స్నేహధర్మం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Snehadharmam

అడవిలో కుందేలు,కాకి, కోతి స్నేహంగా ఉంటూ ఉండేవి.ఓకరోజు గుడిలో తెచ్చుకున్న అరటిపళ్ళు ఓడిలో పెట్టుకుని చెట్టు పైన కొమ్మకు విశ్రాంతిగా ఆనుకుని చేతిలోని పెద్ద కొబ్బరిముక్క నింపాదిగా తింటున్నడు కోతి. నీరసంతో నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న కుందేలును చూస్తూ "కుందేలు మామా ఏమిటి బాగానీరసంగా ఉన్నావు" అన్నాడు.

" అవును అల్లుడు నిన్నటి నుండి ఆహారం లభించలేదు బాగా ఆకలిగా ఉంది నీవద్ద ఏదైనా ఉంటే పెడుదువు, నువ్వు నా స్నేహితుడవు కదా"అన్నాడు కుందేలు.

" మామ ఎక్కడన్న బావకాని వంగతోటకాడ కాదు అన్నారు పెద్దలు,స్నేహం వేరు అది కాలక్షేపానికే నేనుకూడా బాగా ఆకలి మీద ఉన్నా నావద్ద ఉన్న ఆహారం నాకే చాలదు"అన్నాడు కోతి.

వీరిసంభాషణ అంతా అదే చెట్టు కొమ్మల్లో గూడు కట్టుకున్న ఉంటున్న కాకివిని"ఛీ ఛీ నువ్వేం స్నేహితుడవు, మిత్రుడికి సహాయపడని స్నేహం వృధా రాత్రులు నాకు కళ్ళు కనిపించవు లేకుంటే తక్షణం కుందేలు ఆహారం సంపాదించి పెట్టేదాన్ని,స్నేహితు అంటే గొప్ప సలహాదారుడు.స్నేహం అంటే ఏమిటో వినండి నేను ప్రతిరోజు మన అడవి పక్కనే ఉన్న పాఠశాల పిల్లలు అహారం తినే సమయానికి వెళతాను. ఆక్కడ ఉండే పిల్లలు పిట్టగోడపైన పక్షులకు రోజు ఆహారంపెడతారు దాన్ని మేమంతా రోజు తింటాము. నిన్న రామం అనేవిద్యార్ధి ఆహారం తెచ్చుకోలేదు అతని స్నేహితులంతా అన్నానికి వెళుతూ రామాన్ని రమ్మన్నారు"లేదురా అమ్మకు జ్వరం ఈరోజు వంట చేయలేదు అందుకే నేను ఈరోజు అన్నం తెచ్చుకోలేదు" అన్నాడు రామం."నువ్వు తెచ్చుకోలేదు కాని మేమంతా తెచ్చుకున్నాంకదా! పద"అని ఒకరు చపాతి,మరోకరు పులిహార,వేరొకరు బ్రెడ్ జామ్,మరోకరు పెరుగు అన్నం పెట్టారు.అది స్నేహమంటే ఇప్పుడు తింటూ రేపటికి దాచుకోవడంకాదు కష్టంలోనూ, బాధలోనూ, ఆనందంలోనూ దుఖఃన్ని పంచుకునేవాడే స్నేహితుడు.ఎదటి వారికి పెట్టకుండా తినడం నాగరీకం కాదు ఉన్నంతలో ఆదుకోవడంలో ఓగొప్ప అనుభూతి ఉంటుంది అది అనుభవించే వారికే తెలుస్తుంది."అన్నదికాకి.

"కాకి అన్నా మన్నించు ఆకలిని ముందు సమస్త ప్రాణకోటి మోకరిల్లవసిందే! అన్నార్తులను,వ్యాథిగ్రస్తులను అందరు తప్పక ఆదుకొవలసిందే! నాతప్పుతెలుసుకున్నాను మరెన్నడు స్నేహితులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించను ఏదైనా నాకు ఉన్నతలో ఇచ్చి ఆదుకుంటాను" అని చెట్టు దిగిన కోతి రెండు పెద్ద అరటిపళ్ళు కుందేలుకు అందించి"మామా చాలా"అన్నాడు.

"చాలు అల్లుడు ఒకటి నాకు, మరొకటి మీ అత్తకు "అని కోతిబావ లోమార్పు తెచ్చినందుకు కాకి అన్నకు ధన్యవాదాలు తెలియజేసి,తన బొరియకు (ఇంటికి) బయలుదేరాడు కుందేలు మామ.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న