అమరావతి నగరంలో తనయింటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యతాత"బాలలు తప్పుడు సలహాలవలన ఎటువంటి తిప్పలు వస్తాయో తెలిపేకథ చెపుతానువినండి.
శివయ్యఅనే కిరాణ వ్యాపారి మనఊరిలో కిరాణా అంగడి నడుపుతూ ఉండేవాడు. అంగడిలో అమ్మకాలు అతని భార్యచూసుకునేది.వారానికి ఒకరోజు పక్కనేఉన్నగుంటూరు పట్టణంలోని సంతలో తనకుకావలసిన సరుకులు కొనుగోలు చేసి,తనఒంటిఎద్దుబండిపై వేసుకుని వచ్చి,అమరావతి పరిసరాలలోని గ్రామాల అంగడులకు సరుకును తనఇంటి గాడిదపై వేసుకువెళ్ళి అందజేసివస్తుండేవాడు.అలాకొద్ది రోజులుగడిచినఅనంతరం,అతనిగాడిద ఎద్దునుచూసి అన్నామన యజమాని స్వార్ఢపరుడు మన శ్రమతో ఎంత ధనవంతుడు అయ్యాడో తను మాత్రం సుఖమైన జీవితంఅనుభవిస్తూ మనకు మాత్రం గడ్డివేస్తూ, నీళ్లు పోస్తున్నాడు.అతని చేసేఈఅన్యాయాన్ని మనం ఎదిరించవలసిన సమయంవచ్చింది.నీకష్టం చాలాగొప్పది సరుకులబండి లాగడంవలననీ మెడపైన గాయం ఏర్పడింది అయినప్పటికి మనయజమాని కొద్దిగా పసుపు గాయంపైన వేసాడు. నేనునీకు మంచిసలహయిస్తాను వినిపాఠించు సుఖఃపడతావు"అన్నదిగాడిద. " తమ్ముడు నాకుబాధగానే ఉంది.వారానిఒకరోజు కావడంవలన పెద్దగా కష్టంఅనిపించడంలేదు. చెప్పునీసలహా ఆచరణయోగ్యంగాఉంటే తప్పకపాఠిస్తాను "అన్నది ఎద్దు."మరేంలేదు రేపు ఉదయం సంతకువెళ్ళడానికి మనయజమాని బండిసిధ్ధంచేసి నీకుపచ్చిగడ్డివేస్తాడు అదితినకుండా,నీళ్లు తాగకుండా ఉండు మనయజమాని రేపటి సరుకులు బాడుగ బండిపై వేసుకువస్తాడు .ఇలానెలలో అప్పుడు అప్పుడూ చేసి కావలసినంత విశ్రాంతి పొందవచ్చు "అన్నది గాడిద.
గాడిదసలహానచ్చినఎద్దు మరుదినం ఆసలహ అమలుపరిచింది. అదిచూసి కంగారు పడిన శివయ్య ఇప్పుడు ఎలా పెద్దరామయ్యగారిఇంట వివాహం ఉంది అందుకు కావలసిన సరుకులు తనదగ్గరకొనుగోలు చేయబోతున్నారు అనికంగారుపడుతూ వేరేదారి కనిపించక తనసరుకులబండికి గాడిదనుకట్టి గుంటూరువెళ్లివచ్చాడు. రాత్రికి బండి నుండి విముక్తి పొందిన గాడిద తనకు సంబంధంలేని విషయంలో తలదూర్చి తప్పుడు సలహా ఇచ్చినందుకుతనకు తగినశాస్తి జరిగిందని తెలుసుకొని బుద్దిగాఎవరికి తప్పుడు సలహాలు ఇవ్వకూడదని ఎవరిపని వారే చేయాలని తెలుసుకుని బుద్దిగా జీవించింది.
పిల్లలువిన్నారుగా తప్పుడు సలహా కథ విన్నారుగా తమకు సంబంధం లేనివిషయాలలో తలదూర్చి తప్పుడు సలహాలు ఇస్తే ఇలానే జరుగుతుంది"అన్నాడు రాఘవయ్యతాత.పిల్లలు బుద్ధిగా తలలు ఊపారు.