చెరువు గట్టుకు బయలుదేరాడు నక్క. ఇంతలో పిల్లి ఎదురువచ్చాడు
''రా అల్లుడు సమయానికి వచ్చావు నేను చెరువులో పీతలు పట్టడానికి వెళుతున్నా''అన్నాడు. ''సరే పద ''అంటూ నక్కని అనుసరించాడు పిల్లి.
'' రాయి తీయలేనివాడు కూట్లో రాయితీస్తాడా ఏట్లో ? ''అన్నది పిల్లరామచిలుక.
''చిట్టి చిలకమ్మా పొద్దున్నే తిక్కల సామెతలు ఎవరిమీద సంధిస్తున్నావు ''అన్నాడు నక్క.
''ఇంకెవరు బావకోతిపైనే అన్నితనకు తెలుసునని విర్రవీగుతున్నాడు అందుకే ఈసామెత వేసా విప్పలేక తెల్లమొఖం వేసాడు '' అన్నది పిల్లరామచిలుక.
సింహరాజు ఘర్జన వింటూనే నక్క,పిల్లి పొదలమాటున, కోతి,పిల్లరామ చిలుక చెట్టుపైన నక్కి ఉన్నాయి.
ఇంతలో దారితప్పి మేకపిల్లను నేరుగా సింహరాజువద్దకు వచ్చింది. మేకపిల్లను చూసిన సింహం ''ఎవరు నువ్వు నిన్ను ఎన్నడూ ఈ అడవిలో చూడలేదే'' అన్నాడు.
పరిస్ధితి గమనించిన కోతి ''ప్రభు ఈమేక పిల్ల దేవదూత స్వర్గంనుండి ఎగురుతూ వచ్చింది ''అన్నాడు.
'' ఏమిటి ఈమేక స్వర్గనుండి ఎగురుతూ వచ్చిందా? నాచెవిలో ఏమన్న చేమంతి పువ్వు కనిపిస్తున్నాయా ''అన్నాడు సింహరాజు కోపంగా . ''ప్రభువులు కోపగించకండి నేను ఈమేక మేఘూలలో ఎగరడం చాలాసార్లు చూసాను నేను ఈమేక స్వర్గ దూతఅని నిరూ పిస్తాను.కాకుంటే తమరు నేచెప్పేదానికి అనుమతిఇవ్వాలి'' అన్నాడు కోతి.
''అలాగే మేకను గాలిలో ఎగిరిచూపమను '' అన్నాడు సింహం.
''మేక పాపా నువ్వు స్వర్గానికి ఎగిరి వెళ్ళడాని ఎంతదూరం నుండి పరిగెత్తి ఊపు తెచ్చుకుంటావో అంతదూరం పరుగుతీసి అనంతరం సింహారాజు గారిముందు ఆకాశంలో ఎగిరి చూపించు ''అన్నాడు కోతి.
తను పారిపోవడానికి కోతి సహాయపడినందుకు మనసులో కోతికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కఉదుటున శక్తినంతా కూడదీసుకుని పరుగుతీస్తూ సింహానికి అందనంత దూరం వెళ్ళింది మేకపిల్ల.
ఎంతసేపటికి మేకపిల్ల తిరిగి రాకపోవడంతో కోతి తను మోసగించిదని గ్రహించి సింహం ''కోతి నన్నే మోసగిస్తావా సమయం వచ్చినప్పుడు నీకు తగిన గుణపాఠం చెపుతా '' అన్నాడు.
''సింహారాజా స్వర్గ నరకాలు ఉండవు. స్వర్గం అంటే కష్టపడి సంపాదించి కడునిండుగా తినడం కంటినిండుగా నిద్రపోవడం. నరకం అంటే సోమరితనమే, ఇప్పుడు తమచెవిలో చేమంతులు కాదు కాలిఫ్లవర్ కనిపిస్తుంది ''అన్నదికోతి.
అవమానంతో ఘర్జిస్తూ సింహరాజు వెళ్ళిపోయాడు.
'నక్క,పిల్లి,పిల్లరామచిలుక కోతి తెలివికి మెచ్చుకున్నాయి. '' అదిసరేకాని నువ్వేదో ఇందాక తిక్కల సామెత నాపైనవేసావే ఏమిటి అది ''అంది కోతి. కిలకిలలాడిన పిల్లరామచిలుక ''కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా .''అన్నది.
అక్కడ ఉన్న అడవి జీవాలు ఘొల్లున నవ్వాయి.