దేవుడు మెచ్చేపని . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Devudu mechche pani

అమరావతినగరంలోని అటవీశాఖ విశ్రాంత ఉద్యోగి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలునీతికథ వినడానికి చేరారు. అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్య'బాలలు ఈసృష్టిలో మనిషి చాలా గొప్పవాడు.తనఅవసరానికి మాట్లాడేవిధంగాభాషను, సాహిత్యాది కళలను ఏర్పరచుకున్నాడు.వృత్తినిబట్టి కులాలను.పూజించేవిధానాన్నిబట్టి మతాన్నఏర్పరచుకున్నాడు.ఏకులం గోప్పదికాదు.ఏమతం తక్కువది కాదు. ఇవన్నిఓకరినిఒకరు గౌరవించుకోవడానికి ఏర్పచుకున్నవే. నదులుఅన్ని సముద్రంలోకలసినట్లే అన్నికులాల,మతాలవారు ఈనేలలో చివరకు చేరవలసిందే. ఏమతంబోధించినా దానిసారాంశం 'మానవసేవే మాధవసేవ' అనిబోధిస్తాయి. తల్లిగురించి... కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ అంటాము. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడాఅంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి. పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి. సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది. పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

పంచమాతలు.

ధరణీ నాయకు రాణియు

గురు రాణియు నన్నరాణి కులకాంతను గ

న్న రమణి దనుగన్నదియును

ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త), కన్న తల్లి - వీరిని పంచమాతలుగా భావించవలెను అని కుమార శతకము నుండి పద్యము.

మరి కథలోనికి వెళదాం .....

ఒకరోజు శబరిమలై వెళ్ళివస్తున్నభక్తులు వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొనడం దానిలోని భక్తులు అంతాగాయాలపాలైయ్యారు.కొందరికి రక్తస్రావంజరిగింది.అదేసమయంలో 'నమాజు'కువెళుతున్న ఉస్మాన్ బాషా అక్కడికిచేరుకుని తనసుమో వాహనంలోగాయపడినవారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాడు.కొందరు అయ్యప్పభక్తులకు రక్తం కవలసివచ్చింది,దగ్గరలోని క్రిష్టియన్ హాస్టల్ లోని యువకులకు పరిస్ధితివివరించాడు బాషా.వెంటనే కొందరు యువకులు వైద్యశాలకు వచ్చి వైద్యులు కోరిన గ్రుపురక్తాన్నిఇచ్చివెళ్లారు.మరుదినం అయ్యప్ప భక్తులు అందరు సంతోషంగాతమఊరు వెళ్ళిపోయారు.

సాయంత్రంనమాజుకు వెళ్ళిన బాషాని''భయ్య ఎనాడు రెండుపొద్దుల నమాజు మానని నీవు నిన్నరాకుండా అపరాధంచేసావే''అన్నారు మిత్రులు. ''సోదరులారా అల్లా సాటివారికి సహయపడే అవకాశం నిన్ననాకు కలిగించాడు.ఏమతంలోనైనా ఆపదలో వారిని ఆదుకోమనే చెపుతారు.నిన్ననేను చేసింది దేముడు మెచ్చేపని''అని మసీదులోనుండి ఇంటికి వెళ్లాడు.

'బాలలుకథవిన్నారుగా!ఇలాకులమతాలకు అతీతంగా మీరుజీవించాలి. ఏనాడు మీజీవితాలలో కుల,మత వైషమ్యాలకు చోటుఇవ్వకండి'అన్నాడు రాఘవయ్య.బుధ్ధిగా తలఊపారు పిల్లలు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు