తెలుసుకున్న తప్పు - డి.కె.చదువులబాబు

Telusukunna tappu

రామ్మూర్తి,సుజాతలకు రఘు ఒక్కడే కొడుకు.పదవ తరగతి చదువుతున్నాడు. పదవతరగతిలో చేరింది మొదలు రామ్మూ ర్తి,సుజాత కొడుకుపై తీవ్రంగా ఒత్తిడి చేయసాగారు. 'ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాము.మన బంధువులు,స్నేహితులు,ప్రత్యర్థులు,చుట్టు పక్కలవాళ్లు అందరూ నీమీద ఓ కన్నేసి ఉన్నారు.నువ్వు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అందరి నోళ్ళూ మూయించాలి. లేకుంటే తలెత్తుకుని తిరగలేం.'అంటూ నానా మాటలు చెబుతూ పరీక్షలో మెుదటి స్థానం రాకుంటే బ్రతకటమే వృథా అనే స్థితికి తెచ్చారు. రఘు రాత్రీపగలు బాగా కష్టపడి చది వాడు.పరీక్షలు వ్రాసాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి.అర్థంకాని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయక పోవటం,ఇష్టమైన సబ్జెక్ట్ చదవటానికి ఎక్కు వ సమయం కేటాయించటం,పరీక్షల్లో బాగా వచ్చిన ప్రశ్నలను పట్టుకుని పేజీలు పేజీలు రాసి సమయాన్ని కోల్పోవటం,గణిత సమస్యలు సరిగాఅర్థం చేసుకోకుండా తొందరపడి చేయటం, అమ్మ,నాన్నల మాట లు పదేపదే గుర్తుకు రావటంతో తీవ్ర వత్తిడి కి లోను కావటం, మొదలగు కారణాల వల్ల రఘు పరీక్షల్లో తప్పాడు. రామ్మూర్తి,సుజాత కొడుకును అవమానంగామాట్లాడారు.నిందించారు.వారిద్దరూ రఘుకంటే ముందే సర్వం కోల్పోయినట్లుఢీలాపడిపోయారు.ఇల్లంతటా స్మశాన నిశ్శబ్దం ఆవరించింది.ఇవన్నీ రఘును బాగా కలిచి వేసాయి.అప్పటికే రఘులో 'పరీక్ష లేజీవితం ,పరీక్ష తప్పితే బంధువులకు ,తెలిసినవారికిముఖం చూపించలేమన్న ఆలోచన బలంగా పాతుకుపోయింది.ఊరు వదిలి పారిపోవాలనుకున్నాడు.నాన్న జేబులో డబ్బుదొంగిలించిబస్టాండుచేరుకున్నాడు. 'ఎక్కడికెళ్ళాలా?'అని ఆలోచిస్తూ దిగులుగా ఏడ్పు ముఖంతో కూర్చుని ఉన్నాడు.రఘు కూర్చున్న చోటుకెదురుగా ఉన్న షాపు యజమాని రామారావుఒంటరిగా దిగులుగా ముఖం వ్రేలాడేసుకుని వున్నరఘును చాలా సేపటినుంచి గమనిస్తున్నాడు.ఇంటినుండి పారిపోయి వచ్చిన పిల్లవాడిలా వున్నాడనే అనుమానంకల్గింది.దగ్గరకివచ్చి పలకరించాడు.మాటలుకలిపి విషయం తెలుసుకున్నాడు. "నేనుభోజనానికి ఇంటికెళ్తున్నాను.మా ఇంటికెళ్దామురా!"అన్నాడు. ఓ అరగంట తర్వాత షాపును మరోమనిషికి అప్పగించి రఘును పిల్చుకుని వెళ్ళాడు. రఘును తనతోపాటు భోజనానికి కూర్చోమన్నాడు.భోజనం చేస్తుండగా ఇంటిముందు బైక్ ఆగింది.ఓవ్యక్తి ఇంట్లో కొచ్చాడు. రామారావు ఆయువకుడిని చూపించి "ఈ అబ్బాయి నాపెద్ద కొడుకు.పదవతరగతి రెండుసార్లు తప్పాడు.కానీ తర్వాత రెట్టింపు పట్టుదలతో చదివి,పాసయ్యాడు.