అమరావతి నగరంలోని అటవి శాఖాధికారిగా పనిచేసిన విశ్రాంత అధికారి రాఘవయ్య తనవీధి అరుగుపై చేరిన ఆవాడకట్టు పిల్లలకు మిఠాయీలు పంచి'బాలలు బాధ్యత తెలియని వ్యెక్తులు సమాజానికి భారం.
ప్రేమ ఉన్నచోట అహం ఉండకూడదు.స్నేహం ఉన్నచోట "విలువలు" అడ్డు రాకూడదు. బంధం ఉన్నచోట ధన బేధం ఉండకూడదు.
బాధ్యత ఉన్నచోట బరువు అనిపించకూడదు.లక్ష్యం ఉన్నచోట కాదు, కూడదు, అనే పదాలు ఉండకూడదు.గెలిచాము అనే గర్వం ఉండకూడదు .ఓటమి అని దిగులు ఉండకూడదు.ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి మొహమాటం ఉండకూడదు.ఇంటి పక్కన ఉన్నవారిపై కుల్లు ఉండకూడదు.ఎదిగే వారిని చూసి అసూయ ఉండకూడదు.
మన అనుకున్న వారి దగ్గర భయం ఉండకూడదు.అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు.
ఇవన్ని మనిషికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. మనిషికి తనబాధ్యత తెలియజేసేకథ చెపుతాను.......
పూర్వం రంగయ్య అనే విశ్రంత ఉద్యోగి ఉండేవాడు.అ తనిపెద్దకుమారుడు శివకుమార్ చదివి చక్కగా ఉద్యోగం చేస్తుండటంతో వివాహంచేసాడు. బుజ్జిబాబు బాగా చదివి,కంప్యూటర్ శిక్షణ పొందినప్పటికి, బాధ్యతలేకుండా ఇంటి విషయాలు పట్టించుకోకుండా అందినంతవరకు ఇంట్లో డబ్బులు తీసుకువెళ్లి ,స్నేహితులతో కలసి తిరుగుతూ,సినిమాలు,షికార్లుకొడుతూ ఉండటంతో ఎంతచెప్పినా మారని బుజ్జిబాబుతో విసిగిన రంగయ్య ,ఒకరోజు బుజ్జిబాబును పిలిచి'బాబు నాఆరోగ్యం బాగాలేదు నేను హైదరాబాద్ లోనిమా అన్నయ్యగారి ఇంట్లో ఉండి వైద్యశాలకు వెళతాను..అన్నయ్య పనికివెళుతున్నాడుకనుక ఈమాసం నుండి ఇంటి అవసరాలు నువ్వు గమనించాలి.ఇవిగో బీరువాతాళాలు,ఇంటి బంగారంఅంతా విలువైన వస్తువులు అందులోఉన్నాయి.ఇవిగో చెక్కులు,ఆరోగ్యం కుదుటపడిన తరువాతవస్తాను'అని ఊరు వెళ్లిపోయాడు రంగయ్య.
ఆమాసంనుండి ఇంటిఅవసరాలు గమనించసాగిన బుజ్జిబాబు తండ్రి మాసానికి సరిపడా ఇచ్చినడబ్బు చాలక చాలా ఇబ్బందిపడసాగాడు. స్నేహితులతో తిరగటాలు తగ్గిపోయాయి.చేతిలోడబ్బులేక ఇంటి అవసరాలు తీర్చలేక సతమత అవసాగాడు బుజ్జిబాబు.మరలా బ్యాంకుకు వెళ్ళలంటే చెక్కులపై వచ్చేనెలతేదిఉంది.ఆర్దిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అయినబుజ్జిబాబు ఇంటి పరిస్ధితులు చక్కపరచడంకోసం తను కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగంలోచేరాడు.ఇంట్లో ఆర్దిక అవసరాలు సర్దుకున్నాయి. రెండు మాసాలు గడచాయి.ఒకరోజున ఇంటికివచ్చాడు రంగయ్య. 'నాన్నగారు ఆఫీసులో పనివత్తిడి ఎక్కువగా ఉంది.అందువలన ఇంటి బాధ్యతలు మీరే నిర్వహించండి'అన్నాడు బుజ్జిబాబు.
ఫక్కున నవ్విన రంగయ్య''నాయనా హక్కులు కోరుకునేవారు బాధ్యతలను విస్మరించకూడదు.రెక్కలు వచ్చాక పక్షులుకూడా తమపిల్లలను గూటి నుండి బైటకు పంపించివేస్తాయి .నీకుబాధ్యత తెలియడంకోసం నేను ఊరువెళ్లాను.మనిషి జీవితానికి క్రమశిక్షణ,సంపాదన ఎంతముఖ్యమో నీకుతెలిసిందిగా " అన్నాడు .
" నాతప్పు తెలుసుకున్నా నాన్నగారు "అన్నాడు బుజ్జిబాబు.
పిల్లలు అందరు ఆనందంతో కేరింతలు చేసారు.