ఒక కాకి చెట్టు మీద దిగాలుగా కూర్చోని ఉన్నది.చాలా సేపటి నుంచి అలాగే కూర్చుని ఉన్నది. చుట్టుపక్కల ఉన్న ఉన్న కాకులను ఎవరిని పలకరించలేదు ఎవరితోని మాట్లాడలేదు కొద్దిసేపటి తర్వాత పక్క చెట్టు మీద ఉన్న ఒక కాకి ఈ కాకి దగ్గరకు వచ్చింది ఏంటి మామ ఇందాకటి నుంచి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నవే ఏంటి అలా దిగాలుగా ఉన్నావు అని అడిగింది అందుకు మొదటి కాకి ఏం చెప్పమంటావు నా బాధలు ఇక్కడ గూట్లో గుడ్లు పెట్టి వెళ్ళాను ఆ కింద పుట్టలో ఉన్న పాము వచ్చి తినేస్తుంది రోజు. బాధ ఏమని చెప్పను రోజు ఇలాగే చేస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ చెప్పింది. అయ్యో మిత్రమా ఇది ఎప్పుడు నుంచి చేస్తుంది ఇలాగా నాకు ఈ విషయం తెలియదే నువ్వు ఎప్పుడూ చెప్పలేదు దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అంటూ ఆలోచించసాగింది. మిత్రమా ఇలాంటి సమస్య మన పూర్వక కూడా ఒకసారి వచ్చింది నీకు తెలుసు కదూ ఆ కథ గురించి అని అన్నది అవును మామ నేను కూడా విన్నాను మా అమ్మమ్మ చెప్పింది అప్పట్లో ఒకసారి మన మన జాతి వాళ్లకు ఇలాగే సమస్య వస్తే అప్పట్లో రాజు గారి భార్యను యొక్క రత్నాలహారం తీసుకువచ్చి మన కాకి ఆ పాము పుట్టలో పడేసిందట. మహారాణి గారి నగ కాబట్టే వెంటనే బటులందరూ వెతకడం ప్రారంభించారు దాంతో వారు వెతుక్కుంటూ వచ్చి పుట్టనంత తవ్వేశారు పాము బయటకు వచ్చింది పాములు చూసి బటులు చంపేశారు ఆ విధంగా ఆ కాకికి వాళ్ళ పిల్లలను తినేటటువంటి పామును శిక్షించింది ఉపాయంతో తన సమస్యను పరిష్కరించుకున్నది కానీ ఈ రోజుల్లో రాజులు లేరు రాజ్యాలు లేరు లేవు. మహారాణులు అలా బహిరంగ స్నానాలు చేసే వాళ్ళు లేరు వాళ్ళ నగలు ఎత్తుకొద్దామంటే ఎలా ఏం చేయాలి అనేది దిగాలుగా అన్నది చూద్దాం ఇంకేదైనా కొత్తవి ఉపాయం ఆలోచిద్దాం కానీ ఆ విషయాన్ని పట్టి ఆలోచించి ఏదైనా కొత్తరకంగా చూద్దాం అని రెండో కాకి చెప్పి అయినా ధైర్యంగా ఉండు ఏదో ఒకటి చేద్దాం కానీ నువ్వు దిగాలు పడకు అని చెప్పి వెళ్ళిపోయింది. ఖాళీగా ఉన్న తన గూడును చూసి కాకి పెద్దగా ఏడవ సాగింది నాలుగు రోజుల క్రితం గుడ్లను పెట్టింది పొదిగితే కొన్ని రోజులకు పిల్లలు అవుతాయి అని ఎంతో సంబరంగా ఉన్నది కానీ ఇంతలోకే ఈ పాము ఎప్పుడు వచ్చిందో ఈరోజు ఇంటికి వచ్చేసరికి గుడ్లు లేని లేవు ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి చేస్తుందో ఏమో అంతకుముందు కూడా గుడ్లు తక్కువగా ఉన్నాయి అని అనుకుంది కాకి కానీ తనే లెక్క పెట్టడం తప్పేమో అనుకున్నది నిన్న చూసేసరికి కింద పుట్టలోకి పాము పోతూ ఉన్నది అందుకే పాము తినేస్తుంది అని అర్థమైంది. పాపం కాకి రాత్రంతా రోదిస్తూనే ఉంది తన పిల్లల్ని తలుచుకొని బాధపడుతూనే ఉంది తన సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాకుండా ఉన్నది ఏం చేయాలో తోచక అలాగే కూర్చొని ఉన్నది కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద మిగతా మిత్రులందరికీ వచ్చి