లక్ష్యం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Lakshyam

అమరావతి నగరంలో అటవిశాఖ అధికారిగా పదవివిరమణ చేసిన రాఘవయ్య తాత గారు చెప్పే కథలకోసం యింటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలు అందరు చేరారు, వారికి మిఠాయిలు పంచిన తాతయ్య...."పిల్లలు కిలోమీటర్లదూరం శ్రమించతిరిగి తేనే సేకరించే తేనేటీగనుచూసి పొదుపు నేర్చుకొండి.రాళ్ళదెబ్బలను తగులుతున్నా మనకు తీయని ఫలాలను అందించే చెట్లలను చూసి ఓర్పు అలవరుచుకొండి.తనుకాలుతూ లోకానికి వెలుగులు యిచ్చే దీపాన్ని చూసి సేవాభావం అభ్యసించండి.ప్రతిఫలం ఆశించకుండా వీచే గాలిని,వెలిగేసూర్య-చంద్రులను చూసి నిస్వార్దత అలవరచుకొండి. దారిలో ఎన్నిఅడ్డంకులు ఎదురైనా తనగమ్యంచేరే నీటి ప్రవాహన్నిచూసి లక్ష్యంనిర్ణయించుకొండి. ఈరోజు మీకు లక్ష్యం దిశగా ఎలాపయనించాలో, మనం అనుకున్నది ఎలాసాధించాలో తెలుసుకొండి.

ప్రతి వ్యక్తికి, సమూహానికి, వ్వవస్థకు, సంస్థకు తాము చేయ బోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు సాగుతారు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు, ప్రణాళికా బద్ధంగా వ్రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని తప్పనిసరిగా ఒక లక్ష్యం అంటు ఒక టుంటుంది. లక్ష్యము లేనిది గమ్యము లేని ప్రయాణము వంటిది. నిరుపయోగము. ప్రతి పనికి ఒక లక్ష్యము వుంటుంది. అది చిన్న పని గాని, పెద్ద పని గాని, మహా కార్యము గాని, దానికి ఒక లక్ష్యముంటుంది. అదే విధంగా మంచి పనికి గాని, చెడు పనికి గాని, దుర్మార్గపు పనికి గాని ఒల లక్ష్యము వుంటుంది. ఒక దొంగ, దొంగ తనానిని వెళుతూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుంటాడు. ఆ విధంగా పని ప్రారంబిస్తాడు. ఒక నిరుద్యోగి ఉద్యోగము కొరకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ మార్గములో పాటు పడుతుంటాడు. ఒక కార్య సాధనకు ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రణాళిక ప్రకారము పని చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా సాధించ వచ్చు. అందుకే లక్ష్య సిద్ధి ప్రాప్తి రస్తు. అంటూ దీవిస్తుంటారు. కథరూపంలో తెలియచెపుతాను.....

పగలు అడవిలో వేటాడి అలసిన చిరుతపులి ఎత్తయిన చెట్టుపైకి ఎక్కి రాత్రంతా హయిగా నిద్రపోయి ఉదయం నిద్రలేచి ఆహరంకొరకు పరిసరాలను పరిశీలించసాగింది.ఆప్రాంతానికి కొంతదూరంలో పచ్చిగడ్డి మేస్తూ పలు జంతువులు కనిపించాయి. కుంటుతూ నడుస్తున్న జింకపై తనదృష్టి నిలిపి చెట్టుదిగి ఆజింకను"లక్ష్యం"చేసుకుని ఆదిశగా పచ్చిగడ్డిలో దాగుతూ రాళ్ళు ముళ్ళును లెక్కచేయకుండా జింక ను అందుకునే ప్రయత్నంగా వేగంగా పరుగుతీయసాగింది. చిరుత రాకగుర్తించిన కొన్ని జంతువులు అరుస్తూ పరుగుతీయసాగాయి. కొన్నిజంతువులు ఆపద ఎటునుండి వస్తుందో తెలియని కొన్నిజంతువులు చిరుతచేరువగా వచ్చాయి కాని చిరుత తన ఏకాగ్రత చెదరకుండా లక్ష్యంచేరుకుని జింకను అందుకుంది.

బాలలూ యిక్కడ చిరుతపులి లక్ష్యం తనుఎంచుకున్న ఆహరం అందుకోవడం ,చిరుత తనఆహరలక్ష్యదిశగా పెట్టుకొని విజయం సాధించింది.మీరు నిర్ధిష్టమైన లక్ష్యాన్నిఎంచుకొని మనోధైర్యంతో ముందుకుసాగుతూ ఉన్నత విద్యలునేర్చి పెద్దలఎడల గౌరవం సాటివారిపై ప్రేమ దయాగుణంకలిగినవారై సమస్తమానవాళికి సందేశాత్మక మార్గదర్మకులుగా రేపటితరం కరదీపికలుగా వెలుగుతూ ఎదగండి,పట్టుదలతో అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యదిశగా సాగితే విజయంమీదే.పోరాటమే విజయానికి ఏకైకమార్గం ప్రపంచానికి భారతదేశకీర్తి ప్రతిష్టలను తెలియజేయవలసినబాధ్యత మీఅందరి పైనాఉంది మీరూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుని.ఆదిశగాముందుకు కదలండి"అన్నాడు తాతయ్య.

బాలలు బుద్దిమంతుల్లా తలలు ఊపారు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు