మరణించాక జీవించడం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Maraninchaka jeevinchadam

అవంతిరాజ్య పొలిమేరలలో సదానందుడు ఆశ్రమం నిర్మించుకుని ఉచిత విద్యాదానం చేస్తుండేవాడు. అశ్రమానికి వచ్చి సదానందుని బోధనలు వింటూ తమ సమస్యలు విన్నవించుకుని సముచిత సలహలు తీసుకువెళుతుండేవారు అక్కడి ప్రజలు.

ఒకరోజు సాయంత్ర సదానందుడు..."నాయనలార... పూర్వం అంగ, వంగ, కళింగ, కుళింద, కాశ్మీర, నేపాళం, భూపాల, పాంచాల, పాండ్య, బర్బరీ, కిరాత, విదేహ, విదర్బ, మళయాళ, గౌళ, గాంధార, కురు, కేరళ, మగధ, కొంకణ, సిందు, సౌవీర, ఆంధ్ర, ఛేది, సాల్వ, కోసల, సౌరాష్ట్ర, మత్య, సూరసేన, సుంహ్మ, కౌశంబి, పుళింద, లాట, కర్ణాటక, త్రిగర్త, బృహద్దద, యవణ, టెంకెణ, దశార్ణవ, పౌండ్ర, బాహ్లీక, ద్రావిడ, కాంభోజ, ఘూర్జుర, కైకేయ, అవంతి, చోళ, సింహళ, కుంతల, నిషిద, పార్శన, కామరూప, భోజ, మాళ్వ, విరాట, మ్లేచ్చ, అమరావతి, వంటి పలు రాజ్యాల విద్యార్ధులు మీలో ఉన్నారు. ఏదైనా అభ్యాససించేటప్పుడు విద్య అవుతుంది. అదే విద్య నైపుణ్యంతో ప్రదర్మిస్తే కళ అవుతుంది. కళలు అంటే అరవై నాలుగు... ఇతిహాసం, ఆగమం, కావ్యం, అలంకారం, నాటకం, గాయకత్వం, కవిత్వం, కామ శాస్త్రం, దురోదరం, దేశభాషా లిపి పరిజ్ఞానం, లిపికర్మం, వాచకం, అవధానం, సర్వశాస్త్రం, శాకునం, సాముద్రికం, రత్నశాస్త్రం, రథాశ్వగజకౌశలం, మల్లశాస్త్రం, సూదకర్మం, దోహదం, గంధవాదం, ధాతువాదం, ఖనివాధం, రసవాధం, జలవాదం, అగ్నిస్తంభం, ఖడ్గస్తంభం, జలస్తంభం, వాక్సంభం, వయస్త్సంభం, వశ్యం, ఆకర్షణం, మోహనం, విద్వేషణం, ఉఛ్ఛాటనం, మారణం, కాలవచనం, పరకాయప్రవేశం, పాదుకాసిధ్ధి, వాక్సిధ్ధి, ఘటికాసిధ్ధి, ఐంద్రజాలకం, అంజనం, దృష్టివంచనం, స్వరవంచనం, మణిమంత్రౌషదాది సిధ్ధి, చోరకర్మం, చిత్రక్రియ, లోహక్రియ, అశ్మక్రియ, మృత్క్రియ, దారుక్రియ, వేణుక్రియ, అంబరక్రియ, అదృశ్యకరణం, దూతీకరణం, మృగయ, వాణిజ్యం, పాశుపాల్యం, కృషి, ఆసవకర్మం, ప్రాణిద్యూతకౌశలం వంటివి...

మనం ఎలా జీవించాలో ప్రకృతి మనకు నేర్పుతుంది. ఉదాహరణకు తీయ్యని ఫలాలను ఇస్తూన్నా చెట్టును రాళ్ళతో కొడుతున్నా ఓర్చుకునే చెట్టును చూసి ఓర్పు తెలుసుకొండి. తేనె సేకరణకు సుదూరంగా అలసట తెలియకుండా ప్రయాణంసే తేనెటీగను చూసి గమ్యాన్ని అన్వేషించండి. దారిలో ఎన్నిఅడంకులు ఎదురైనా తన గమ్యన్ని చేరే నదీ ప్రవాహన్నిచూసి మీలక్ష్యం నిర్ణయించుకొండి. కొందరి జీవితాలు మరణానంతరమే ప్రారంభం అవుతాయి" అన్నాడు.

సమయంలో ఒక విద్యార్ధి "గురుదేవ తమరు బోధనలో మరణించాకే జీవితం అన్నారు అంటే ఏమిటి? మరణం తరువాత జీవితం ఎలాసాధ్యం నాకు అర్ధం కాలేదు. దయచేసి వివరించండి "అన్నాడు.

" నాయనా అరటిచెట్టు,చందనంచెట్లలో ఏ చెట్టు గొప్పది? " అన్నాడు సదానందుడు.

"చందనం చెట్టే విలువైనది ఇది అందరికి తెలిసిన విషయమే కదా!"అన్నాడు విద్యార్ధి.

"మరి ప్రతి శుభకార్యానికి అరటి చెట్టునే గుమ్మాలకు కడతారు. తాంబూలం సమర్పించే సమయంలో తమలపాకుతో అరటిపండు సమర్పిస్తారు. అరటి ఆకులోభోజనం చేస్తారు. అరటి పువ్వు , అరటిచెట్టు దంటు వంటకాలలో వినియోగపడుతుంది. అరటిచెట్టు నారగా కూడా వాడబడుతుంది. ఆయుర్వేదంలో అరటికి సముచితస్ధానం ఉంది. అయినప్పటికి అరటిచెట్టు ఒకసారి కొట్టివేయబడి మరణించిందంటే ఆచెట్టు జీవితం అంతటితో ఆగిపోతుంది. కానీ చందనం అలాకాదు తను మరణించిన తరువాతే దాని జీవితం ప్రారంభం అవుతుంది. చందనం నుండి సుగంధం పరిమళాలు, బోమ్మలు, పలురకాల వాద్యపరికరాలు, ఆయుర్వేద మందులు, లేపనాలు వంటివి తయారు చేస్తారు. ఇక్కడ మనం గమనించవలసినది అరటి చెట్టునుండి తయారు చేయబడినది ఏది శాశ్వితంకాదు, చందనంచెట్టు నుండి తయారు చేయబడినది ప్రతిది ఘనమే, శాశ్వతమే! మరణించి కూడా అరటి అన్నింటా మనకు వినియోగపడినా ఈలోకంలో దానికి మరణానంతరం జీవితంలేదు. చందనం మరణించి వస్తురూపంలో తనజీవితాన్నిసార్ధకం,శాశ్వితత్వం కలిగించుకుంది. మరో ఉదాహరణ శిబిచక్రవర్తి, కర్ణుడు, హరిశ్చంద్రుడు వంటి మహనీయులు ఈ లోకంలో శాశ్వితస్ధానం పొందారు. వారిమరణం అనంతరంకూడా నేటికి స్మరిస్తున్నాము అంటే అదే మరణించాక జీవించడం" అన్నాడు సదానందుడు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు