అమరావతి అనేఉరిలో శివయ్య అనే చేనేత కార్మికుడు ఉండేవాడు.మగ్గం నేయడంతో వచ్చేఆదాయంతో తనతల్లిని పోషించుకునేవాడు. ఆఊరిలో మంచివాడుగా పేరు పొందిన శివయ్యకు అమాయకత్వంతోపాటు గా వేపకాయంత వెర్రి ఉండేది. ఒక రోజు రాత్రి భోజనం ముగించి ఇంటిముందు మంచంపై మేను వాల్చిన శివయ్య,ఆకాశంలో పౌర్ణమి చంద్రుని చూసి అయ్యో చందమామ దిగంబరంగా ఉన్నాడు, అసలేచలికాలం వంటిపైన బట్టలు లేకుండా ఎలాఉండగలడు.చంద్రునికి ఎలాగైనా సహాయం చేయాలి అనుకుని తెల్లవారుతూనే నగరంలోని సాటి నేత కార్మికుల వద్దకు వెళ్ళి "నేను చంద్రుడు కుటుంబానికి బట్టలు నేయబోతున్నాను మీరంతా సహాయం చేయాలి "అన్నాడు. శివయ్యవెర్రిచేష్ఠలకు నవ్వుకున్న ఆఊరిజనం 'చంద్రునికొనూలుపోగు 'అని తలా ఓనూలుపోగు శివయ్యకు యిచ్చారు. అలాసేకరించిన నూలు పోగులతో మరలా పౌర్ణమి నాటికి బట్టలు సిద్దంచేసి ,రమణయ్యశెట్టి గారి కిరాణ అంగడిలో చంద్రుని కుటుంబానికి విందుకు సరిపడా సరుకులు కట్టించుకొని అవిఅన్నిబుట్టలో పెట్టుకొని బుట్టను తలపైపెట్టు కుని చంద్రునిఇంటికి అడవి మార్గాన వెన్నేలవెలుగులో నడవసాగాడు, తెలతెలవారుతుండగా మబ్బులమాటున చంద్రుడు కనిపించకుండా పోయాడు.చంద్రుడు కనిపించకుండాపోవడంతో ఏంచేయాలో తెలియని శివయ్య దగ్గరలోని ఆలయంముందు ముగ్గుపెడుతున్న అవ్వనుచూసి "అవ్వ చంద్రయ్య యింటికి ఎటువెళ్ళాలి"అన్నాడు.
"అదిగో ఆచెరువు గట్టునఉన్నదే చంద్రయ్య ఇల్లు అక్కడే తనభార్య బిడ్డలతో కాపురం ఉంటున్నాడు"అంది.
ఈలోపు పూర్తిగా తెల్లవారడంతో చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోయాడు.చెరువు గట్టు ఇంటితలుపు తడుతూ'చంద్రయ్య' 'చంద్రయ్య' అనిపిలిచాడు శివయ్య.'ఎవరు'అనితలుపు తీసాడు చంద్రయ్యఅనే ఆయింటి వ్యక్తి.
"నాపేరు చొక్కరాతి శివయ్య మాది సుబ్బారాయుడి అనే గ్రామం ఇవిగో బట్టలు. ఓకపూట విందూకు సరిపడా వంటసరుకులు తెచ్చాను"అని తలపైనున్న సరుకులబుట్ట అందించాడు.
యితను ఎవరితరపు చుట్టమో తెలియని చంద్రయ్య దంపతులు ఒకరిముఖం ఒకరుచూసుకున్నారు."త్వరగా వంటచేస్తే భోజనం చేసినేబయలు దేరుతా.నేవెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని ఆచెట్టునీడన ఓకునుకు తీసివస్తా "అని శివయ్యవెళ్ళిపోయాడు .గతరొండురోజులుగా కూలిపని దొరకనికారణంగా పస్తులు ఉండటంతో దేముడే శివయ్యను పంపించాడని సంతోషించిన చంద్రయ్యభార్య మధ్యాహ్నానికి వండి వడ్డించింది.నూతనవస్త్రాలతో శివయ్య తోకలసి అందరు భోజనం చేసారు. భోజనం చేసిన శివయ్య చేయికడుగుతూనే "మరినేవస్తా పొద్దు పోఏలోపు ఇల్లు చేరాలి"అని వేగంగా నడుస్తూ రాత్రికి తన ఇల్లుచేరాడు శివయ్య.
మరుదినం ఊరిలోనివారందరికి జరిగిన విషయం వివరించాడు శివయ్య. చంద్రయ్య పేరు ఉన్న ఓపేదవాడికి బట్టలు,మంచిభోజనం శివయ్య కారణంగా వారికిదక్కాయి అని సంతోషించారు.
రాత్రిభోజనం ముగించి ఎప్పటిలా మంచంపై వాలిన శివయ్యకు ఆకాశంలో చంద్రుడు మరలా బట్టలు లేకుండా కనిపించాడు.అరెరే ఉదయం తొడిన బట్టలు ఇంతలోకే మాసి పోయాయా ,వాటిని చంద్రయ్య భార్య ఉతికి ఆరవేసి ఉంటుంది,త్వరలోనే చంద్రుడికి మరోజత బట్టలు యివ్వాలి అనుకుని నిద్రలోనికి జారుకున్నాడు వెర్రి శివయ్య.
బాలలు ఆనాటి నుండే చంద్రునుకో నూలుపోగు అనే నానుడి పుట్టింది.అన్నాడు రాఘవయ్య తాతగారు.
పిల్లలు అందరూ శివయ్య తెలివికి కిలకిలానవ్వారు.