మగధ రాజ్యంలో రత్నసాగరుడు అనే వ్యాపారి ఉండేవాడు.అతను సుగంధ ద్రవ్యాలు ఇతరదేశాలకు ఓడపై తీసుకువెళ్ళి అమ్మి, తిరిగి వస్తూ తమ రాజ్యంలోలభ్యంకానివి, అవసరమైన సరుకులు అక్కడ కొనుగోలు చేసుకుని తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉండేవాడు.ఇతని దగ్గర శివయ్య అనే యువకుడు నమ్మకంగా చాలాకాలంగా పనిచేస్తూ ఉండేవాడు.
ఓ పర్యాయం వ్యాపారానికి ఓడలో సరుకు నింపి బయలుదేరబోతున్న సమయంలో రత్నసాగరుని ఆరోగ్యం బాగాలేకుండా పొయింది.
''అయ్యా తమరు వైద్యుని సలహా మేరకు ఇంటి పట్టున విశ్రాంతి తీసుకొండి తమతో కలసి చాలాకాలంగా పనిచేస్తూవ్యాపార మెళకువలు చాలా తెలుసు కున్నాను ఈ ఒక్కసారికి నేను వెళ్ళి వ్యాపారం పూర్తి చేసుకు వస్తాను అనుమతించండి'' అన్నాడు శివయ్య.
నమ్మకస్తుడు అయిన శివయ్యను''అలాగే'' అని పంపించాడు రత్నసాగరుడు.
సరుకుతో ఓడలో వెళ్ళిన శివయ్య గడువు లోగా రాకపోవడంతో అతను ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో అని ఆందోళన పడసాగాడు రత్నసాగరుడు.
పదిరోజుల అనంతరం శివయ్య క్షేమంగాతిరిగి వచ్చాడు. "గాలివానలో తమ ఓడ దారితప్పడం వలన ఆలస్యం అయిందని,ఈసారి వ్యాపారంలో మరింత ధనం వచ్చింది ఆధనంతో మనదేశంలో లభ్యంకాని సరుకులు తీసుకువచ్చాను ''అన్నాడుశివయ్య .ఆసరుకులు అమ్మిన రత్నసాగరుడు మరింత ధనం సంపాదించాడు.
అతని నిజాయితీకి సంతోషించిన రత్నసాగరుడు ''నాయనా నేను పెద్దవాడిని అయ్యాను వయసురీత్యా ఇకపై వ్యాపారం చేయలేను నీకు నాఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తాను.ఇకనుండి నా వ్యాపారం, ఆస్తి కాపాడుకునే బాధ్యతనీదే''అన్నాడు.
మౌనంగా చేతులు జోడించాడు శంకరయ్య.
వివాహానంతరం రత్నసాగరుడు ఊరిలోని వారికి ఇచ్చి అప్పులు చిట్టా చూసి ఆశ్చర్యపోయాడు.చాలాకాలంగా రాని మెండిబాకీలు ఎలాగైనా వసూలు చేయాలని నిర్ణయించుకుని భార్య,అత్తమామలతో మాట్లాడి పెద్దఎత్తున విందు ఏర్పాటు చేసి బాకీదారులను అందరిని ఆవిందుకు ఆహ్వానించాడు రత్నసాగరుడు.
విందుకు వచ్చినవారందరికి ఆహ్వానం పలుకుతూ శంకరయ్య 'మాఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీఅందరికి స్వాగతం.నేను వ్యాపారంకొరకు వెళ్ళివస్తుంటే లక్షల బంగారు నాణాల నిధి లభించింది.ఆనిథి తీసుకుని వస్తున్న నావ మరో పదిరోజుల్లో రాబోతుంది. మామయ్యగారు తన మిత్రులు చాలా మంది ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని వారికి వడ్డిలేకుండా రెండు సంవత్సరాల కాలపరిమితిలో అయిదువేల వెండి నాణాలు సహయం చేయమన్నారు.ధనసహయం కావలసినవారు మా వాళ్ళవద్ద మీపేర్లు నమోదుచేసుకొండి కాని ఒక చిన్ననిబంధన ఇప్పు అప్పు తీసుకునే వారు గతంలో మాకు ఎటువంటి బాకీలు ఉండకూడదు. పాతబాకీ చెల్లించిన వారికే,కోత్త అప్పు ఇవ్వబడుతుంది'అన్నాడు శంకరయ్య.
మూడురోజుల్లొ పాత మెండిబాకీలు అన్నివసూలు అయ్యాయి.పాత బాకీ చెల్లించిన ప్రతివారు కొత్త అప్పుకోసం తమపేర్లు నమోదు చేసుకోసాగారు.
పదిరోజుల అనంతరం తమ నిథి తీసుకువస్తున్ననావ గాలివాన చిక్కుకుని మునిగిపోయిందని విచారం వెలిబుచ్చాడు శంకరయ్య.
మొండిబాకీలను కొత్త అప్పులపేరున తెలివిగా వసూలు చేసిన శంకరయ్యను అభినందించాడు రత్నసాగరుడు.