కాకి దగ్గర చేరారు అందరూ బాధపడ్డారు ఏం చేద్దాము ఎలా చేయాలి అని ఆలోచించసాగారు కానీ ఎవరికి ఏ ఉపాయము తట్టట్లేదు కొద్దిసేపటి తర్వాత ఆ గుంపులో ఉన్న ఒక బుజ్జి కాకి పిల్ల నేనొక ఉపాయం చెప్పనా అని అడిగింది పెద్దకాపులందరూ నీకేం తెలుసు నీ మొహం నువ్వు నీకు ఉపాయం తెలుస్తది అని అన్నారు కాకి పిల్ల నేను చెప్తా నేను చెప్తా అంటూ వెంట పడసాగింది ఛీ పో అవతలికి మేము అసలే దిగాలుగా ఉంటే అని కాకులు అరిచి దూరంగా పంపేశాయి అయినా ఆ కాకి పిల్ల నేను చెప్తా ఉదయం అంటే వినరే అంటూ వెంట పడుతూనే ఉంది ఆ సమయంలో ఒక పెద్ద కాకి పోనీలే దానికి ఏం ఉపాయంతో వచ్చిందో విందాం చూద్దాం అని అన్నది. సరే చెప్పు ఏంటో నీ ఉపాయం ఏంటో చెప్పు అని అడిగింది ఒక కాకి వెంటనే ఉషారుగా ముందుకు వచ్చింది కాకి పిల్ల మరేమో మరేమో మనుషుల దగ్గర సెల్ ఫోన్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు అని అడిగింది అది సరేగాని ఉపాయం చెప్తాను అని చెప్పి నువ్వేంటో సెల్ ఫోను అంటావేంటి అసలు సంగతి మానేసి వేరే వేరే మాట్లాడుతావ్ ఎందుకు? నువ్వు అందుకే పిల్లవు నీకేం తెలియదు అని చెప్పానా అని పెద్ద కాకి విసుక్కున్నది కాదు తాత నేను చెప్పే విషయం పూర్తిగా వినండి చెప్పే విషయం పూర్తిగా వినండి అని బతిమాలింది కాకి పిల్ల. సరే చెప్పు ఏంటో నీ నాసా ఆపి అన్నయ్య పెద్దకాకులు అప్పుడు పిల్ల కాకి మళ్ళీ మొదలెట్టింది మనుషుల దగ్గర ఉండే సెల్ ఫోన్ లో అన్ని విషయాలు ఉంటాయట అన్ని విషయాలు తెలుస్తాయట వాళ్లకి ఇప్పుడు సెల్ ఫోన్ అంటే చాలా ప్రాణం అంట అని చెప్తూ ఉండగానే పెద్ద కాకి మళ్ళీ అరిచింది ఎంతసేపు సెల్ ఫోను సెల్ ఫోను అంటావేంటి ఇక్కడ పాము వచ్చి పిల్లల్ని తినేస్తోంది అని మేము బాధపడుతుంటే నీ సెల్ ఫోన్ కూడా ఆపు అని అన్నది కాకి పిల్ల బుంగమూతి పెట్టుకొని నేను చెప్పేది పూర్తిగా వినరా అని అన్నది సరే చెప్పు చెప్పు అన్నయ్య విసుగ్గా పెద్దకాకులు ఇప్పుడు మనలో ఎవరో ఒకరు వెళ్లి ఆ సెల్ఫోన్ తీసుకువచ్చి పాము పుట్టలో పడేస్తే వాళ్ళు వచ్చి సెల్ఫోన్ కోసం వెతుకుతారు కదా అప్పుడు పాము పుట్టను తవ్వేసి పాములు చంపేస్తారు కదా ఈ కొత్త ఐడియా ఎలా ఉంది అని అడిగింది నీ మొహం లాగా ఉంది సెల్ఫోన్ కోసం ఎవరైనా పాము పుట్టను తవ్వేస్తారా ఏంటి అని అడిగాయి కాకులన్నీ మీకు తెలియదు తాత ఇప్పుడు మనుషులకు ప్రాణం కన్నా కూడా సెల్ఫోనే ఎక్కువ హాస్పిటల్లో ఉండే కూడా సెల్ఫోన్ అనే చూస్తూ ఉన్నారు సెల్ ఫోను లేకపోతే పిచ్చి పట్టిన వాళ్ళ లాగా తిరుగుతూ ఉన్నారు అందువలన సెల్ ఫోను కాసేపు కనపడకపోతే చాలా బాధపడతారు మనుషులు సెల్ ఫోను లేకుంటే పిల్లలు అన్నం కూడా తినడం లేదు ఇంట్లో ఆడవాళ్లు అన్నాలు కూడా వండడం లేదు కాసేపు కరెంటు పోతేనే అందరూ గిలగిలా కొట్టుకుంటున్నారు కాబట్టి సెల్ ఫోను లేనిది వాళ్లకు ఒక్క క్షణం కూడా గడవదు అందువల్లే సెల్ ఫోన్ ఎత్తుకొచ్చేస్తే దానిని వెతుక్కుంటూ మన వెనకే వస్తారు అంటూ వివరంగా చెప్పింది కాకి పిల్ల. దీని