ఆదివారం తనయింటి అరుగు పైచేరిన బాలలకు మిఠాయిలు పంచిన తాతగారు 'బాలలు సమాజానికి వినియోగపడని విద్య,ధనం,జీవితం వృధా.కోటిరూపాయలు సంపాదించి దాచుకోవడం వలన దాచిన వారే ఆనందించ గలుగుతారు.ఆధనంతోఒసంస్ధ స్ధాపించి పదిమంది బ్రతుకుతెరువు చూపించడంలో గొప్పతనంఉంది.సేవాగుణాన్ని సాటి ఈసృష్టిలో మరేది లేదు,మరేదిరాదు.ఈ సమాజానికివినియోగ పడని విద్య,ధనం,మేధస్సు వృధా.గుణహీనుడు ఎన్నిచదువులు చదివినావృధా! పరిమళ ద్రవ్యాల మూటలు మోపునకట్టుకుని మోసినంత మాత్రాన గాడిద-గజరాజు కాలేదుకదా! తొండం ఉన్నంతమాత్రాన దోమ ఏనుగు కాలేదుగా?......
పూర్వం అమరావతి అనేఊరిలో శివయ్య అనే అతను తను పలుసంవత్సరాలు శ్రమించి నీటి పైనడవగలిగే విద్యనేర్చుకున్నాడు. అదిప్రదర్మిస్తూ వచ్చినధనం తో పొట్టనింపుకుంటూ జీవిస్తూ, దేశాటన చేస్తూ ఓనగరం చేరుకున్నాడు.
అక్కడ ఉన్న నదిలో తన విద్యప్రదర్మించి అందరిని యాచనచేస్తూ చివరిగా చెట్టుక్రింద స్వామిజి వద్దకు వచ్చాడు. ''స్వామి నేను పలు సంవత్సరాలు శ్రమించి నీటిపైనడిచే విద్య అభ్యసించాను'' అన్నాడు గర్వంగా.స్వామిజి చిరునవ్వుతో ''నాయనా కొద్దిపాటి ధనం ఇస్తే పడవ లో సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు,నువ్యు ఇలా నదిలో నీటిపై నడవడం ఎంతప్రమాదమో ఆలోచించావా నీవిద్యప్రదర్మించేసమయంలో మొసలి వంటి జలచరాలవలన ప్రమాదం పొంచిఉంది.ఈవిద్యకోసం యవ్వనమంతా త్యాగం చేయాలా? ఇంతాచేసినేర్చినవిద్య నీకు ఎందుకు వినియోగపడుతుంది యాచనకా?మనిషిజీవితం చాలాగొప్పది,నీతి,
నిజాయితి,నిర్బయంగా,ఉన్నతంగా,తృప్తికరంగాఆనందమయమైనజీవితంఅనుభవించాలి, ఆసంతోషకరమైన జీవితంలో కొంతసమయం సమాజసేవకు వినియోగించాలి.మనషిజీవితలక్ష్యంఅది,తెగినగాలిపటంలా వెళుతూ లక్ష్యంలేని జీవితం అనుభవిస్తూ నువ్వు ఏంసాధించావు. ''అన్నాడు స్వామి.
" మన్నించండి స్వామి చెప్పేవారులేక నాజీవిత సమయాన్నివృధా చేసుకున్నాను.నాలాగా ఎందరో మనిషిజన్మవిలువ తెలుసుకోలేక తమ జీవితాలను నిరర్ధకం చేసుకుంటున్నారు. శేషజీవితం సమయాన్ని సమాజ హితానికి వినియోగిస్తాను''అన్నాడుశివయ్య.
'' పెద్దలే పిల్లల అభిరుచిమేరకు వారిజీవిత గమనం, లక్ష్యం,నిర్ధేసించాలి'' అన్నాడు స్వామి.
''కథబాగుంది తాతయ్యగారు'' అన్నారుపిల్లలు.''బాలలు ఆస్వామి పేరు రామకృష్ఞ పరమహంస'' అన్నాడు తాతయ్యగారు.