి గ్రామం చేరి ,రెండుగుర్రాలపైఉన్న నాలుగు బహుమతి సంచులను నాగభూషణం గారిఇంటిలోని ఉయ్యాల బల్లపై ఉంచిన సైనికుడు 'అయ్యగారు మనం బయలుదేరిన దగ్గరనుండి ఇప్పటివరకు కిందపడిన అన్నింటిని సంచుల్లో భద్రపరిచాను "అన్నాడు వినయంగా.ఉయ్యాలబల్లపైన ఒకసంచిలోని వస్తువులను ఉయ్యలబల్లపై గుమ్మరించిన కవి నాగభూషణం అవిచూసి నివ్వెరపోయాడు. నాగభూషణంకుటుంబసభ్యులు పెద్దపెట్టున నవ్వారు, బహుమతులతోపాటు కనిపించిన గుర్రపు లద్దె లను చూసిన నాగభూషణం నవ్వుతూ 'ఇదేంమిటి నాయనా గుర్రం లద్దెలుకూడా బహుమతుల్లో ఉన్నాయి "అన్నాడు. "తమరేకదా రెండుగుర్రానుండి ఏదికిందపడినా బహుమతులసంచిలో వేయమన్నారు "అన్నాడు అమాయకంగా సైనికుడు.
మరోమారు అక్కడ ఉన్నవారంతా పకపకలాడారు.