మొహం సెల్ఫోన్ అంటే ఇలా ఉంటుందా అని పెద్దకాకులు విసుగ్గా వాళ్ళ చర్చల్లో మళ్ళీ మునిగిపోయాయి కానీ పిల్ల కాకులు చాలామంది ముందుకు వచ్చి తాత ఈ విషయం చాలా కరెక్ట్ మీకు మనుషుల గురించి తెలియడం లేదు మీరు పట్నంలోకి రావడం లేదు కదా మీకు ఈ అడవిలో ఉండే విషయాలు తప్ప ఊళ్ళలో ఉండే విషయాలు తెలియడం లేదు మీరు ఒక్కసారి ఊళ్లోకి వచ్చి చూడండి అందరి చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని ఎలా తిరుగుతున్నారో వాళ్ళని చూశాక మీరు అభిప్రాయం మార్చుకుంటారు అని చెప్పాయి పిల్లకాకులు ఎంత చెప్పినా కూడా పెద్దవాళ్ళు వినలేదు ముందు మీరు పట్నంలోకి వచ్చి మనుషుల చేతిలో సెల్ ఫోన్లు ఎలా వాడుకుంటున్నారు చూసిన తర్వాత ఈ ఆలోచనను పాటిద్దురుగాని ముందు వాళ్ళ చేతిలో సెల్ఫోన్లు చూపిస్తాం రండి అని పిలకాకులు బలంగా చెప్పాయి. పిల్లకాకుల గోల భరించలేక కాకులు పట్టణంలోకి బయలుదేరాయి వాళ్లు ఊర్లోకి వెళుతూ ఉండగానే ప్రతి మనిషి చేతిలోనూ సెల్ ఫోన్ కనిపించింది నిలబడి ఉన్నవాళ్లు సెల్ఫోన్ చూస్తూ ఉంటూ ఉన్నారు బండి నడుపుతూ కూడా సెల్ఫోన్ చూసుకుంటూ వెళ్లే వాళ్ళు కనిపించారు బండి నడుపుతూ ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు చాలామంది ఇళ్లల్లోకి వెళ్లి చూద్దాం అనుకుంటూ వెళ్లిన కాకులకు తల తిరిగిపోయే దృశ్యాలు కనిపించాయి ఇంట్లో ఆడవాళ్లు వాటిని ఫోను చూసుకుంటూనే వంటలు వండుతున్నారు పిల్లలు అందునా పసిపిల్లలు ఫోన్లో బొమ్మలు చూసుకుంటూ ఏడవడం ఆపేస్తున్నారు పెద్దకాకులకు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యం కలిగింది ఒకవేళ ఈ పిల్ల కాకులు చెప్పింది నిజమేనేమో అనుకుని మళ్ళీ అడవి బాట పట్టాయి. ఊరు బయటకు వెళ్లాక కాకులన్నీ కలిసి సమావేశమై ఈ ఐడియా పాటించవచ్చు అని నమ్మకం కుదిరింది తర్వాత ఒకరోజు ఊర్లోకి వెళ్లి ఒక మనిషి చూస్తూ ఉండగా చేతిలో సెల్ఫోన్ లాక్కొని కాకి ఎగురుకుంటూ పైకి బయలుదేరింది ఆ మనిషి ఈ సెల్ ఫోను చూసుకుంటూ వెనకనే రావడం మొదలుపెట్టాడు కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆయన చూస్తుండటం గా చూసి కాకి ఈ సెల్ ఫోను పాము పుట్టలో పడేసింది అతను పాము పుట్టలో పడేసిన సెల్లును చూసి వెనక్కి వెళ్ళిపోయాడు కొంతమందిని తీసుకొని వెంటబెట్టుకొని మళ్లీ వచ్చాడు ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళ చేతుల్లో పలువు గడపలు పారా వంటివన్నీ ఉన్నాయి వచ్చిన వాళ్ళు పుట్టాను గబగబా తవ్వడం మొదలుపెట్టేశారు పాము చేసేదేం లేక బయటకు వచ్చేసింది పామును వదలకుండా వాళ్లు చంపేశారు. కాకులన్నీ చాలా సంతోషించాయి పిల్లకాకుల్ని అభినందించాయి ఇప్పుడు వస్తున్న ఈ సెల్ ఫోను గురించి సమాచారం అందించినందుకు పిల్లకాకులను పెద్ద కాకులు చాలా ప్రశంసించాయి అందరికి ఐస్ క్రీమ్ కొనిపెట్టాయి కాకి మిత్రుడు యొక్క సమస్య తీరింది కాబట్టి అన్ని కాకులు సంతోషంగా కలసికట్టుగా గోల చేయడం ఆరంభించాయి కాకుల ఐకమత్యత వర్ధిల్లాలి అంటూ పెద్దగా అరవసాగాయి