బి.ఎడ్. చేశాడు.ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు"అని చెప్పాడు. భోజనంచేసి హాల్లోకొచ్చారు.అప్పుడే లోపలికొస్తున్న మరో వ్యక్తిని చూపించి "ఈఅబ్బాయి నా చిన్నకొడుకు. వీడు గణితంలో బాగా వెనుకబడి వుండేవాడు.మూడుసార్లు పరీక్షవ్రాసి పదవతరగతి ఉత్తీర్ణుడయ్యాడు.తర్వాత గణితంజోలికెళ్ళలేదు.ఇంటర్ లో తనకిష్టమైన గ్రూప్ తీసుకున్నాడు. డిగ్రీలోబిఏ చదివాడు.తర్వాత ఎమ్.ఏ చేశాడు.ప్రస్తుతం ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్నాడు.వాళ్ళనే అడిగి చూడు. చెబుతారు"అన్నాడు రామారావు. ఆయన కొడుకులిద్దరూ రఘు గురించి తెలుసుకున్నారు."బాబూ పదవతరగతో,ఇంటరో తప్పినంతమాత్రాన ఇంతగా బాధపడాల్సిన అవసరంలేదు.ప్రస్తుతం పెద్దపెద్ద హోదాల్లో వున్నవారిలో పరీక్షలుతప్పి,తర్వాతకష్టపడి ఉన్నతస్థాయికిచేరినవారున్నారు.నీకూ మాలాగే మంచి భవిష్యత్తు వుంటుంది" అన్నారు. ఫోన్ నెంబర్ అడిగి రామ్మూర్తి,సుజాతను పిలిపించారు. ."రామ్మూర్తీ..!మీరు చాలా పొరపాటు చేసారు.పరీక్షలే జీవితమని,తప్పితే జీవితమేలేదనేస్థితికివీడినితెచ్చారు.జీవితం విలువవీడికిసరిగాచెప్పలేకపోయారు.పరీక్షలకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించలేదు.ఆ జాగ్రత్తలు చెప్పివుంటే పరీక్ష తప్పేవాడుకాదు.పరీక్ష తప్పితే మళ్ళీవ్రాసి ఉత్తీర్ణుడు కావచ్చని,పరీక్ష పోయినంత మాత్రానజీవితమే లేదన్నట్లు బాధపడకూడదని,తప్పటం వల్ల పట్టుదల పెరుగుతుందని,పునాది గట్టిపడుతుందని చిరునవ్వుతోధైర్యంచెప్పాలి.వేదనను తొలిగించే ప్రయత్నంచేయాలి.అలాగాక వీడిని ఇష్టమొచ్చినట్లు దండించారు. వీడికంటే ముందు మీరునీరసపడి పోయారు.మంచి మార్కులు రాకుంటే నల్గురూ నవ్వుతారు.మంచిమా ర్కులు సాధించటమే జీవితమనే భావాన్ని వాడి మనసులో బలంగా నాటారు. జీవితం చాలా విలువైనది.పరీక్షలు జీవితం లో ఒక భాగం మాత్రమే,పట్టుదలగాకృషిచేస్తే ఏదైనా సాధించవచ్చనే ఆత్మ స్థైర్యన్ని పిల్లళ్లో నింపాలి.మీరుచేసిన తప్పులు వాడి ఆలోచనలుతప్పుడుమార్గంలోనడిచేలాచేసాయి.నేడు అత్యున్నత స్థానంలో ఉన్న ఎందరో ప్రముఖులు చిన్నప్పుడు పరీ క్షలు తప్పినవారే...."అంటూ వారికి,రఘుకూఅనేక విషయాలు చెప్పారు వాళ్ళు. వారి మాటలతో రఘుకు,రామ్మూర్తి సుజాతకు వారి తప్పులు తెలిసాయి. తర్వాత గ్రేస్ మార్కులు కలపటం వల్ల రఘు ఉత్తీర్ణుడయ్యాడు. అపజయానికికారణాలనుకనుక్కుని,తప్పులు సవరించుకుని,మరింత పట్టుదలతో కృషిచేస్తే విజయాన్ని సాధించ వచ్చనే సత్యాన్ని రఘు గ్రహించాడు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న