బారెడు ఎండఎక్కిన తరువాత వచ్చిన కుందేలును చూసిన కోతి చెట్టుదిగివస్తూనే బావురుమన్నాడు." ఏడవబోకు ఏజరిగింది ? "అన్నాడు
కుందేలు. "ఈఅడవిలో జంతువులన్నింటికి దెయ్యంపట్టింది. ఈరోజు తెల్లవారిందిమొదలు నాదగ్గరకు వచ్చిన ప్రతి జంతువు పిలవడం,నేను చెట్టుదిగిరావడం వాళ్ళు నన్ను తన్నిన దగ్గర తన్నకుండా తన్నారు,గుర్రం బాబాయి లాగిపెట్టితన్నినా అంతబాధవేయలేదు కానీ ఆతోడేలుగాడుమరీ ఆవేశం పట్టలేక నాతోక సగం కొరుక్కువెళ్ళాడు చూడు అదిమరీ అవమానం అనిపించింది."అని మరోమారు కన్నీళ్ళుపెట్టుకున్నాడు కోతి.
"అల్లుడు రాత్రి అడవి జంతువుల పిల్లలను కూర్చోపెట్టి కథచెప్పావటగా? "అన్నాడు కుందేలు. "ఏంమామ పిల్లలకు కథచెప్పడం తప్పా? "అన్నాడు కుందేలు.
" పిల్లలకు రాత్రులు దెయ్యాలకథలు చెప్పి ఇంటికి పంపించావు,వాళ్ళు భయంతో పక్కతడుపుతూ తెల్లవార్లు బిత్తరచూపులుచూస్తూ, పిచ్చిచేస్టలతో ఏడ్వసాగారట అందుకే వాళ్ళతల్లితండ్రులు నీకు వడ్డించిన వద్ద మరలావడ్డించకుండా వడ్డించి వెళ్ళారు .పాపం ఆతోడేలు పిల్లభయంతో మూర్చపోయి ఇంకాలేవలేదట "అన్నాడు కుందేలు."అంతేలే పళ్ళు ఉన్న చెట్టుకేగారాళ్ళదెబ్బలు, ఈలోకంలో నాలాంటి ఉత్తములకు ఈకష్టాలు తప్పేలాలేవు" అన్నాడు కోతి.
'' పోటీ ఈతలో ఇంకా ఉన్నారా ఇక్కడే అక్కడ వాళ్ళు బహుమతి రాజుగారు ఇచ్చే పోతారు కొట్టుక '' అన్నది పిల్లరామచిలుక. " ఇదో తిక్కలది, ఏది అర్ధమైఏలాచెప్పదు. అంతావెనుకముందు.చిట్టితల్లి నువ్వుచెప్పిది ముక్క అర్ధమైతే ఒట్టు "అన్నాడుకోతి. "రాజుగారు
పెట్టిన ఈతలపోటి గురించి అది చెపుతుందిలే ,పోటిసాయంత్రంకదా ?మేమువస్తున్నాంలే నువ్వు పద "అన్నాడు కుందేలు ."మామ మనఅడవిలో నీళ్ళున్న చెరువు ఒకటే అందులోకి మొన్నవచ్చిన వరదలకు మొసళ్ళు వచ్చి చేరాయి. ప్రాణాలపై ఆశఉన్న వాళ్ళేవరైనా ఆచెరువులో ఈతకు దిగుతారా? "అన్నాడుకోతి"
"ఈతకు దిగేవాళ్ళకు ఆభయంఉండాలి కాని ఒడ్డున ఉండిచూసేవాళ్ళకు మనకు ఎందుకుభయం? "అన్నాడు కుందేలు. "అంతేలే మనకు ఎందుకు భయం పద "అని కుందేలు,కోతి చెరువుకు బయలుదేరాయి.
చెరువు ఈవతల గట్టున అడవిలోని జంతువులన్ని నిలబడిఉన్నాయి.
"మిత్రులారా ఈచెరువులోని ముసళ్ళును తప్పించుకుంటూ ఈగట్టునుండి
ఆవతలగట్టుకుఈదుతూ క్షేమంగా చేరినవారిని వారంరోజులు ఈఅడవికి రాజును చేస్తాను" అన్నాడు సింహరాజు. అక్కడ ఉన్నజంతువులన్ని భయంతో వెనక్కుతగ్గయి. "అరేరే శరభ శరభ "అంటూ ఎగిరి నీళ్ళలో దూకి ,భయంతో కిచకిచలాడుతూ వెగంగా ఈదుకుంటూ అవతల గట్టుకు చేరి ,వెనుతిరిగి చూసుకున్నకోతికి తోకలేదు. చెరువులోఉన్న ముసలిఏదో పూర్తిగా కొరికింది. జంతువులన్ని ఆనందకేరింతలు చేస్తుండగా,అక్కడకు వచ్చింది కోతి. "అభినందనలు అల్లుడు నీలో ఇంతధైర్య సాహసాలు ఉన్నాయని నేను ఎన్నడు ఊహించలేదు"అన్నాడుకుందేలు. " ధైర్యమా పాడా? మామా, నన్ను నీళ్ళలోనికి తోసింది ఆతోడేలుగాడే ఏడివాడు" అన్నాడు. "వాడెప్పుడో పెళ్ళాం,పిల్లలతో అడవి వదలి పారిపోయి ఉంటాడు" అన్నాడు కుందేలు.
"మనకు సంబధంలేని పనులలో తలపెడితే ఏంజరుగుతుందో తెలిసింది మామ"అన్నాడు తనమొండితోకను చూసుకుంటూ కోతి .